Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొద్దస్తమానం కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం వల్ల కండ్ల నుంచి నీరు కారడం, కండ్ల మంట వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. అలాగే అదే పనిగా టీవీ, స్మార్ట్ఫోన్లను చూడడం వల్ల కండ్లు కాంతిని కోల్పోయి త్వరగా అలసిపోయినట్టుగా అనిపిస్తాయి. తగినంత విశ్రాంతి లేక కండ్ల చుట్టూ నల్ల వలయాలు ఏర్పడుతాయి. వీటి నివారణకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
కండ్లు విపరీతంగా మండుతుంటే ఐసు ముక్కతో కంటి చుట్టూ సున్నితంగా రాయాలి. ఇలా చేయడం వల్ల రిలాక్స్ అవుతారు.
బడలికగా ఉన్నపుడు కీరదోసను కండ్లపై పెట్టుకోవాలి. కీరదోసలోని కూలింగ్ గుణాల వల్ల కండ్ల మంటలు తగ్గుతాయి.
రాత్రి నిద్రపోయే ముందు నువ్వులనూనె లేదా బాదం నూనెను కండ్ల చుట్టూ మసాజ్ చేసుకుని ఉదయాన్నే నీళ్లతో కడగాలి. ఇలా చేయడం వల్ల కంటి చేయడం వల్ల కంటి చుట్టూ ఉన్న నల్లని వలయాలు, ముడతలు పోతాయి.
ఆలూ ముక్కలను గుండ్రంగా కోసి గంట సేపు ఫ్రిజ్లో ఉంచి రెండు కండ్ల మీద కాసేపు పెట్టుకుంటే కండ్ల ఉబ్బరింపు, దురదలు తగ్గుతాయి.
కండ్ల మంటను తగ్గించడంలో ఉప్పు నీళ్లు బాగా పని చేస్తాయి. గోరు వెచ్చటి నీటిలో కాస్త ఉప్పు వేసి తెల్లని గుడ్డను అందులో ముంచి దానిని కళ్ల మీద వేసుకుని 25 నిమిషాలు అలాగే ఉండాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి.
ధనియాలు కూడా కండ్ల మంటల్ని తగ్గిస్తాయి. గ్లాసు నీటిలో ఒక టీ స్పూను ధనియాలు వేసి రాత్రంతా నాననిచ్చి ఉదయం వగడట్టి ఆ నీళ్లు తాగాలి.
కండ్ల మంటను, వాపును తగ్గించడంలో ఎగ్ వైట్ బాగా పని చేస్తుంది. తెల్లసొనను ఒక బౌల్లో తీసుకుని అందులో తేన చుక్కలు వేసి కండ్ల మీద రాయాలి. 15 నిమిషాల తర్వాత నీటితో కండ్లను శుభ్రంగా కడుక్కోవాలి.