Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దంపతులన్నాక సవాలక్ష సమస్యలుంటాయి. ఈ క్షణం గొడవపడితే, మరుక్షణం తిరిగి కలిసిపోతారు. ఇద్దరి మధ్య ఇలాంటి కమిట్మెంట్ ఉంటేనే ఆ బంధం శాశ్వతమవుతుంది. అయితే కొంతమంది తమ భాగస్వామిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. తమ మాటలు, చేతలతో వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తుంటారు. ఇదే నిత్యం కొనసాగితే మాత్రం దాంపత్య బంధంలో పూడ్చలేని అగాథం ఏర్పడుతుంది. పరిస్థితి అంతదాకా రాకముందే జాగ్రత్తపడమంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. భాగస్వామి మీతో మసలుకునే విధానాన్ని బట్టే వారు మీ ఆత్మగౌరవానికి భంగం కలిగే పనులేమైనా చేస్తున్నారా అనేది పసిగట్టవచ్చంటున్నారు. అలాగే ప్రతి సమస్యకూ ఏదో ఒక పరిష్కారం ఉన్నట్టే మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూసే మీ భాగస్వామినీ మార్చుకునే చిట్కాలు కొన్నున్నాయంటున్నారు నిపుణులు. కాబట్టి మీ భాగస్వామి మీతో ప్రవర్తించే ఈ లక్షణాల్ని పసిగట్టి వారితో కాస్త ఓపిగ్గా మెలిగితే ఫలితం సానుకూలంగా ఉంటుందంటున్నారు. ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం.
అవతలి వారు ఎంత చేసినా.. వారిపై నిష్కల్మషమైన ప్రేమను చూపిస్తుంటారు కొందరు. అయితే ఈసారి మీ ప్రేమను ఓ చిన్న లేఖ, పర్సనల్ నోట్ రూపంలో వారికి తెలియజేయండి. వారి ప్రవర్తన వల్ల మీరెంత బాధపడుతున్నారో.. అయినా మీరు మౌనం వహిస్తూ ఓపిగ్గా ఉంటున్నారో.. వాళ్లను ఎంతలా ఇష్టపడుతున్నారో చెబుతూ మీ మనసును విప్పండి.. ఫలితం ఉండచ్చు.
ఎప్పటికైనా ఓపికే మనల్ని కాపాడుతుందంటుంటారు. నిజానికి ఇదే ఒక దశలో వాళ్ల ప్రవర్తనేంటో వాళ్లకు అర్థమయ్యేలా చేస్తుంది. తప్పొప్పులు గ్రహించేలా చేస్తుంది. దీనివల్ల కూడా వారు మారే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.
లైంగిక జీవితం కూడా భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యల్ని దూరం చేసి.. వారిని దగ్గర చేస్తుందంటారు నిపుణులు. అందుకే మీ భాగస్వామిని మార్చుకోవడానికి దీన్నో మార్గంగా మలచుకోవడంలో తప్పు లేదంటున్నారు.
భాగస్వామి ప్రవర్తన ఎలా ఉన్నా.. అది మీ మనసును బాధ పెట్టినా.. స్వీయ ప్రేమను కోల్పోకూడదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీకు నచ్చిన పనులు చేయడం, తద్వారా ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవడం.. వంటివి చాలా ముఖ్యం.
పెళ్లనేది శాశ్వతమైన అనుబంధం. ఇలాంటి చిన్న చిన్న సమస్యలతో తెంచుకునేది కాదు. కాబట్టి ఓసారి మీ ఇరువురి పెద్దలతోనూ మీ సమస్యల్ని చెప్పి.. వాటికి పరిష్కార మార్గాలు వెతుక్కోవచ్చు.. అయినా ఫలితం లేకపోతే.. నిపుణుల కౌన్సెలింగ్ మేలు చేస్తుంది. మీ మధ్య పెరిగిన దూరాన్ని చెరిపేసి తిరిగి ఇద్దరినీ ఒక్కటి చేస్తుంది. ప