Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా మనలో చాలా మంది ముఖంపై అవాంఛిత రోమాలు కనిపిస్తే ఆత్మన్యూనతకు గురౌతాము. ఏదో విధంగా వాటిని వధిలించుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ ఆమె అలా చేయలేదు. తన మీసమంటే తనకెంతో ఇష్టం అంటుంది. పైగా మీసాలు మగాళ్ళు మాత్రమే మేలేస్తారా? వాళ్లకేం తక్కువ కానంటూ మీసాలను మేలేసి మరి తిప్పుతోంది. నా మీసాలు.. నా ఇష్టం.. ఇందులో వేరొకరి ప్రమేయం అవసరం లేదంటూ తెగేసి మరి చెబుతోంది ఆమె.
కేరళకు చెందిన ఓ మహిళ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అచ్చం మగాళ్ల లాగా మీసాలను మెలితిప్పి.. నా ఇష్టం అంటుంది. అయితే.. ఆమెను నెటిజన్లు చాలామంది ప్రశంసిస్తుండగా.. మరికొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఈ సమయంలో ఆమె చెప్పిన మాటాలు విని అందరూ సెల్యూట్ చేస్తున్నారు.
కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన 35 ఏండ్ల షైజా తన మీసాల కారణంగా ఇటీవల వార్తల్లో నిలిచింది. ఈ వ్యవహారాన్ని కొందరు వ్యతిరేకించగా, మరికొందరు ఆమెకు మద్దతుగా నిలవడంతోపాటు ప్రశంసిస్తున్నారు. దీని గురించి షైజా మాట్లాడుతూ తాను మీసాలను పెంచుకోవాలనుకుంటున్నానని, వాటిని తీసివేయడం అస్సలు ఇష్టం లేదని స్పష్టం చేసింది. ''మీసం గురించి నన్ను ఎగతాళి చేస్తారు.. పురుషులకు మీసాలు ఉంటాయి.. మహిళకు మీసాలు ఎందుకు ఉంటాయంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. నాకు నచ్చింది.. నేను మీసం ఉంచుకున్నా.. నేనేందుకు మీసం ఉంచుకోకూడదు'' అని షౌజా అంటుంది.
ప్రపంచం తన గురించి ఏమనుకున్నా తాను పట్టించుకోనని.. మీసాలు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేనని షైజా స్పష్టంగా చెప్తుంది. కరోనా సమయంలోనూ తాను మీసాలను కప్పి ఉంచే మాస్క్ పెట్టుకోవడాన్ని ఇబ్బందిగా భావించానని అంటుంది. అయితే షైజా గత పదేండ్లుగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది. ఆరుసార్లు ఆపరేషన్లు జరిగాయని.. ఆపరేషన్ కోసం వెళ్లిన ప్రతీసారి ఇక వెళ్లాల్సిన అవసరం లేదని నమ్మెదాన్నంటూ చెబుతుంది. ప్రపంచంలోనే మీసాలు ఉన్న మొదటి మహిళ షైజా ఒక్కతే కాదు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం 2016లో బాడీ పాజిటివిటీ ప్రచారకర్త హర్నామ్ కౌర్ గుబురు గడ్డం కలిగిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది.