Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యాటింగ్ పరాక్రమానికి పేరుగాంచిన 21 ఏండ్ల యువతి జెమిమా రోడ్రిగ్స్. ఈ సంవత్సర ప్రారంభంలో న్యూజిలాండ్‌లో జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌కు ఆడిన భారత జట్టు నుండి తొలగించబడింది. దాంతో ఆమె నిరాశ గురయ్యింది. కానీ కఠినమైన ఈ సమయంలో ఆమె కొన్ని జీవిత పాఠాలను కూడా నేర్చుకుంది. ప్రస్తుతం కంటెంట్ సృష్టికర్తగా ప్రజాదరణ పొందుతున్న ఆమె గురించి మనమూ తెలుసుకుందాం...
తొలగించబడటం ఏ క్రీడాకారునికైనా బాధా కరమైన విషయమే. కానీ అది జీవితంలో ఒక భాగమని నాకు నేర్పింది'' జెమియా చెప్పింది. ఆమె మొదటి కొన్ని రోజులు ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టడం కష్టంగా ఉన్నందున కొంతకాలం క్రికెట్ నుండి విరామం తీసుకున్నట్టు వెల్లడించింది. ఇది ఆమెకు చాలా ఆనందించేది. ''నాకు క్రికెట్ ఆడడమంటే చాలా ఇష్టం. విరామం నాకు చాలా విషయాలపై పని చేయడంలో సహాయపడింది. నా చేతిలో ఉన్న సమయాన్ని చాలా వరకు సమర్థవంతంగా ఉపయోగించుకున్నాను'' ఆమె చెప్పింది.
కష్ట సమయాలు ఉండవు
ప్రపంచకప్‌ను టీవీలో చూడటం ఆమెకు మరింత ఇబ్బందికరమైన సమయం. అయితే ఆ సమయంలో టాప్ ప్లేయర్లు, హీరోలతో మాట్లాడటంలో రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఆమెకు సహాయం చేసారు. ''నేను మాత్రమే కాదు, వారు కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం వీరంతా లెజెండ్లు. వారితో మాట్లాడటం నాకు చాలా ఆశ, జీవితం పట్ల విశ్వాసాన్ని కలిగించింది. కఠినమైన సమయాలు ఎప్పుడూ ఉండవని, కఠినమైన వ్యక్తులు మాత్రమే ఉంటారని రోహిత్ భయ్యా గుర్తు చేశారు. ఇది ప్రపంచ అంతం కాదు. అవకాశాలు చాలా ఉంటాయి వాటి కోసం సిద్ధంగా ఉండాలి'' అనే విషయాలు ఈ సమయంలోనే తెలుసుకున్నాను.
ఉత్సాహంగా ఉంటుంది
తన స్వభావం, ఫామ్‌కు అనుగుణంగా జెమీమా సీనియర్ మహిళల లీగ్‌లో, భారత శ్రీలంక పర్యటనలో తిరిగి పుంజుకుంది. అక్కడ ఆమె ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్‌ను గెలుచుకుంది. పురుషుల క్రీడగా ఉన్న క్రికెట్లో క్రీడా మైదానాన్ని సమం చేయడానికి మహిళలు కష్టపడి పనిచేయడం ఉత్సాహంగా ఉంటుంది. 2017లో తాను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి కంటే ప్రస్తుత పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని జెమీమా భావిస్తోంది.
తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు
అప్పట్లో గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్న 400 మంది అబ్బాయిలలో ఆమె ఒక్కతే అమ్మాయి అని గుర్తు చేసుకుంది. ఇంటికి వచ్చిన వారు ఆమె తల్లిదండ్రులతో, 'పటా నహీన్, యే క్యా క్రికెట్ ఖేలేగీ, కుచ్ ఔర్ స్పోర్ట్ ఖేల్నే దో (ఆమె క్రికెట్ ఎలా ఆడుతుందో తెలియదు, ఆమెను వేరే క్రీడలో పాల్గొననివ్వండి)' అని చెప్పేవారు. కానీ నాలుగు సంవత్సరాల వయసులో క్రికెట్ ప్రారంభించినందున ఆమె తన చుట్టూ అంటున్న ఇటువంటి మాటలను అర్థం చేసుకోలేకపోయింది. అయితే ఆట పట్ల ఆమెకున్న ప్రేమను తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు. ఈ రకమైన కుటుంబ మద్దతు లేని వారికి ఇది కఠినమైనదని ఆమె అభిప్రాయపడింది.
గల్లీ నుంచి ప్రపంచ వేదిక వరకు
జెమీమా తన సోదరులు, ఎనోచ్, ఎలీతో కలిసి ముంబైలోని శివారు ప్రాంతంలోని భందుప్ గల్లీలో క్రికెట్ ఆడింది. తల్లిదండ్రులు తమ పిల్లలు క్రీడపట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారని అర్థం చేసుకున్నారు. దాంతో వారు బాంద్రాకు మారారు. పిల్లలు ఆడుకోవడానికి ఎక్కువ దూరం ప్రయాణం చేసే శ్రమను తగ్గించేశారు. ''అప్పుడు మేము చాలా చిన్న పిల్లలం. ముంబైలోని రద్దీ ప్రాంతంలో నివసించేవాళ్ళం. ఎక్కడికైనా వెళ్ళేటపుడు రైళ్లను మార్చడం చాలా కష్టంగా ఉండేది. మా పాస్టర్ సహోదరుడు మాన్యుయెల్ మా ఇంట్లో కొన్ని నెలల పాటు ఉండి హాకీకి సిద్ధమవుతుండగా మేమూ అక్కడే ఉండిపోయాం'' అని ఆమె జ్ఞాపకాలను నెమరువేసుకుంది. పాస్టర్ కూడా జెమిమాను హాకీకి పరిచయం చేశాడు. దానిని ఆమె ఎంతో సులభంగా ఆడింది. అండర్-19 జట్టుకు కూడా ఎంపికైంది.
ఇంతా నీ ఇష్టం అన్నారు
హాకీ లేదా క్రికెట్‌ను ఎంచుకోవడంలో ఆమె తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉంది. కానీ జెమీమా రెండింటిలోనూ నైపుణ్యం ఉన్నందున డైలమాలో పడింది. ''నేను కఠినమైన ఎంపిక చేయవలసి వచ్చింది. ఆ సమయంలో కొద్దిగా ఏడ్చాను కానీ మా నాన్న అంతా నీ ఇష్టం అన్నారు. అప్పటికే క్రికెట్లో ఉన్నత స్థాయికి చేరుకున్నందున నేను దానితో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. 2018లో నేను 17 సంవత్సరాల వయసులో దక్షిణాఫ్రికాలో అరంగేట్రం చేసాను. ఇది నా కల నిజమైన రోజు'' ఆమె చెప్పింది.
ఇంకా చాలా చేయాలి
ఇటీవలి కాలం మహిళల క్రికెట్ చాలా మంది ప్రతిభను తెరపైకి తెచ్చింది. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, ఇటీవలే ఆట నుండి రిటైర్ అయిన ఆల్-టైమ్ ఫేవరెట్ మిథాలీ రాజ్. అయితే చిన్న పట్టణాల నుండి ప్రతిభను తెరపైకి తీసుకురావడానికి చాలా చేయాల్సి ఉంది. చిన్న పట్టణాలలో ఆడే ఆటలతో ఐపీఎల్ మహిళల ఎడిషన్ కచ్చితంగా మహిళల క్రికెట్ రూపురేఖలను మారుస్తుందని జెమీమా అభిప్రాయపడ్డారు.
క్రికెట్‌తో ప్రేమలో పడొచ్చు
''ఆస్ట్రేలియాతో ఆడేందుకు మేము బరోడాకు వెళ్లినట్టు నాకు గుర్తుంది. అక్కడ వచ్చిన ప్రేక్షకులను చూసి ఆశ్చర్యపోయాము. తల్లిదండ్రులు తమ యువతులను ఆట చూసేందుకు రప్పించారు. ఆటగాళ్ళుగా మనం చేయగలిగే ఒక మంచి పని ఏమిటంటే చిన్న చిన్న పట్టణాలలో క్రికెట్ ఆడటం, అమ్మాయిలతో గడపడం. ఎవరికి తెలుసు వారు క్రికెట్‌తో ప్రేమలో పడొచ్చు. దానిని కూడా ఎంచుకోవచ్చు'' ఆమె చెప్పింది.
'కంటెంట్'తో ఆడటం
జెమీమా బబ్లీ పర్సనాలిటీ, కంటెంట్‌ని క్రియేట్ చేయడంలో నేర్పు ఆమెను సోషల్ మీడియా స్టార్‌గా మార్చాయి. ''నాకు కేవలం కొద్ది విషయాలు మాత్రమే తెలుసు. నా సోదరులు ఎనోక్, ఎలీ చాలా సృజనాత్మకంగా ఉన్నారు. ఒకటి వీడియో ఎడిటింగ్, ఫోటోగ్రఫీ. మరొకటి సంగీతంలో ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విషయంలో వారే నాకు సహాయం చేస్తారు. నేను కేవలం నటిస్తున్నాను'' అంటుంది.
సోషల్ మీడియాకు దూరంగా
క్రికెట్ వంటి డిమాండ్ ఉన్న క్రీడకు మానసిక దృఢత్వం కూడా చాలా అవసరం. జెమిమా దానిని ఎలా ఎదుర్కొంటుంది? ధైర్యం, బలం కోసం ఆమె తన తల్లిదండ్రులతో మాట్లాడుతుంది. అవసరమైనప్పుడు స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌లు మద్దతు తీసుకుంటుంది. విరాట్ కోహ్లి పుస్తకం నుండి ఒక లీఫ్ తీసి, జెమీమా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లను అన్ఇన్స్టాల్ చేస్తుంది లేదా ఆమె ఆడుతున్నప్పుడల్లా సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. ''నేను విరాట్ కోహ్లీతో మాట్లాడాను. అతను కికెట్ ఆడుతున్నప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడని నాకు చెప్పారు. 100 మంచి కామెంట్లలో ఒక విచ్చలవిడి కామెంట్ ఉండొచ్చు. అది ఆ సమయంలో మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను'' అని చెప్పారు.
వ్యాపారం ప్రారంభిస్తే
తన ఖాళీ సమయంలో జెమీమా గిటార్ వాయించడానికి, సంగీతం వినడానికి ఇష్టపడుతుంది. ఎప్పుడైనా ఆమె వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ముంబైలో చారు కి తాప్రీ (టీ స్టాల్) తెరవాలనుకుంటోంది. ''నేను చారుని ప్రేమిస్తున్నాను. కాబట్టి తాప్రీ అనేది నాకు సరైన ఆలోచనగా లేదా కేఫ్‌గా కూడా ఉండవచ్చు'' అని జెమీమా నవ్వుతూ చెప్పింది.