Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలకు ఎంత చెప్పినా.. వర్షంలో ఆడుకోవడం మానరు. వాళ్ళకు అదో ఆనందం. చాలాసార్లు ఇలా తడుస్తూనే స్కూలు నుంచి ఇంటికి వస్తారు. దీనివల్ల వారు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం మరింత పెరుగుతుంది. ఈ కాలంలో బ్యాక్టీరియా, వైరస్ల వ్యాప్తి పెరుగుతుంది. దీంతో పాటు దోమలు కూడా పెరుగుతాయి. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. అటువంటి వ్యాధుల నుండి పిల్లలను రక్షించడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా మనం ఏం చేయాలో తెలుసుకుందాం.
parenttune.com ప్రకారం ఈ సీజన్లో ఇంటిని శుభ్రంగా ఉంచండి. దోమలు ఎక్కడా గుమిగూడకుండా చూసుకోండి. ఈ సీజన్లో పిల్లలకు నిండుగా ఉండే బట్టలు ధరించి ఉంచండి.
ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వండి. తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వేడి నీరు కూడా ఇవ్వండి.
ఆహారాన్ని ఎప్పుడూ మూత పెట్టి ఉంచండి.
వేడి సూప్ లేదా వేడి పానీయాలు ఇవ్వండి. తద్వారా వారి శరీరం అంతర్గతంగా బలోపేతం అవుతుంది.
పిల్లలను ఇంట్లోనే వీలైనంత బిజీగా ఉంచడానికి ప్రయత్నించండి. సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లకుండా నిరోధించండి. బయటకు వెళ్లాలని పట్టుబట్టకుండా ఇంట్లో కొన్ని సరదా కార్యక్రమాలను నిర్వహించండి.
బయటి నుండి లేదా పాఠశాల నుండి వచ్చిన వెంటనే చేతులు, కాళ్ళు బాగా కడగాలి.
ఈ సీజన్లో పిల్లలను బయటి ఆహారం లేదా జంక్ ఫుడ్ తినడానికి అనుమతించవద్దు. ఇది బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది.