Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధిక బరువు వల్ల ఎలాగైతే వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయో బరువు తక్కువగా ఉండడం వల్ల కూడా వెంటాడే ఆరోగ్య సమస్యలు బోలెడుంటాయి. ఇది కేవలం పెద్దవాళ్లకే కాదు.. పిల్లలకీ వర్తిస్తుంది. మరీ తక్కువ బరువున్న పిల్లలు బరువు పెరగాలంటే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం...
కొంతమంది తల్లులు పిల్లలు బరువు తక్కువగా ఉన్నారని టెన్షన్ పడుతూ వాళ్లకు ఎలాగైనా ఆహారం తినిపించాలని నిర్ణయించుకుని బలవంతంగా తినిపిస్తుంటారు. ఇలా చేయడం వల్ల తినే ఆహారంపై వారికి ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. పైగా ఈ పద్ధతి వల్ల వారు తినకుండా మరింత మొండికేస్తుంటారు. దీనివల్ల వారికి అందాల్సిన పోషకాలు పూర్తిగా అందకుండా పోతాయి. కాబట్టి పిల్లల్ని ఆహారం విషయంలో బలవంతపెట్టకుండా వారి కోసం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి.. ఏ పదార్థాలు, స్నాక్స్ ఇవ్వాలో ఓ ప్రణాళిక తయారుచేయాలి. దాని ప్రకారం వారికి పోషకాహారం అందించాలి. ఫలితంగా వారికి కావాల్సిన పోషకాలు అంది.. శరీర బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
తల్లిదండ్రులు మామూలు సమయాల్లో టీవీ చూడనివ్వట్లేదని, కనీసం తినే సమయంలోనైనా టీవీ చూడచ్చని చాలామంది పిల్లలు ఆనందపడిపోతుంటారు. ఇక ఈ సాకుతో గంటలు గంటలు తినడానికే వథా చేస్తుంటారు. అయితే ఇలా తినడం వల్ల వారి ధ్యాసంతా ఆహారం మీద కంటే టీవీ మీదే ఎక్కువగా ఉంటుంది. దీంతో ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? అనే విషయాలేవీ వారు పట్టించుకోరు. అందులోని రుచి వారికి తెలియదు. ఆహారం తీసుకోవడంపై మనసు లగం చేయకపోవడం వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి పిల్లలు తినే సమయంలో టీవీ ఆఫ్ చేసేయడం, మొబ్కెల్స్, కంప్యూటర్, ల్యాప్టాప్స్.. వంటి గ్యాడ్జెట్లు వారికి దూరంగా ఉంచడం.. వంటివి చేయాలి.
ముందుగా వారికి ఎక్కువ క్యాలరీలుండే ఆహారపదార్థాలు అందించాలి. అలాగని కేక్‌లు, స్వీట్లు, పిజ్జా, బర్గర్లు.. వంటివి పెట్టమని కాదు దానర్థం. చిక్కటి పాలు, మీగడ పెరుగు, ఆహారంలో భాగంగా నెయ్యి.. వంటి పదార్థాలతో పాటు విటమిన్లు, ఖనిజాలు అధికంగా లభించే పండ్లు, కూరగాయల్ని కూడా వారి రోజువారీ ఆహారంలో భాగం చేయాలి. దీనిపై సరైన అవగాహన లేకపోతే సంబంధిత పోషకాహార నిపుణులను సంప్రదించి వారు సూచించే ఆహారాన్ని పిల్లలకు రోజూ అందివ్వాలి.
వయసు, ఎత్తు వంటివి ఆధారంగా బరువును నిర్ణయిస్తారు. కాబట్టి ముందుగా నిపుణులను సంప్రదించి వారి ఎత్తు, వయసు ప్రకారం ఎంత బరువుండాలో తెలుసుకోవాలి. తర్వాత వారు అందించే సూచనలు పాటిస్తూ పిల్లల బరువును క్రమంగా పెంచాలి. ఎప్పటికప్పుడు ఎంత బరువు పెరుగుతున్నారు? ఒకవేళ ఉండాల్సిన దానికంటే బరువు ఎక్కువ్కెతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. తక్కువ్కెతే పెంచాల్సిన మార్గాలు.. వంటి విషయాలన్నింటిపై తల్లిదండ్రులకు మంచి అవగాహన ఉంటే మంచిది.