Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుండీల్లో పెంచే మొక్కలకు రోజూ నీరు పోస్తే వాటి వేర్లు కుళ్లిపోయి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. తక్కువ నీరు పోస్తే.. మొక్కలు వాడిపోయి జీవం కోల్పోయినట్లుగా తయారవుతాయి. అందుకే తక్కువ నీరు పోసినప్పటికీ కుండీలోని మట్టిలో తేమ నిలిచి ఉండే ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఈ పనిని వాడేసిన కాఫీ పొడి సమర్థంగా నిర్వహిస్తుంది. దీనికోసం కుండీలో మొక్కను నాటేటప్పుడు నింపే మట్టిలో కాఫీ పిప్పిని కలిపితే సరిపోతుంది. ఇది నీటిని పీల్చుకొని తేమగా ఉంచడంతో పాటు ఎరువుగానూ ఉపయోగపడుతుంది.