Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాఠశాల నుండి కళాశాల వరకు అన్ని తరగతుల్లోనూ టాపర్. గోల్డ్ మెడల్ కూడా సాధించింది. చదువు పూర్తి చేసుకున్న తర్వాత కంటిచూపు లేదనే కారణంగా ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదు. అది ఆమె మనసును కలచివేసింది. తనలా ఇంకెవరూ ఇలాంటి సమస్య ఎదుర్కోకూడదని నిర్ణయించుకుంది. దానికోసమే విజన్ ఎంపవర్ ప్రారంభించింది. దాని ఆధ్వర్యంలో దృష్టి లోపం ఉన్న పిల్లలు ఉపాధి కల్పించే విద్యను పొందేలా తీర్చిదిద్దుతుంది. ఆమే వై.విద్య. ఆమెకు మరిన్ని విశేషాలు ఈరోజు మానవిలో...
విద్యా బెంగళూరు శివార్లలోని అనేకల్ తాలూకాలోని తిరుమగొండనహళ్లి గ్రామంలో పుట్టింది. ఆ గ్రామంలో పుట్టుకతోనే చూపు లేకుండా జన్మించిన మొదటి బిడ్డ ఆమెనే. వయసు పెరిగేకొద్దీ స్నేహితులు, బంధువులు, గ్రామస్థులు విద్యా భవిష్యత్తుపై ఆందోళనలను వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆమె ఏమి చేస్తుంది, ఎవరైనా ఆమెను వివాహం చేసుకుంటారా అనే ప్రశ్నలూ ఎల్లప్పుడూ ఆమె చుట్టూ తిరుగుతుండేవి. అయినప్పటికీ విద్యా ఆ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. గణితం, సైన్స్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఆరేండ్ల వయసులో ఆమె నారింజ నుండి భాగాలను వేరు చేసి వాటిని లెక్కిస్తూ ఉండేది. ఆవాలు, బియ్యాన్ని కూడా ఆమె లెక్కలు నేర్చుకోవడానికి ఉపయోగించేది.
ఉన్నత విద్య అందించడం కోసం
విద్య చదువులో ఎంత ప్రతిభ చూపిన అది ఆమె ఉద్యోగం చేయడానికి ఉపయోగపడలేదు. అందుకే తనలాంటి అమ్మాయిలకు ఉన్నత విద్యతో పాటు ఉపాధి సంపాదించే విద్యను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా గణితం, సైన్స్‌పై దృష్టి పెట్టింది. చాలా 2017లో ఐఐఐటి బెంగళూరు ఇన్నోవేషన్ సెంటర్లో లాభాపేక్ష లేని విజన్ ఎంపవర్ను ప్రారంభించింది. ఇది దృష్టిలోపం ఉన్న పిల్లలకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌లలో విద్యను అభ్యసించడానికి సహాయం చేస్తుంది.
స్వచ్ఛంద కేంద్రానికి చేరుకుంది
ఆమె చిన్నతనంలో గ్రామంలో కన్నడ బోధనా మాధ్యమంగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో చాలా మంది పిల్లలకు విద్యను అభ్యసించడం కష్టంగా మారింది. చూపులేని కారణంగా విద్యకు అవకాశాలు మరింత పరిమితంగా ఉన్నాయి. చదువుకునే సమయంలోనూ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. చిన్నతనంలో ఒక రోజు విద్య నగరంలో ప్రయాణిస్తున్నప్పుడు వివిధ రకాల వైకల్యాలున్న వ్యక్తుల కోసం ఒక సంస్థకు చెందిన వాహనం వెంట వెళుతున్న వ్యక్తిని చూసింది. ''అతను దానిని 15 కిలోమీటర్లు అనుసరించాడు. ఒక స్వచ్ఛంద కేంద్రానికి చేరుకున్నాడు. అక్కడ దృష్టి లోపం ఉన్న మహిళలకు జీవనం కోసం వృత్తి శిక్షణ ఇస్తున్నాడు. అక్కడ పదో తరగతి వరకు చదివి బ్రెయిలీ తెలిసిన ఒక అమ్మాయి ఉంది'' అని విద్య అప్పటి రోజులు గుర్తు చేసుకుంది.
అన్ని గ్రేడ్లలో అగ్రస్థానం
విద్య కూడా అదే సెంటర్లో చేరింది. రెండు సంవత్సరాల తర్వాత రెండవ తరగతి నుండి ఫార్మల్ బ్లైండ్ స్కూల్‌కి మార్చబడింది. అక్కడ ఆమె తెల్లవారుజామున 4.30 గంటలకు నిద్రలేచి తన పనులు ముగించుకొని చదువుకోవడం ప్రారంభించేది. ''నేను గ్రేడ్‌లో అత్యంత క్రమశిక్షణ కలిగిన విద్యార్థిగా గుర్తింపు పొందాను. ఇది నా జీవితానికి ఒక మలుపు'' అని ఆమె చెప్పింది. ఆమె అన్ని గ్రేడ్లలో అగ్రస్థానంలో ఉంది. తరచుగా ఆమె క్లాస్‌మేట్స్‌కు గణితం, సైన్స్ బోధించేది. ''అయితే ప్రధాన బోర్డులు అందించే హ్యుమానిటీస్, ఎకనామిక్స్ వంటి ప్రత్యామ్నాయ ఎంపికలు ఉన్నందున నేను గణితాన్ని కొనసాగించవద్దని సలహా ఇచ్చాను'' అని ఆమె గుర్తుచేసుకుంది.
అడ్మిషన్ ఇవ్వలేదు
విద్య ఏడవ తరగతి తర్వాత సాధారణ పాఠశాలకు మారాలని నిర్ణయించుకుంది. కానీ ఆమె దరఖాస్తు చేసుకున్న చాలా పాఠశాలలు ఆమెకు అడ్మిషన్ ఇచ్చేందుకు తిరస్కరించాయి. ''కొంతమంది నన్ను ప్రత్యేక పాఠశాలకు వెళ్లమని చెప్పారు. మరికొందరు నేను వాష్‌రూమ్‌ను ఎలా ఉపయోగించగలనని ఆందోళన చెందుతున్నారు. నేను చాలా ఇంటర్వ్యూలలో ఏడ్చాను. ఎందుకంటే ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియదు'' ఆమె గుర్తుచేసుకుంది.
అంచనాలు మార్చివేసింది
తర్వాత ఆమె కుటుంబం అత్తిడేల్కి మారింది. ఆమె అత్తిబెలె పబ్లిక్ స్కూల్లో చేరింది. ట్యూటరింగ్ పొందగలిగింది. గణితం, సైన్స్‌లో 95 శాతం మార్కులతో పదవ తరగతిలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ విజయం ఆమె పట్ల ప్రజలకున్న అవగాహన, అంచనాలను మార్చివేసింది. చివరకు వారు ఆమెను ఉన్నత విద్యను అభ్యసించమని ప్రోత్సహించడం ప్రారంభించారు. అయితే సబ్జెక్టులోని ప్రాథమిక అంశాలను అర్థం చేసుకునేంత అర్హత లేని జూనియర్ విద్యార్థిని లేఖరిగా ఎంపిక చేసుకోవడం వల్ల పరీక్షలు రాయడం చాలా కష్టంగా ఉందని విద్య చెప్పింది.
గంట సమయం పెంచారు
''కొన్నిసార్లు నేను కాలమ్‌లు చెప్పినప్పుడు వారు వరుసలలో రాస్తారు. వారు ఏమి రాస్తున్నారో నేను చూడలేను'' అని ఆమె చెప్పింది. వికలాంగ విద్యార్థులకు ఇచ్చిన 20 నిమిషాల అదనపు సమయం సరిపోదు. విద్యా మంత్రిత్వ శాఖకు ఏడు లేఖలు పంపిన తర్వాత విద్యా భారతదేశం అంతటా విద్యార్థుల కోసం ఒక గంటకు సమయాన్ని పొడిగించారు'' చెప్పింది విద్య. క్రైస్ట్ నుండి కంప్యూటర్ సైన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ పూర్తి చేసిన తర్వాత ఆమె బెంగళూరులోని ఐఐఐటి చరిత్రలో మొదటి అంధ విద్యార్థిగా మారింది. డిజిటల్లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లో చేరిన తర్వాత ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ ఇచ్చింది.
నిరాశకు గురిచేసింది
''నేను నా క్లాస్‌లో టాపర్ నిలిచి గోల్డ్ మెడల్ సాధించాను. కానీ విచిత్రమేమిటంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ సమయంలో నాకు ఎలాంటి జాబ్ ఆఫర్లు రాలేదు. నాకు తప్ప అందరికీ ఉద్యోగం వచ్చింది'' అని ఆమె చెప్పింది. ఇంత దూరం వచ్చినప్పటికి చాలా మంది యజమానులు ఆమె పని చేయడానికి కంప్యూటర్లను ఎలా ఉపయోగిస్తుందనే దాని గురించి ఆందోళన చెందారు. ''నా ఇతర క్లాస్‌మేట్స్‌తో సమానంగా నేను చేయగలనని వారిని ఒప్పించడానికి నేను ఏమి చెప్పినా వాళ్ళు నమ్మలేదు. నా జీవితమంతా ఎంతో కష్టపడి చదివినా ఉద్యోగం విషయంలో నాకు అన్యాయం జరిగింది. ఈ అనుభవం నన్ను నిరాశకు గురిచేసింది'' ఆమె జతచేస్తుంది.
తనే ఏదో ఒకటి చేయాలని
మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్ తర్వాత తనే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంది. దృష్టిలోపం ఉన్న వ్యక్తులు ఉపాధిని కల్పించే విద్యను అభ్యసించడానికి వీలు కల్పించాలని నిర్ణయించుకుంది. ఐఐఐటి బెంగళూరులో, ఆమె తన సహ వ్యవస్థాపకురాలు సుప్రియా డేని కలుసుకుంది. ఇన్స్టిట్యూట్లోని ప్రొఫెసర్ అమిత్ సహాయంతో విజన్ ఎంపవర్ను రూపొందించడానికి ఇద్దరూ చేతులు కలిపారు. ''నేను చేయగలిగితే ప్రతి ఒక్కరూ చేయగలరని నాకు తెలుసు. అయితే సరైన వనరులు కావాలి'' అంటుంది ఆమె.
వారికి ఏం కావాలో తెలుసుకోడానికి
తన ప్రయత్నంలో మొదటి దశగా విద్య తన అనుభవాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోకూడదనుకుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులతో వారికి ఏమి అవసరమో అర్థం చేసుకోవడానికి పాఠశాలలను సందర్శించింది. విజన్ ఎంపవర్ 3డి మోడల్స్‌లోని కొన్ని రేఖాచిత్రాలతో పాటు టెక్ట్స్, రేఖాచిత్రాల కోసం బ్రెయిలీలో పాఠ్యపుస్తకాలను అందుబాటులో ఉంచడం ప్రారంభించింది. దాని ఐదు సంవత్సరాల కార్యకలాపాలలో సంస్థ కర్ణాటక, తమిళనాడు, కేరళ, త్రిపుర, ఢిల్లీ, గుజరాత్‌లలో 23 కంటే ఎక్కువ పాఠశాలలతో పని చేసింది. ఇది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తుంది. వీరిలో ఎక్కువ మంది అంధులు, దృష్టి లోపం ఉన్నవారు.
కరోనా సమయంలో
పిల్లలకు గణన ఆలోచనను బోధించడానికి అవసరమైన నైపుణ్యాలను కూడా సంస్థ వారికి అందిస్తుంది. కరోనావైరస్ మహమ్మారి భిన్నమైన సవాలును అందించింది. ప్రతి ఒక్కరూ ఆన్లైన్ అభ్యాసానికి మారినప్పుడు దృష్టి లోపం ఉన్న ఉపాధ్యాయులు నిస్సహాయంగా ఉన్నారు. వారికి సహాయం చేయడానికి విజన్ ఎంపవర్ డిజిటల్ అక్షరాస్యతను అందించడానికి యూట్యూబ్, జూమ్ వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకోవడానికి ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.
లెర్నింగ్ మేనేజ్మెంట్
నేను కన్నడలో 23 ఆడియో ట్యుటోరియల్‌లను తయారు చేసాను. కొన్ని ఇంగ్లీషుతో పాటు వివిధ భాషల్లోకి అనువదించబడుతున్నాయి. ఉపాధ్యాయులు ఫోన్లు, గూగుల్ మీట్ వంటి యాప్‌ల ప్రాథమిక ఉపయోగాన్ని దృష్టి లోపం ఉన్నవారి కోసం రూపొందించిన కొన్ని ఇతర ప్లాట్‌ఫారమ్‌లను నేర్చుకోగలిగారు'' అని ఆమె జతచేస్తుంది. అందుబాటులో ఉండే లెర్నింగ్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫారమ్ సుబోధను కూడా అభివృద్ధి చేసింది. ఇక్కడ విద్యార్థులు అన్ని అభ్యాస సామగ్రిని యాక్సెస్ చేయవచ్చు. వ్యవస్థాపకత గురించి మాట్లాడుతూ నిధులు ఒక సవాలుగా ఉన్నందున స్థిరమైన ఆదాయ నమూనాను చూడటం ముందున్న పని. ఇది ఇప్పటివరకు వివిధ కంపెనీల నిధుల సహకారంతో కార్పొరేట్ సామాజిక బాధ్యతపై నడుస్తుంది.