Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాకాలంలో వేడి నుంచి ఉపశమనంతో పాటే కొన్ని సమస్యలు వచ్చేస్తాయి. ఈ సమయంలో ఇంటి నిర్వహణకు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఒకవైపు బట్టలు ఆరవు, మరోవైపు బిస్కెట్ల నుంచి మసాలాలు వరకు పాడయ్యే స్థితి ఏర్పడుతుంది. గాలిలో తేమ అధికంగా ఉండటం వల్ల ఈ సమస్య తీవ్రమవుతుంది. దీనికి కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
వంటగదిలో లేదా ఇంట్లో ఎక్కడైనా తడిగా ఉన్న ప్రదేశంలో బిస్కెట్లు లేదా మసాలా డబ్బాలను ఎప్పుడూ ఉంచవద్దు. ఎందుకంటే ఫంగస్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి వీటికి తగిన జాగ్రత్తలు తప్పనిసరి.
గాలి చొరబడని గాజు పాత్రలలో ఆహార పదార్థాలను నిల్వ ఉంచండి. వర్షంలో ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారాన్ని ఉంచకపోవడమే మంచిది.
వర్షాకాలంలో ఎండ దొరకడం చాలా కష్టమే. కానీ అవకాశం దొరికినప్పుడు వస్తువులను ఎండలో ఉంచండి.
వస్తువులను ఎల్లప్పుడూ ప్రత్యేక కంటైనర్లలో ఉంచండి. అదే కంటైనర్‌ను మరో పాత్రలో ఉంచవదు.
మసాలాలు లేదా బిస్కెట్లు అయిపోయిన తర్వాత ఆ కంటైనర్‌ను బాగా శుభ్రం చేసి ఆరబెట్టి మళ్ళీ ఉపయోగించండి.
ఫుడ్ ప్యాకెట్‌ని సగం తెరిచి అలాగే వదిలేయవద్దు. ప్యాకెట్లోని ఆహారాన్ని తెరిగిన వెంటనే గాలి చొరబడని గాజు కంటైనర్‌లో పోయాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఆహారపదార్థాలను పాడవ్వకుండా చూసుకోవచ్చు.