Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఆకాశం నల్లగా ఉంది. అంతరిక్షంలోని శూన్యతలో నీలిరంగు గ్రహం ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంది'' అంటూ శిరీష బండ్ల తన ఏడాది కిందటి అంతరిక్ష ప్రయాణాన్ని గుర్తు చేసుకుంది. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మూడో భారతీయ మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. సర్ రిచర్డ్ బ్రాన్సన్తో అంతరిక్షంలోకి ప్రయాణించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆమె తన అనుభవాలను మనతో పంచుకుంటుంది.
జులై 11, 2021న అప్పటి ఆస్ట్రోనాట్ నంబర్ 04 శిరీష ఎప్పటికీ మర్చిపోలేని అనుభవాన్ని పొందింది. ఆకాశం నల్లగా ఉంది. కానీ అంతరిక్షంలోని శూన్యతలో నీలిరంగు గ్రహం ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంది. ఇది జరిగి ఏడాది గడిచింది. ఇప్పటికీ శిరీష అంతరిక్షంలో తన అనుభవాన్ని కండ్లకు కట్టినట్టు వివరిస్తుంది. ''నేను చిన్నదానే. చేయాలనే కోరిక చిన్నది కాదు. దీని నుంచి మంచి అనుభూతి చెందుతూ ఇంకా చాలా చేయాలనుకుంటున్నాను. నేను సరిహద్దులు లేని భూమిని, గ్రహాన్ని చూశాను. గ్రహం వాస్తవానికి ఎంత దుర్బలంగా ఉందో మీరు తెలుసుకుంటారు. రాష్ట్ర రేఖలు, సరిహద్దులు లేవు. విభజనలన్నీ మనం సృష్టించుకున్నవే'' అని శిరీష అంటుంది.
ఇతరులు అంతరిక్షంలోకి వెళ్ళేందుకు
వర్జిన్ గెలాక్టిక్లోని ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల వైస్ ప్రెసిడెంట్ అయిన శిరీష అంతరిక్షంలోకి ప్రయాణించిన మూడవ భారతీయ సంతతి మహిళగా అవతరించి ఒక సంవత్సరం పూర్తయింది. ఆమె వర్జిన్ గ్రూప్ స్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్తో కలిసి వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ 22 మొదటి పూర్తి సిబ్బందితో కూడిన విజయవంతమైన సబార్బిటల్ టెస్ట్ ఫ్లైట్‌లో ప్రయాణించింది. ప్రస్తుతం శిరీష తన అర్హత ద్వారా ఏరోనాటికల్ ఇంజనీర్, అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఇతరులకు సహాయం చేయడంపై దృష్టి సారించింది.
నేరుగా స్పేస్‌లోకి వెళ్ళి
''ముఖ్యంగా శాస్త్రవేత్తలు... ఇప్పుడు వారు నేరుగా స్పేస్‌లోని ఫీల్డ్కి వెళ్లి పారామితులను పరీక్షించవచ్చు. లేకపోతే వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములను నియమించవలసి ఉంటుంది లేదంటే నాసాలోకి ప్రవేశించవలసి ఉంటుంది. కానీ వర్జిన్ గెలాక్టిక్‌తో వారు స్వయంగా అక్కడికి వెళ్ళవచ్చు'' అని శిరీష అంటుంది. మీరు వెళ్లే ముందు ప్రయాణం మొదలవుతుందని, ఫ్లైట్ దిగిన తర్వాత చాలా సేపు కొనసాగుతుందని శిరీష అంటుంది.
ఐదేండ్లకే మొదలుపెట్టింది
ఆమె ఐదు సంవత్సరాల వయసులో వెయ్యి మెట్ల సామెతకు ప్రభావితం చెంది తన ప్రయాణం ప్రారంభించింది. తాను జన్మించిన ఆంధ్రప్రదేశ్‌లోని చిన్న గ్రామంలో ఒకరోజు రాత్రి ఇంటి డాబా మీద పడుకుంది. ''అప్పుడు కరెంటు పోయింది. మనమందరం వేడి నుండి తప్పించుకోవాలని కోరుకుంటున్నాము. ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ నేను ఒక రోజు డాబాపైనే పడుకున్నాను. నేను వ్యోమగామి కావాలని మా అమ్మ అప్పుడే చెప్పింది. ఆరోజే నా అంతరిక్ష ప్రయాణం మొదలైంది'' అని శిరీష చెప్పింది. అప్పటి నుండే ఆమె అంతరిక్షం గురించి చదవడం ప్రారంభించింది. సైన్స్ ఫిక్షన్, స్పేస్ ఫిక్షన్ సిరీస్ పుస్తకాలు చదవడంలో మునిగిపోయింది. ''ఆ పుస్తకాలు చదివేటపుడు నేనూ ఒక అంతరిక్ష నౌకకు కెప్టెన్‌గా ఉన్నట్టు ఊహించుకునేదాన్ని'' ఆమె చెప్పింది. అప్పట్లో ఆమె అంతిమ లక్ష్యం అంతరిక్షం
ఆమె ఒక అద్భుతమైన ఇంజనీర్
''నేను అపోలో విమానాల గురించి అన్నీ చదివాను. మిలిటరీలో టెస్ట్ పైలట్లు ఉన్నారని నాకు తెలుసు. అది ఒక ఎంపిక. ఇంజినీరింగ్ మార్గాన్ని అనుసరించడం మరొక ఎంపిక. నేనైతే కల్పనా చావ్లా ప్రయాణాన్ని అనుసరించాను. ఆమెను ఎన్నడూ కలవనప్పటికీ ఆమె ఒక అద్భుతమైన ఇంజనీర్ అని నాకు తెలుసు. ఆమె ప్రయాణం నాకు సంబంధించినది. అలా ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లోకి వచ్చాను'' అని శిరీష చెబుతోంది.
జీవితాన్ని కోల్పోయానని భావించా
గణితం, శాస్త్రాలను చదవడంలో ఆమెకు ఆసక్తి ఎక్కువ. కాబట్టి ఇంజనీరింగ్ ఆమెకు సరైన మార్గం. అయితే శిరీష తాను అనుసరించాలనుకున్న మార్గాన్ని నిర్దేశించుకున్నప్పటికీ వాస్తవానికి ఇతర ప్రణాళికలు కూడా ఉన్నాయి. ''నాకు 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా కంటి చూపు దెబ్బతిన్నది. డాక్టర్ నుండి ప్రిస్క్రిప్షన్ తీసుకుంటున్నప్పుడు, నేను నాసా వ్యోమగామికి సంబంధించిన అర్హతలను గుర్తుచేసుకున్నాను. ఇక నేను దానికి అర్హతను కోల్పోయానని అర్థమయింది. అప్పటి నుండి నా కంటిచూపు ప్రమాణాలకు అనుకూలంగా లేదు. నా కోరికలన్నీ విచ్ఛిన్నమయ్యాయి. నా జీవితాన్ని 15 సంవత్సరాలకే కోల్పోయానని భావించాను'' అని ఏరోనాటికల్ ఇంజనీర్ చెప్పారు.
మళ్లీ ఆకాశంలోకి ఎగిరాయి
అయితే 2004లో ఆమె కలలు మళ్లీ ఆకాశంలోకి ఎగిరాయి. అన్సారీ ఎక్స్ ప్రైజ్‌ని రెండుసార్లు అంతరిక్షంలోకి వెళ్లి వెనక్కి వెళ్లగలిగే స్పేస్‌క్రాఫ్ట్‌ను తయారు చేయగల ప్రైవేట్ కంపెనీ లభించింది. ూజూaషవూష్ట్రఱజూఉఅవ బహుమతిని గెలుచుకుంది. శిరీష మాట్లాడుతూ ''సర్ రిచర్డ్ బ్రాన్సన్ తాను వర్జిన్ గెలాటిక్ కంపెనీని ప్రారంభిస్తానని, ప్రతి ఒక్కరికీ ఓపెన్ స్పేస్ చేస్తానని ప్రకటించాడు. నేను ఇప్పటికీ అంతరిక్షంలోకి వెళ్లగలననే నమ్మకం వచ్చింది. ఇది నాకు నేర్పింది. అందరికీ సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఏదైనా సాధించాలనుకుంటే మార్గాలు అనేకం ఉంటాయి. నా ప్రయాణం ప్రజలు తమ లక్ష్యాన్ని సాధించడానికి సాంప్రదాయేతర మార్గాలను ఎంపిక చేసుకునేందుకు కూడా ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నాను. మీ కలలను నిజం చేసుకునేందుకు వినూత్న పద్ధతులను ఉపయోగించవచ్చు. అయితే చాలా సంవత్సరాల కిందట ఇది కేవలం ఒక వెర్రి ఆలోచనగా ఉండేది. మీ కలను ఎప్పుడూ వదులుకోవద్దు. దానిని సాధించడానికి మార్గాలను కనుగొనండి'' అంటుంది శిరీష.