Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమెకు వ్యాపారం పట్ల పెద్దగా అవగాహన లేదు. ఏదో సాధించాలనే తపన తప్ప. ఆ తపనే నలభై ఏండ్ల వయసులో వ్యాపారాన్ని ప్రారంభించేలా చేసింది. ప్రస్తుతం అది రూ. 40 కోట్ల టర్నోవర్‌తో ఆమె గ్లోబల్ ఎత్నిక్ వేర్ బ్రాండ్ ప్రపంచమంతా విస్తరించింది. ఆమే శీతల్ కపూర్. ఆమె విజయగాథ నేటి మానవిలో...
శీతల్ కపూర్ తన ఇరవై ఏండ్ల వయసులో సందీప్‌ను వివాహం చేసుకున్నారు. పెండ్లి తర్వాత 20 ఏండ్ల పాటు తన సమయం మొత్తం పూర్తిగా కుటుంబానికే కేటాయించారు. ఆ తర్వాత ఇంకా ఏదో చేయాలనే తపన ఆమెలో ప్రారంభమయింది. ఆ ఆలోచనతోనే భర్త సందీప్‌తో కలిసి 2010లో శ్రీ పేరుతో తన వ్యాపార సంస్థను ప్రారంభించారు. ఢిల్లీ కేంద్రంగా ప్రారంభమైన శ్రీ ప్రస్తుతం భారతదేశంతో పాటు దుబాయ్ అంతటా 100కి పైగా స్టోర్లను కలిగి ఉన్న గ్లోబల్ ఇండియన్ ఎత్నిక్ వేర్ బ్రాండ్.
అంతరాన్ని గుర్తించారు
శీతల్‌కు ఎలాంటి వ్యాపార నేపథ్యం లేదు. వ్యాపారం చేయాలనే బలమైన కోరిక తప్ప. 2000 సంవత్సరంలో భారతదేశం ఇ-కామర్స్ ప్రపంచానికి తెరతీసినప్పుడు, రెడీ-టు-వేర్ సెగ్మెంట్ కోసం మార్కెట్ ట్రాక్షన్‌ను ఆమె కూడా చూసింది. రిటైలర్ల కోసం గార్మెంట్స్ ఉత్పత్తి చేసే వ్యాపారంలో ఉన్న శీతల్, ఆమె భర్త సందీప్ భారతీయ మహిళలకు సంబంధించిన ఎత్నిక్ వేర్ విభాగంలో అంతరాన్ని గుర్తించారు.
40 ఏండ్లకు వ్యవస్థాపకురాలిగా
వారి మాతృ సంస్థ SHR లైఫ్‌స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ కింద 2010లో ఢిల్లీలో శ్రీని ప్రారంభించారు. ఆ విధంగా శీతల్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. 40 సంవత్సరాల వయసులో వ్యవస్థాపకురాలిగా మారారు. టైలర్-మేడ్ రోజువారీ భారతీయ జాతి దుస్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను చూసిన తర్వాత ఈ జంట విదేశీ మార్కెట్‌ను అన్వేషించాలని నిర్ణయించుకున్నారు.
భారీ డిమాండ్ వస్తుంది
''2010లో రెడీమేడ్ రోజువారీ దుస్తులలో మహిళలకు ఎటువంటి ఎంపికలు లేవు. భారతదేశంలో రెడీ-టు-వేర్ మార్కెట్ ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉంది. సందీప్‌కి రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ మొదలైనవాటికి గార్మెంట్ OEMగా పని చేయడం మంచి అనుభవం. కాబట్టి ప్రపంచంలోని ఆ ప్రాంతాల నుండి భారీ డిమాండ్ వస్తున్నందున మేము అంతర్జాతీయ ఆన్లైన్ స్పేస్‌ను భర్తీ చేయాలని నిర్ణయించుకున్నాము'' అంటున్నారు శీతల్.
లాప్టాప్ ఉపయోగించడం తెలీదు
వ్యాపారంలో శీతల్ ప్రయాణం అంత సులభం కాదు. ఆమె చెబుతున్నారు ''మేరే కో ల్యాప్‌టాప్ చలానా భీ నహీ ఆతా థా (నాకు ల్యాప్‌టాప్‌ను ఎలా ఉపయోగించాలో కూడా తెలియదు).'' కానీ నేడు ఆమె రూ. 40 కోట్ల టర్నోవర్‌తో గ్లోబల్ బ్రాండ్‌ను నిర్మించింది. భారతదేశం, దుబారు అంతటా 100 కంటే ఎక్కువ స్టోర్లతో 350 మందికి పైగా ఉద్యోగులతో పనిచేస్తున్నారు.
అంతర్గత బ్రాండ్ నిర్మించడానికి
బ్రాండ్ పరిధిని పెంపొందించడం కోసం ఈ జంట తమ అంతర్గత బ్రాండ్‌ను నిర్మించినప్పటికీ దేశంలో రెడీమేడ్ ఎత్నిక్ వేర్ మార్కెట్ ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉంది. అందుకే నేరుగా దుకాణాలకు వెళ్లడం చాలా ప్రమాదం. అప్పటికి ఆన్లైన్ షాపింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. 2010లో భారతదేశంలో ఆన్లైన్ షాపింగ్ ప్రారంభించబడింది. అందుకే తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోవడానికి వారు తమ బ్రాండ్‌ను eBayలో జాబితా చేసారు. విదేశీ వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. తర్వాత ఐదేండ్లలో UK నుండి US, యూరప్‌తో పాటు అనేక ఇతర దేశాలకు శ్రీ తన పరిధిని విస్తరించినందున ఈ జంటకు వ్యాపారం చాలా బాగా జరిగింది.
వారి కోరికలను అర్థం చేసుకుని
ఆ సమయానికి శ్రీకి మంచి కస్టమర్ బేస్ ఉంది. స్థాపకులు బ్రాండ్‌ను భారతీయ ప్రేక్షకులకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. 2015లో ఢిల్లీలో శ్రీ మొదటి ఆఫ్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించారు. ''ఇది 250 చదరపు అడుగుల స్టోర్. ఇక్కడ నేను ప్రతి కస్టమర్‌కు వ్యక్తిగతంగా కలుసుకునేదాన్ని. కాబట్టి నేను వారి కోరికలు, డిమాండ్లను అర్థం చేసుకున్నాను. వారి అవసరాలకు అనుగుణంగా దుస్తులను క్యూరేట్ చేయడానికి ప్రయత్నించాము. భారతదేశంలోని స్త్రీ శరీరం ఇతర దేశంలోని మహిళల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. నేను ప్రారంభ రోజుల్లో నా డిజైనర్ల బృందంతో కలిసి పనిచేశాను. సందీప్ స్వయంగా డిజైన్ చేసేవాడు. ఈ విధంగా మేము మా కస్టమర్ల నుండి చాలా ప్రశంసలను పొందాము'' అని శీతల్ అంటున్నారు.
మూడేండ్లలో పది స్టోర్లు
అయితే వీరి ఒకదానికి గురించి ఆలోచిస్తే అది మరొకదానికి దారితీసింది. ఒక భారతదేశంలోనే మూడు సంవత్సరాలలోనే వీరు 10 స్టోర్లను ప్రారంభించారు. వాటిలో ఎక్కువ భాగం ఢిల్లీలో ఉన్నాయి. 2019లో ముంబైకి చెందిన ప్రైవేట్ పెట్టుబడి సంస్థ ఆల్ఫా క్యాపిటల్ నుండి కంపెనీ 80 కోట్ల రూపాయల నిధులను పొందింది. 2021 నాటికి శ్రీ 100 స్టోర్ మార్కును దాటింది. రూ. 500, రూ. 2,999 ధరల శ్రేణిలో కుర్తీలు, కుర్తాలు, సల్వార్ కమీజ్, ట్యూనిక్స్, లెగ్గింగ్‌లు మొదలైన మోర్టార్ స్టోర్లతో దుబారుకి విస్తరించింది.
శ్రీని స్వాగతిస్తున్నారు
ప్రస్తుతం భారతీయ మార్కెట్ శ్రీని ముక్తకంఠంతో స్వాగతిస్తున్నదని. వారు ఆఫ్‌లైన్ ఎక్స్పీరియన్స్ స్టోర్లతో స్కేలింగ్‌పై దృష్టి సారించి భారతదేశం, దుబారుని లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారని శీతల్ అంటుంది. స్టాటిస్టా ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం అంతటా మహిళల ఎథ్నిక్ వేర్ మార్కెట్ సుమారు 17 బిలియన్లు ఉంది. అది 2025 నాటికి 24 బిలియన్లను దాటుతుందని అంచనా వేయబడింది.
పాదముద్రను విస్తరిస్తున్నారు
విస్తరణ ప్రణాళికలు భవిష్యత్ అవకాశాలను హైలైట్ చేస్తూ 100-స్టోర్ మార్కును దాటడం ఒక మైలురాయి. క్రమంగా వారు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆఫ్‌లైన్ రిటైల్ స్పేస్‌లో తమ పాదముద్రను విస్తరిస్తున్నారు. మరో నాలుగు సంవత్సరాల్లో 500 స్టోర్లను లక్ష్యంగా చేసుకుంటామని శీతల్ చెప్పారు. గ్లోబల్ దేశీ, డబ్ల్యూ, అరేలియా, మస్టర్డ్ మొదలైన భారతీయ ఎత్నిక్ వేర్ మార్కెట్‌ను శాసించే బ్రాండ్లతో పోటీ పడుతున్న ఈ కంపెనీ భవిష్యత్తులో ఎలాంటి నిధులను సమీకరించడం లేదని ఆమె అంటున్నారు.
మనల్ని ఎవరూ ఆపలేరు
మార్కెట్ పోటీ నుండి శ్రీ ఎలా నిలుస్తోంది అనే దాని గురించి శీతల్ మాట్లాడుతూ ''మేము మరే ఇతర బ్రాండ్‌తోనూ పోల్చుకోవడం లేదు. కానీ మేము వారితో కలిసి నడుస్తున్నాము'' అంటున్నారు. ''తమ కలలను సాధించకుండా ఎవరూ ఆపలేరని ప్రతి స్త్రీ తెలుసుకోవాలి. వారు ముందుకు సాగాలి. ఆత్మవిశ్వాసంతో ఉండాలి'' అని శీతల్ మహిళా పారిశ్రామికవేత్తలకు సలహా ఇస్తున్నారు.