Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆహ్లాదకరమైన వాతావరణం. పచ్చదనం పులుముకున్న పుడమి. నాట్య మమూరాల పులకింత... ఒకటనేమిటి ఔట్‌డోర్, ఇండోర్.. తేడా ఏమీ ఉండదు. ప్రతి చోటా పరవశమే! క్యాంపింగ్, ట్రెక్కింగ్, హైకింగ్ లాంగ్ వాక్స్... వర్షాకాలంలో ఆస్వాదించేందుకు ఎన్నో అవకాశాలు. ఈ వారాంతంలో మీరు ఇంటిలోనే ఉండి స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదించడం మాత్రమే కాదు అంతకు మించిన ఆనందమూ పొందవచ్చు. ఈ రుచులు వర్షపు నీటిలో తడుస్తూ మురిసిన మనసు... ఎన్నెన్నో జ్ఞాపకాలను వెలికితీస్తాయి. ఇంటి వద్దనే ఆ రుచులను పునః సృష్టించుకునేందుకు కాస్త సృజనాత్మకత, మరికాస్త అభిరుచి జోడించి వంటింటిలోకి పయనించడమే! ఈ సీజన్లో మీ అభిమాన పదార్థాలను వినియోగించుకుని చేసేందుకు అనువుగా ఉన్న కొన్ని సీక్రెట్ రిసెపీలను చూస్తే...
ఆనియన్ పకోరా: ఈ డిష్ లేకుండా వర్షాకాలం పూర్తి కాదు. ఆనియన్ రింగ్స్ అనేది ఈ స్ట్రీట్ ఫుడ్‌కు రెస్టారెంట్ వెర్షన్. కాస్త శెనగపిండి, కొంత వరిపిండి, చిటికెడు ఉప్పు, చెంచాడు కారం, కొద్దిగా పసుపు, నచ్చితే వాము, ఇంకాస్త జీలకర్ర, ఉల్లిగడ్డ, నువ్వులు జోడించి నూనెలో వేయించడమే.
బొంగుచికెన్: వెదురు గడలో ఉడికించే చికెన్. సాధారణంగా వేడి బొగ్గులపై స్మోకీ ఫ్లేవర్ కోసం వండుతారు. ఇంటిలో కూడా దీన్ని కుకింగ్ పాట్లో బొగ్గులు వేసి ట్రై చేయొచ్చు.
టమోటా బజ్జి: టమోటాతో ప్రయోగాలు చేయడంలో ఇదో వెరైటీ. టమోటాను రెండుగా కట్ చేయాలి. లోపల తీసేయాలి. నెమ్మదిగా ఫ్రై చేసి తగిన పరిమాణంలో స్పైసెస్ జోడించి చేసే టమోటా బజ్జి, మీరు గతంలో కుటుంబంతో కలిసి రోడ్డు పక్క తిన్న బజ్జీని గుర్తు చేయకమానదు.
రైల్ పలారం: తెలంగాణాలో అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రేక్‌ఫాస్ట్ డిష్. దీని తయారీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది.
ఇవేనా... మసాలా బతన్, పునుగులు, చెగోడీలు లాంటివి ఈసీజన్లో మధురస్మతుల్లోకి తీసుకువెళ్తాయి. గోల్డ్ డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా మాట్లాడుతూ ''వర్షాకాలంలో గాలిలో ఉండే తేమ కారణంగా ఆహారం త్వరగా పాడవుతుంది. గోల్డ్‌డ్రాప్ లాంటి నూనెలను ప్రపంచశ్రేణి రిఫైండ్ సదుపాయాల వద్ద రిఫైండ్ చేయడం వల్ల ఆహారం మరింత ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. మా ఇంటిలో ఈ వర్షాకాలంలో ప్రయోగాలు చేస్తూనే ఉంటుంటాం. కొన్నిసార్లు పుంటి కూర, బచ్చలి కూర వంటివి పప్పుతో కలిపి వండితే, పాలకూర, పన్నీర్‌తో వేయించిన స్నాక్స్ కూడా తయారుచేసుకోవచ్చు'' అని అన్నారు.