Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంచాలూ, బల్లలూ లాంటివి అందరిళ్లలో ఉండేవే. కాకపోతే వాటిని ఎంచుకోవడంలో ఉంటుంది విభిన్నత, కళాభిరుచి. చిన్నా పెద్దా ప్రతి వస్తువుతోనూ ఇంటికి అందం, ఆకర్షణ వస్తాయి. మీ ఇల్లు ఇంకొంచెం ప్రత్యేకంగా ఉండాలంటే ...
ప్రతి గదిలో ఒక అల్మరను అలంకరణ సామగ్రికి పూర్తిగా వదిలేయండి. అంత వెసులుబాటు లేదంటే కొన్ని వస్తువుల పక్కన అరుదైన బొమ్మలు, కృత్రిమ మొక్కలూ లేదా పూలగుచ్ఛాలు ఉంచండి. పుస్తకాల అరలోనూ మధ్య మధ్యలో ఇలాంటివి అమర్చండి. ఎంత చక్కగా ఉంటాయో!
వంటింటి నుంచి ముందు హాలు వరకూ ఎక్కడా అనవసర వస్తువులను పేర్చకండి. అవసరం అని కొన్నప్పటికీ వాడకపోతే మట్టుకు వాటిని నిర్మొహమాటంగా, నిరభ్యంతరంగా వదిలించేసుకోండి. అమ్మేస్తారా, ఇచ్చేస్తారా, పడేస్తారా- అనేది మీ ఇష్టం.
రంగుల ప్రాధాన్యతను గుర్తించండి. ప్రతి రంగులోనూ అందం, ఆహ్లాదం ఉంటుంది. కాకపోతే ఏది ఎక్కడ అతుకుతుంది, ఏ టెక్శ్చర్కు నప్పుతుందో గ్రహించాలి.
ఇంటి లోపల ముస్తాబుతోబాటు ముంగిట్లో వీలైనన్ని మొక్కలు పెంచండి. ఆ సహజ సౌందర్యానికి మరేదీ సాటి రాదు.