Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కెరియర్ ఎదుగుదలలో నిర్వహణా నైపుణ్యాలు చాలా కీలకం. ఇవి సాఫ్ట్‌స్కిల్స్‌లో భాగం. సమయం, వనరుల్ని సమర్థంగా వినియోగిస్తూ ప్రయత్నం సఫలమయ్యేలా సాయపడతాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇవి..
కంప్యూటర్లో సమాచారాన్నీ, డెస్క్‌లో ఫైల్స్‌ని ఒక పద్ధతిలో పెట్టుకుంటున్నారా? అయితే మీకు ఈ నైపుణ్యం ఉన్నట్టే. దీనివల్ల అవసరమైనవి సకాలంలో సులభంగా పొందుతారు. దాని వల్ల సమయం వృథా కాదు.
ఏదైనా ఒక ఆచరణాత్మక లక్ష్యాన్ని, దాని సాధనకు గడువును నిర్దేశించుకోవడం. దాన్ని చేరేందుకు ఓ ప్రణాళికా వేసుకోవాలి. ఇది మిమ్మల్ని లక్ష్యం దిశగా ప్రేరణ కలిగించేలా, ఆ ప్రయాణాన్నీ ఆస్వాదించేలా ఉండాలి. దీని కోసం లక్ష్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి కాల పరిమితిని పెట్టుకుని చేయడమే మేలు. దీనివల్ల పనులు సకాలంలో పూర్తి కావడంతోపాటు, మీ సామర్థ్యం మెరగవుతుంది.
ఆ వారానికి సంబంధించి మీ చేతిలో మూడు లక్ష్యాలు ఉన్నాయనుకుందాం. వాటిలో ఏది ముఖ్యమో, ఏది ముందు చేయాలో, దేనికి ఎక్కువ సమయం కేటాయించాలో.. ఇవన్నీ తెలుసుకుని ప్రాధాన్యం ఇవ్వాలి. చాలావరకూ లక్ష్యాల్ని స్వల్ప వ్యవధిలోనే పూర్తిచేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఈ నైపుణ్యం మిగతావారికంటే మిమ్మల్ని ముందుంచుతుంది.
ఒక పనిని ఏ విధంగా చేస్తే సకాలంలో, తక్కువ వనరులతో పూర్తి చేయగలమో అంచనా వేయగలరా? అయితే మీకు నిర్ణయ సామర్థ్యం ఉన్నట్టే. ఈ నైపుణ్యం ఉంటే పని టైమ్‌లో పూర్తికాలేదనీ, ఇంకో దారిలో వెళ్లాల్సిందనీ.. ఇలా చింతించాల్సిన అవసరం ఉండదు.
చాలావరకూ పనులు టీంతో కలిసి చేయాల్సి ఉంటుంది. దీనికి భావవ్యక్తీకరణ నైపుణ్యాలతోపాటు వృత్తి నైపుణ్యాలూ అవసరం. అవసరమైతే బృందానికి అనధికారికంగా నాయకత్వం వహించాలి. నేను అమ్మాయిని, మిగిలిన అబ్బాయిలు ఏమనుకుంటారో అని సంకోచించవద్దు. అప్పుడే భవిష్యత్తులో నాయకులవ్వగలరు.