Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడు లీటర్ల నీటిలో నాలుగు చెంచాల బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మొక్కలపై స్ప్రే చేస్తే.. వాటిని చీడపీడల నుంచి సంరక్షించుకోవచ్చు. అలాగే చిక్కుడు, గుమ్మడి, దోస.. వంటి మొక్కలకు సోకే తెగులును నివారించుకోవచ్చు. మూడు లీటర్ల నీటిలో బేకింగ్ సోడా, ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున వంట నూనె, డిష్వాష్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో పోసి వారానికి రెండుసార్లు మొక్కలపై పిచికారీ చేయాలి.