Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కండ్లు పొడిబారుతున్నాయా.. దురదగా ఉంటున్నాయా? వాతావరణంలో తేమ తక్కువగా ఉండటం వల్ల కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి. అయితే కొన్ని చిట్కాల ద్వారా ఈ సమస్య చెక్ పెట్టవచ్చు.
ఆకుకూరలు తినాలి. కంటికి ఆకుకూరలు మంచి ఆరోగ్యాన్నిస్తాయి.
చక్కెరను పరిమితంగా వాడాలి. రిఫైన్డ్ ఫుడ్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రిఫైన్డ్ ఫుడ్ ఎంత తక్కువగా తీసుకుంటే కళ్లకు అంత మంచిది.
ఉండే పదార్థాలు జీవక్రియలను ప్రభావితం చేస్తాయి. ఇది పరోక్షంగా కండ్లు పొడిబారడానికి కారణమవుతుంది. కాబట్టి కొవ్వు పదార్థాలను తక్కువగా తీసుకోవాలి.
ప్రతి రోజూ 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలి. అప్పుడే మన శరీరంలో కావలసినంత తేమ ఉంటుంది. దీనివల్ల కండ్లు కూడా పొడిబారకుండా ఉంటాయి.
పండ్ల రసాలు తీసుకుంటే కండ్లకు చాలా మంచిది. వివిధ పోషకాలను పండ్ల రసాల ద్వారా శరీరం సులభంగా గ్రహిస్తుంది.
ఎలర్జీ కలిగించే పదార్థాల వల్ల కూడా కండ్లు పొడిబారే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పదార్థాలేవో గుర్తించి వాటికి దూరంగా ఉండండి.
కంప్యూటర్ ముందు పని చేసేటప్పుడు కనురెప్పలు ఆర్పడం తక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా కండ్లు పొడిబారిపోతాయి. కాబట్టి తరచుగా కనురెప్పలు ఆర్పుతుండడం మరిచిపోకండి.
మధ్యమధ్యలో కనురెప్పలను మదువుగా మర్దన చేసుకుంటే మంచిది. దీనివల్ల టియర్ గ్లాండ్స్ ప్రేరేపితమవుతాయి. తద్వారా కండ్లు తేమగా ఉంటాయి.