Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జుట్టు ఆరోగ్యంగా ఎదగాలంటే ముందు కుదుళ్లు దృఢంగా ఉండాలి. అందుకోసం అప్పుడప్పుడూ కుదుళ్లను మృదువుగా మర్దన చేయడం అవసరం అంటున్నారు నిపుణులు. రెండు టీస్పూన్ల ఆలివ్ నూనెలో, రెండు గుడ్లలోని పచ్చసొనలు, కొద్దిగా కలబంద గుజ్జు వేసి మదువైన మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీన్ని కుదుళ్లకు పట్టించి పావుగంట మర్దన చేయాలి. పడుకునే ముందు జుట్టును పైకి ముడేసుకొని షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి. ఇక మరుసటి రోజు ఉదయం గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమం జుట్టుకు తేమనందించి మదువుగా మార్చుతుంది.