Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శరీర దృఢత్వానికి ప్రోటీన్లు కీలక పాత్ర పోషిస్తాయి. అనారోగ్య సమస్యలు తలేత్తకుండా ప్రోటీన్ల ప్రభావ వంతంగా పని చేస్తాయి. అయితే శరీరంలో వీటి కోరత ఉంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రోటిన్లు సమతుల్యంగా ఉంటేనే కండరాల అభివృద్ధి, చర్మ సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి శరీరంలో ప్రోటీన్లు సమతుల్యంగా ఉండాలి. శరీరంలో ప్రొటీన్లు పెరగాలంటే ఆహారంలో ఏమేం చేర్చుకోవచ్చో తెలుసుకుందాం.
గుడ్లు: గుడ్లు ప్రోటీన్లకు అత్యంత పోషకమైన ఆహారం. ముఖ్యంగా గుడ్డులోని తెల్లసొన స్వచ్ఛమైన ప్రోటీన్లు కలిగి ఉంటుంది. గుడ్లలో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అందుకే రోజుకోక గుడ్డు తింటే ప్రోటీన్లు సమతుల్యంగా ఉండి శరీరంలో శక్తి పెరుగుతుంది.
బాదం: బాదం పప్పులో కూడా ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని మొక్కల ఆధారిత ప్రోటీన్ అంటారు. ఒక ఔన్స్ బాదంపప్పులో దాదాపు 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అలాగే రోజుకు నాలుగు బాదం పప్పులు తింటే శరీరానికి తక్షణ శక్తి వస్తుంది.
చికెన్ బ్రెస్ట్: చికెన్ బ్రెస్ట్‌ను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఇందులో చాలా ప్రొటీన్లు ఉంటాయి. దీన్ని సులభంగా వండుకోవచ్చు. అంతేకాకుండా చికెన్ బ్రెస్ట్‌ను మీ అల్పాహారంలో సలాడ్‌గా తినవచ్చు.
గ్రీక్ పెరుగు: సాధారణ పెరుగు కన్నా ఇది భిన్నంగా ఉంటుంది. గ్రీక్ పెరుగు అనేది క్రీము ఆకృతితో ఉండే మందపాటి పెరుగు. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కాల్షియం, విటమిన్ బి12, సెలీనియం, విటమిన్ ఎ, జింక్ పుష్కలంగా ఉన్నాయి. అందుకే దీన్ని మీ ఆహారంలో తీసుకోండి.
పాలు: ఇక పాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతర పోషకాల మాదిరిగానే, పాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు పాలలో దాదాపు 9 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. పాలు.. మీ శరీరంలోని నీరసాన్ని పొగొడుతుంది.
పప్పులు: పప్పుల్లో మొక్కల ఆధారిత ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. రోజూ పప్పులు తినే వ్యక్తులు ఫ్యాటీ లివర్ డిసీజ్ లేదా గుండె జబ్బులు నుంచి తప్పించుకోవచ్చు. వీటిలో మాంసకృతులు కూడా అధికంగా ఉంటాయి.