Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైఫిల్ షూటర్ ప్రియాల్ కేని అనేక విజయాలు సాధించారు. సామాజిక వ్యవస్థాపకురాలిగా, చార్టర్డ్ అకౌంటెంట్, క్రీడాకారిణిగా ఉన్న ఆమె ఇప్పుడు యుఎన్ మహిళా మిత్రురాలు. నిరుపేద పిల్లలకు క్రీడా విద్యను అందిస్తూ వారి సాధికారత కోసం కృషి చేస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో...
ప్రియాల్ కేని 2008లో తన 13 ఏండ్ల వయసులో మొదటిసారి ఈ క్రీడను చేపట్టింది. 16 ఏండ్లకు జర్మనీలో జరిగిన తన తొలి అంతర్జాతీయ షూటింగ్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ''ఆ సమయంలోని చట్టాల ప్రకారం నేను 16 ఏండ్ల వయసులో లైసెన్స్ పొందిన తుపాకీతో ప్రయాణించలేను. నా ఆయుధాన్ని మరొకరు తీసుకెళ్లడానికి రాష్ట్ర సంఘం, జాతీయ సంస్థ, జర్మన్ అధికారుల అదనపు అనుమతులు తీసుకోవలసి ఉంది'' అంటూ ప్రతిరోజూ నాలుగైదు గంటలు రైఫిల్‌లో శిక్షణ ఇచ్చే ప్రియాల్ గుర్తుచేసుకుంది.
నిర్ణయాత్మకంగా మార్చింది
ముంబయిలోని మండే వేడిలో 6.5 కిలోల రైఫిల్‌ను పట్టుకుని ఆమె సాంకేతికతను మెరుగుపరిచేందుకు పని మొదలుపెట్టింది. చాలా పోటీ పరిస్థితుల్లో చలి, మంచుతో కూడిన జర్మనీలో పోటీ చేయడం ఆమెకు పూర్తిగా భిన్నమైంది. అయితే ఆ అనుభవం ఆమెను గతంలో కంటే మరింత నిర్ణయాత్మకంగా మార్చింది. ఆ మొదటి పోటీ ఈవెంట్ నుండి ప్రియాల్ అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. భారత షూటింగ్ జట్టులో భాగమయింది. అంతేకాదు ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పోటీ పడింది. ఆమె ఇప్పటివరకు 117 పతకాలను గెలుచుకుంది. అలాగే మూడు జాతీయ రికార్డులను బద్దలు కొట్టింది.
ప్లే అండ్ షైన్ ఫౌండేషన్
ఆమె క్రీడల్లోకి రాకముందే, ఎదుగుతున్న వయసులోనే కమ్యూనిటీ వాలంటీరింగ్తో కలిసి పని చేసిన అనుభవాలు బాగా ప్రభావితం చేశాయి. ''నా పాఠశాల తరపున బాంబే స్కాటిష్కు పాల్గొనే అవకాశం వచ్చింది. అలాగే నేను నా సిఎ చదువును పూర్తి చేసిన తర్వాత సామాజిక రంగాన్ని చూడడానికి నాకు సమయం దొరికినట్టు అనిపించింది'' అని ప్రియాల్ చెప్పింది. ఆ సామాజిక స్పృహతోనే తన తోటి షూటర్ సార్థక్ వాణితో కలిసి ప్రియాల్ 2019లో ప్లే అండ్ షైన్ ఫౌండేషన్‌ను ప్రారంభించింది. ఇది లాభాపేక్ష లేకుండా క్రీడా సంస్కతిని పెంపొందించే లక్ష్యంతో పని చేస్తుంది. వారి ఫౌండేషన్ ద్వారా ప్రియాల్, సార్థక్ ఇతర వాలంటీర్ అథ్లెట్లు మహారాష్ట్రలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడల ద్వారా విద్యార్థులకు మద్దతునిస్తున్నారు. క్రీడల పట్ల వారిలో ఆసక్తి పెంచుతున్నారు. వారికి మార్గదర్శకులుగా ఉంటున్నారు. ఫౌండేషన్ 2023 చివరి నాటికి పది లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
సామాజిక ప్రభావం - క్రీడలు
''మేము ఫౌండేషన్ ప్రారంభించటానికి ఒక సంవత్సరం ముందు సార్థక్, నేను సమీపంలోని రెండు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళాము. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడా పాఠాలు చెప్పడానికి మౌలిక సదుపాయాలు లేవు. పిల్లలకు క్రీడల గురించి పిల్లలకు బోధిస్తామని, వారపు క్రీడా సెషన్లతో మా పని ప్రారంభిస్తామని వారికి చెప్పాము'' అని ప్రియాల్ అంటుంది. వారి పని అనధికారికంగా, పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక లేకుండా ప్రారంభమైనప్పటికీ పిల్లలు చూపిన ఆసక్తి, శక్తి ఆ జట్టును ముందుకు నడిపించింది. 2019లో ఫౌండేషన్ అధికారికంగా ప్రారంభించబడినప్పుడు వివిధ రంగాలకు చెందిన క్రీడాకారుల నెట్‌వర్క్‌తో ప్రియల్, సార్థక్‌లు చేరారు. అవసరమైనప్పుడు వారి సేవలను స్వచ్ఛందంగా అందించే మనస్తత్వవేత్త, ఫిజియోథెరపిస్ట్ కూడా సంస్థలో ఉన్నారు. 2020లో ప్లే అండ్ షైన్ ఫౌండేషన్ టీచ్ ఫర్ ఇండియా (TFI), టాటా సస్టైనబిలిటీ గ్రూప్‌తో కలిసి పనిచేసింది. ప్రియల్ సంస్థ పిల్లల కోసం స్పోర్ట్స్ లిటరసీ, స్పోర్ట్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. పేద పిల్లల శారీరక, అభిజ్ఞా వికాసానికి దోహదపడేలా ఈ కార్యక్రమం ప్రత్యేకంగా రూపొందించబడింది.
అనిశ్చితి నుండి బయటపడేందుకు
కోవిడ్ సమయంలో ఆన్లైన్ ప్రభావం 2020లో TFI టై-అప్ అయిన వెంటనే కోవిడ్-19 మహమ్మారి చెలరేగింది. ఈ కాలాన్ని సవాలుగా పేర్కొంటూ ప్రియాల్ ''మేము కొంతమంది TFI సభ్యులతో వారి తరగతి గదులతో పనిచేయడం ప్రారంభించడానికి మాట్లాడాము. కానీ మహమ్మారి వల్ల ప్రతిదీ నిశ్చలంగా మారింది. రెండు నెలలు అటువంటి అనిశ్చితి నుండి ఎలా బయటపడాలో ప్రయత్నించాము. మిగిలిన విద్యావ్యవస్థ ఆన్లైన్ మోడల్‌కి మారినట్లయితే, క్రీడా విద్యను కూడా ఆన్లైన్ మోడల్‌గా మార్చడానికి ప్రయత్నించి చూద్దాం అనుకున్నాం. ఆన్లైన్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ సెషన్లను ప్రారంభించాము. మేము పని చేస్తున్న పిల్లలకు క్రికెట్ తప్ప ఇతర క్రీడల గురించి తెలియదు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి పేర్లు కాకుండా చాలా తక్కువ మంది విద్యార్థులు ఇతర క్రీడాకారుల పేర్లు చెప్పడం మేము గమనించాము'' అని ఆమె చెప్పింది.
లాజిస్టిక్ సమస్య కూడా ఉంది
వారి టాస్క్ కటౌట్‌తో ప్రియల్, ఆమె బందం వివిధ క్రీడలు, అథ్లెటిక్స్ గురించి విద్యార్థులతో మాట్లాడటం ప్రారంభించింది. చివరికి 15 కంటే ఎక్కువ రకాల క్రీడలను కవర్ చేసింది. ''మేము వారితో చాలా స్ఫూర్తిదాయకమైన క్రీడా కథనాలను పంచుకునేవాళ్ళం. అలాగే యోగా, ధ్యానం కూడా నేర్పించాము'' అంటుంది ఆమె. క్రీడా అవగాహన పక్కన పెడితే వెనుకబడిన వర్గాల డిజిటల్ అక్షరాస్యత విషయానికి వస్తే లాజిస్టిక్స్ సమస్య కూడా ఉంది. ముంబైలోని BMC పాఠశాలలతో పని చేస్తున్నప్పుడు చాలా మంది పిల్లలు వారి సొంత లేదా వారి తల్లిదండ్రుల మొబైల్స్ కలిగి ఉన్నప్పటికీ మోడల్‌ను కొనసాగించడం అంత సులభం కాదని ఆ బందం గ్రహించింది.
సర్వే చేశాము
''వారంలో ఏ రోజు, ఏ సమయం అందరికీ వీలుపడుతుందో అడిగే సర్వేను మేము రూపొందించాము. వారాంతాల్లో ఏకగ్రీవంగా అనుకూలంగా ఉన్నాయి. నెల ప్రారంభంలో హాజరు ఎక్కువగా ఉండేలా ఇది జరిగేది. కానీ నెలాఖరు నాటికి డేటా ప్యాక్‌లు అయిపోతున్నాయి. పిల్లలు సెషన్లో చేరలేకపోయారు. అప్పుడు మేము రికార్డ్ చేసిన సెషన్లను ప్రారంభించాము'' అని ప్రియాల్ చెప్పింది. ప్రస్తుతం ఫౌండేషన్ కోసం ప్రో బోనో ప్రాతిపదికన దాదాపు 50 మంది అథ్లెట్లు, వాలంటీర్లు పనిచేస్తున్నారు.
క్రీడా విద్య వర్క్‌షాప్‌లు
2021 నుండి ఫౌండేషన్ వారి పాఠశాలల్లో పిల్లలతో ఆఫ్‌లైన్‌లో పనిచేయడానికి తిరిగి వెళ్లింది. స్క్రీన్ డిపెండెన్సీ పెరగడాన్ని గమనించిన ప్రియాల్ వారి ఇన్పుట్లను పంచుకోవడానికి సైకాలజిస్ట్, ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించింది. ''ఇప్పుడు క్లాసులు ఆఫ్‌లైన్‌లో ప్రారంభమయ్యాయి. మేము వీలైనన్ని ఎక్కువ కార్యకలాపాలను నిర్వహించాలనుకుంటున్నాము. ఈ పిల్లలు ఇప్పటికే రెండేండ్లుగా ఇంట్లోనే ఉన్నారు. వారం రోజులలో మా వాలంటీర్లు పాఠశాలలకు వెళ్లి క్రీడా శిక్షణ లేదా క్రీడా విద్య వర్క్‌షాప్‌లు తీసుకుంటారు. మేము ప్రత్యేకంగా ఏ పాఠశాలలపై దష్టి పెట్టాలనుకుంటున్నాము అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
ఈక్వాలిటీ మిత్రదేశాలలో ఒకరిగా
కొన్ని పాఠశాలలు విద్యార్థులను ఎంపిక చేసుకుంటాయి. పలానా బందం ఫుట్‌బాల్‌పై ఆసక్తి కలిగి ఉందని మాకు తెలియజేస్తుంది. మేము వారి కోసం ఫుట్‌బాల్ లేదా జిమ్నాస్టిక్స్ సెషన్‌ను ప్రారంభిస్తాము'' అంటూ చెబుతుంది ప్రియాల్. ఆమె ప్రస్తుతం కన్సల్టింగ్ డొమైన్లో చార్టర్డ్ అకౌంట్‌గా పనిచేస్తుంది. మాజీ క్రీడాకారిణిగా ఉన్న ఆమె సామాజిక వ్యవస్థాపకురాలిగా మారి చాలా బిజీ అయిపోయింది. నాలుగు నెలల కిందట ప్రియాల్ను యుఎన్ ఉమెన్ ఇండియాతో ఎనిమిది జనరేషన్ ఈక్వాలిటీ మిత్రదేశాలలో ఒకరిగా ఆహ్వానించారు. జనరేషన్ ఈక్వాలిటీ క్యాంపెయిన్ సమాన వేతనం, చెల్లించని సంరక్షణ, ఇంటి పనికి సమాన భాగస్వామ్యం, లైంగిక వేధింపులు, మహిళలు, బాలికలపై అన్ని రకాల హింసలకు ముగింపు పలకడం, వారి అవసరాలకు ప్రతిస్పందించే ఆరోగ్య సంరక్షణ సేవలు, రాజకీయ జీవితం, నిర్ణయం తీసుకోవడంలో సమాన భాగస్వామ్యం కోరుతుంది.
- సలీమ