Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాంగ్‌మిలా జిమిక్... ఓ ఒంటరి తల్లి. ఇప్పుడు ఆమె ఓ వ్యాపారవేత్త. తన స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం చేసిన గూస్బెర్రీ క్యాండీలే ప్రస్తుతం ఆమెకు జీవనోపాధిని కల్పించాయి. ఆమె తయారు చేసిన క్యాండీలకు తన వాళ్ళలో ఆదరణ దొరకడంతో 2019లో షిరిన్ పేరుతో ఓ సంస్థను స్థాపించారు. గ్రామీణ ప్రాంతంలో ఓ వ్యాపారవేత్తగా మంచి పేరు సంపాదించి ఎంతో మంది మహిళలను ప్రభావితం చేశారు. అందుకుగాను ఆమె ఇటీవల అస్సాం మహిళా పారిశ్రామికవేత్తల అవార్డును సైతం అందుకున్నారు. ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం...
యాంగ్‌మిలా మణిపూర్‌లోని ఫరూంగ్ పర్వత ప్రాంతంలో పుట్టి పెరిగారు. అత్యంత చిన్న వయసులోనే వివాహం చేసుకుని ఉఖ్రుల్ ప్రాంతానికి వచ్చారు. ఏడేండ్ల కిందట మణిపూర్‌కు చెందిన ఓ ఎన్జీఓ పార్టిసిపేటరీ యాక్షన్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (PASDO) ఉఖ్రుల్ నిర్వహించిన ఫుడ్ ప్రాసెసింగ్‌పై శిక్షణా కార్యక్రమానికి యాంగ్‌మిలా జిమిక్ కూడా హాజరయ్యారు. అక్కడ ఆమె నేర్చుకున్న గూడీస్‌ను తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు కోసం తయారు చేయాలని చాలా ఎదురుచూసింది. వర్క్‌షాప్ ముగిసిన వెంటనే యాంగ్‌మిలా ఒక చిన్న తరహా వెంచర్‌ను ప్రారంభించడానికి తగినంత ప్రోత్సాహాన్ని పొందారు. కేవలం రూ.500 వెచ్చించి జామకాయలు, పంచదార కొనుకోలు చేశారు. వాటితో మిఠాయిలు తయారు చేసి చిన్నచిన్న ప్యాక్‌లు చేశారు.
ఆమెకు ఏదీ అడ్డంకి కాదు
''నేను తయారు చేసిన మిఠాయిలను మా స్థానిక దుకాణాలకు కొన్ని ప్యాకెట్లు ఇచ్చాను. ముందు అవి అమ్ముడుపోతాయో లేదా అనుకున్నాను. అయితే చాలా వేగంగా అవి అమ్ముడయ్యాయి'' అని యాంగ్‌మిలా చెప్పారు. నేడు వ్యాపారవేత్తగా, ఓ పరిశ్రమకు యజమానిగా, ఆహార నిపుణురాలిగా గుర్తింపు పొందిన 47 ఏండ్ల యాంగ్మిలాకు ఇప్పుడు ఏదీ అడ్డంకి కాదు. ఆమె తన సొంత ఆహార లేబుల్ షిరిన్ ఉత్పత్తులకు గర్వకారణంగా ఉంది. తన బ్రాండ్ అనేక సేంద్రీయ ఉత్పత్తులకు పర్యాయపదంగా ఉంది. మణిపూర్‌లోని ప్రతి స్టోర్లలో ఆమె ఉత్పత్తులు కనపడతాయి.
వెంచర్‌ను ఇలా ప్రారంభించారు
యాంగ్‌మిలా మిఠాయి తయారీ వెంచర్ అతి తక్కువ కాలంలోనే
విజయవంతమైంది. ఉఖ్రుల్ అనే చిన్న పట్టణంలోని అనేక కిరాణా దుకాణాలు మరిన్ని ఉత్పత్తుల కోసం ఆమెను సంప్రదిస్తున్నాయి. తన ఉత్పత్తులకు ఎంత డిమాండ్ ఉన్నా ఇప్పటి వరకు ఆమ కేవలం అభిరుచిగా ఉన్న దానిలో ఎక్కువ సమయం పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. ఆమె స్థానికంగా లభించే గూస్బెర్రీ, ప్లం, జామపండ్లు, వైల్డ్ ఆలివ్ మొదలైన పండ్లను సేకరించి వాటిని ఉఖ్రుల్లోని తన నివాసంలో క్యాండీలు, జామ్లుగా ప్రాసెస్ చేయడం ప్రారంభించారు.
అక్కడితోనే ఆగిపోలేదు
2017లో స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం (కెవికె)లో ఊరగాయ తయారీ నేర్చుకునేందుకు జరిగిన మరో వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. ఆమెలోని ఆసక్తి, ఉత్సాహం కెవికెలోని అధికారుల దృష్టిని ఆకర్షించింది. సోషియో-ఎకనామిక్ యాక్షన్ ప్లాన్ (SEAP) కింద ఆమెకు కట్టెల పొయ్యి, గ్యాస్ స్టవ్, జంబో బాక్స్‌ను అందించారు. దాంతోపాటు ఆమె ఇంటి వద్దనే ఒక చిన్న వర్కింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడంలో వారు ఆమెకు సహాయం చేశారు. క్యాండీలు, జామ్‌ల నుండి వివిధ రకాల ఊరగాయల వరకు సోలో వ్యాపారవేత్తగా ప్రారంభించిన యాంగ్‌మిలా చివరికి తన ఉత్పత్తులను విస్తరించడం ప్రారంభించారు.
ఏడుగురు పని చేస్తున్నారు
తన బ్రాండ్ షిరిన్ ఉత్పత్తులను 2019లో ఆమె నమోదు చేశారు. ఇందులో ఇప్పుడు 35 రకాల ఆహార ఉత్పత్తులు ఉన్నాయి. స్థానికంగా ఉండే ఆరుగురు మహిళలు ఆమె వద్ద పని చేస్తున్నారు. వారిలో నలుగురు పూర్తి సమయం చేస్తుండగా, పార్ట్‌టైమ్ పని చేసేందుకు ఇద్దరు విద్యార్థులను కూడా నియమించుకున్నారు. ''ఆ విద్యార్థులు వారి చదువును పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అది నేను కోల్పోయిన అవకాశం. నా మూడేండ్ల వయసులో మా అమ్మ చనిపోయింది. నాన్న మళ్లీ పెండ్లి చేసుకున్నారు. నాకు ఆరుగురు తోబుట్టువులు ఉన్నారు. మా విద్యను కొనసాగించడం కష్టంగా మారింది'' అని యాంగ్‌మిలా చెప్పారు.
అన్నీ సేంద్రీయమైనవే
తన ఒక్కగానొక్క కొడుకు ఫారెస్ట్రీలో మాస్టర్స్‌ను అభ్యసిస్తున్నాడు. కొడుకు పెద్దవాడు కావడంతో యాంగ్‌మిలా తన బ్రాండ్‌ను ప్రచారం చేయడానికి తన సమయం మొత్తాన్ని వెచ్చిచగలుగుతున్నారు. షిరిన్ ప్రొడక్ట్స్ మొత్తం 35 ఆహార పదార్థాలు సేంద్రీయమైనవే. వాటిలో ఊరగాయలు, క్యాండీలు, స్క్వాష్, కేకులు మొదలైనవి ఉంటాయి. ''మీరు జామ గ్రీన్ టీని తప్పక ప్రయత్నించండి. ఇది చాలా ఆరోగ్యకరమైనది, రుచిగా కూడా ఉంటుంది'' అని ఆమె అంటున్నారు. ఇవి ఆమె ప్రత్యేకమైన ఉత్పత్తులు.
ప్రభావవంతమైన వ్యాపారవేత్తగా
యాంగ్‌మిలా ఉఖ్రుల్ జిల్లాలో స్వయంగా 30-50 దుకాణాలకు ఈ ఉత్పత్తులను పంపిణీ చేస్తున్నారు. ఫిజికల్ స్టోర్ల ద్వారానే నెలలో రూ. 70,000 నుండి రూ. 80,000 వరకు సంపాదిస్తున్నారు. ఆమె ఇంకా ఈకామర్స్ ప్రపంచంలోకి వెళ్ళలేదు. అయితే ఫస్‌బుక్ పేజీ ద్వారా తన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఆమె సంకల్పం, స్ఫూర్తికి ఇటీవల అస్సాం మహిళా పారిశ్రామికవేత్తల అవార్డు ద్వారా గుర్తింపు లభించింది. దాంతో గ్రామీణ ప్రాంతంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తగా పేరు సంపాదించుకున్నారు.
మహమ్మారి సమయంలో...
షిరిన్ ఉత్పత్తులు ఉఖ్రుల్లో ఇంటి పేరుగా మారాయి. అయితే దీనికి సవాళ్ల, అడ్డంకులు కూడా ఉన్నాయి. అమ్మకాలు తగ్గిపోవడంతో మహమ్మారి సమయంలో అమ్మకాలు తగ్గిపోవడంతో కాస్త కష్టమైందని ఆమె చెబుతున్నారు. అయితే ఆమె ఉత్పత్తులు స్థానిక పదార్థాలను ఉపయోగించి తయారు చేయబడినందున అంతగా ఇబ్బంది కాలేదని కూడా చెబుతున్నారు. షాపులకు పంపిణీ చేయడం కోసం కస్టమర్లు తనను నేరుగా సంప్రదించారని, తన ఉత్పత్తులను వ్యక్తిగతంగా ఇళ్లకు పంపిణీ చేశారని ఆమె చెప్పారు.
సొంతంగానే నిధులు
ప్రస్తుతం యాంగ్‌మిలా వ్యాపార స్ఫూర్తి చాలా విస్తృతంగా గుర్తించబడింది. ఆమె జర్మన్‌కు చెందిన ఓ ఎన్జీఓ నుండి రూ. 1,20,000 గ్రాంట్‌తో తనకు తానుగా నిధులు సమకూర్చుకోగలిగారు. అలాగే గ్రామీణ భారతదేశానికి మైక్రోక్రెడిట్ యాక్సెస్‌ను ప్రోత్సహించే పీర్-టు-పీర్ లెండింగ్ ప్లాట్‌ఫారమ్ రంగ్ దే నుండి కూడా లబ్ది పొందారు. ఈ సంవత్సరం యాంగ్‌మిలా మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ (PM FME Scheme) యొక్క ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 2020లో 'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్', 'వోకల్ ఫర్ లోకల్' ప్రచారాల కింద ప్రారంభించబడిన ఈ పథకం దేశంలోని మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సాంకేతిక, ఆర్థిక, వ్యాపార సహాయాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. యాంగ్‌మిలా PM FME Scheme స్కీమ్ గ్రాంట్‌ను పొందడం అనేది ఆమె ఇన్నాళ్లూ చేసిన ప్రయత్నాలకు నిజమైన ధ్రువీకరణ లాంటిది.
సరైన వర్క్ షెడ్ ఉంటే
''ఈ వెంచర్లో నాకు సహాయం చేయడానికి నేను మొదట ఒక వ్యక్తిని నియమించుకున్నాను. కానీ అది సరిపోదని గ్రహించాను. ప్రస్తుతం మేం ఏడుగురం ఉన్నాం. ఇప్పటికీ సరైన వర్క్ షెడ్ లేదు. మా ఉత్పత్తులన్నీ చేతితో తయారు చేయబడ్డాయి. ముడి పదార్థాల విషయానికొస్తే ఇక్కడ చాలా పండ్లు ఉన్నాయి. వీటిని మనం బాగా ఉపయోగించుకోవచ్చు. సరైన యంత్రాలు, పూర్తిగా పనిచేసే వర్క్ షెడ్ ఉంటే నేను ఎక్కువ మందిని నియమించుకోగలను. ప్రారంభ రోజులు ఎవరికైనా సవాలుగానే ఉంటాయి. నేను ఎలాంటి సవాళ్లకైనా సిద్ధంగా ఉన్నాను'' అంటున్నారు ఆమె.
- సలీమ