Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీటి పూల మొక్కను, పంటలకు నష్టాన్ని కలిగించే కలుపును కళా వస్తువులుగా మారుస్తున్నారు. మంచినీటి వనరులలో వేగంగా పెరిగే కలుపు వలన తరచుగా సరసులు, నదులు మూసుకుపోతున్నాయి. దాంతో అందులోని నీరు నిరుపయోగమవుతుంది. గత 10 సంవత్సరాలుగా, కలుపు పుష్కలంగా ఉన్న ఈశాన్య ప్రాంతం కొత్తదనాన్ని సంతరించుకుంది. అస్సాంకు చెందిన ఇద్దరు ఔత్సాహిక మహిళలే దాని రూపురేఖలు మార్చేస్తున్నారు. వారే పౌల్మీ గొగోరు, డాక్టర్ తనుశ్రీ దేవి. అసలు వారికి ఈ ఆలోచన ఎలా వచ్చిందో, దాన్ని వ్యాపారంగా మలిచి ఆర్థిక స్థిరత్వాన్ని ఎలా పొందారో తెలుసుకుందాం.
2021లో గౌహతికి చెందిన పాల్మీ గొగోయ్, డాక్టర్ తనుశ్రీ దేవి వోవెన్ టేల్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్‌ను ప్రారంభించారు. ఇది వేగంగా పెరుగుతున్న నీటి కలుపు మొక్కలైన వాటర్ హైసింత్ని ఉపయోగించి ఇంటి అలంకరణ ఉత్పత్తులను తయారు చేసే సంస్థ. వాటర్ హైసింత్తో తయారు చేయబడిన స్థిరమైన, పర్యావరణ అనుకూల ఉత్పత్తులను అందించే బ్రాండ్‌గా వోవెన్ టేల్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ గుర్తింపు పొందింది.
పరిస్థితి అనుకూలంగా లేదు
సంస్థ ప్రారంభించిన తర్వాత వారు మరిన్ని అన్వేషించేందుకు సిద్ధమయ్యారు. మార్చి 2020లో లాక్డౌన్ మొదటి దశలోనే ఇదంతా ప్రారంభమైందని పాల్మీ చెప్పారు. ''నేను, తనుశ్రీ ఈశాన్య ప్రాంతంలోని చేనేత హస్తకళ డిజైన్లను ఉపయోగించి గృహాలంకరణ, యుటిలిటీ ఉత్పత్తుల వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నాము. అయితే కరోనాలో సమయంలో పరిస్థితి అనుకూలంగా లేదని మాకు అనిపించింది. అయితే మేము మా పరిశోధనను కొనసాగించాము. స్థానిక కళాకారులు, క్రాఫ్ట్ సెంటర్లతో కనెక్ట్ అవుతున్నప్పుడు వాటర్ హైసింత్ గురించి తెలుసుకున్నాము'' అంటున్నారు పాల్మీ.
మొక్కలను ముడి పదార్థాలుగా
ఆగష్టు 2020లో వారి స్టార్టప్ ఆలోచనను IIMB-NRSCEL ద్వారా ఉమెన్ స్టార్టప్ ప్రోగ్రామ్ 3.0 కోసం ఎంపిక చేశారు. NRSCEL మార్గదర్శకుల సహాయంతో ఇద్దరు మహిళా పారిశ్రామికవేత్తలు వారి ఆలోచనపై పనిచేశారు. చివరకు గృహాలంకరణ, యుటిలిటీ ఉత్పత్తులను తయారు చేయడానికి మొక్కలను ముడి పదార్థంగా ఉపయోగించడంపై దృష్టి పెట్టారు. దీనికి ముందు పాల్మీ ఈవెంట్ మేనేజ్మెంట్ స్పేస్‌లో 14 సంవత్సరాలు పనిచేశారు. తనుశ్రీ వృత్తిరీత్యా డెంటిస్ట్. గౌహతికి చెందిన వారిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. పాల్మీ వ్యాపారంలో హెచ్చు తగ్గులలో మొదటి అనుభవం ఉన్న కుటుంబంలో పెరిగారు. వారికి నగరంలో ఒక రెస్టారెంట్ ఉంది. ఆమె తండ్రి మరణం తర్వాత తల్లి దానిని ఒంటరిగా నడిపింది. ఆమె కూడా ఒక రెస్టారెంట్‌ను తెరిచింది. అయితే అది మహమ్మారి కారణంగా మూసివేయవలసి వచ్చింది.
ప్రత్యేకమైన వినూత్నమైన
ఏదైనా వినూత్నంగా చేయాలని వారు అనుకున్నారు. అందుకే నీటి హైసింత్‌ను ముడి పదార్థంగా ఉపయోగించామని పాల్మీ చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలు వెదురు, చెరకు నుండి తయారైన ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందాయి. ఇప్పటికే రద్దీగా ఉన్న మార్కెట్లోకి ప్రవేశించడం సాధ్యమయ్యే ఆలోచనగా వారికి అనిపించలేదు. అంతేకాకుండా కొత్త ముడిసరుకుపై ప్రభుత్వానికి ఉన్న ఆసక్తి దీర్ఘకాలంలో మద్దతునిస్తుంది. అలాగే ఈ ఉత్పత్తులు పర్యావరణ అనుకూలమైనవి, ఎక్కువ కాలం మన్నేవి. ఇవి దేశవ్యాప్తంగా, విదేశాలలో ఉన్న పెద్ద కస్టమర్ బేస్‌ను ఆకర్షిస్తాయి. గౌహతి నుండి 120 కి.మీ దూరంలో ఉన్న నాగావ్ పట్టణంలోని రెండు మహిళా ప్రాబల్య కళాకారుల క్లస్టర్లకు వ్యాపారవేత్తలు చేరుకున్నారు.
మహిళా కళాకారులకు శిక్షణ
''ఈ ప్రాంతంలో పుష్కలంగా వాటర్ హైసింత్ ఉంది. అలాగే మేము దాని నుండి తయారు చేసిన సాధారణ బుట్టలను కాకుండా కొత్త ఉత్పత్తులను చూస్తున్నాము. మేము ఈ మొదటి తరం కళాకారులకు ప్రభుత్వం నుండి ఇప్పటికే అందుతున్న వాటితో పాటు వారికి మద్దతు ఇవ్వాలని కోరుకున్నాము'' అని పాల్మీ చెప్పారు. ''ప్రతి క్లస్టర్లో దాదాపు 60 మంది మహిళా కళాకారులు వాటర్ హైసింత్తో పని చేయడంలో శిక్షణ పొందారు. ముడి పదార్థం సేకరించిన తర్వాత కాండం మాత్రమే ఎండబెట్టి ఉపయోగిస్తాము. వియత్నాం, థారులాండ్ల మాదిరిగానే విదేశాల్లో ప్రసిద్ధి చెందిన కొత్త డిజైన్లతో కళాకారులు సహాయం కోరుతున్నారు. మేము కొత్త డిజైన్లను తయారు చేయడానికి మా అంతర్గత డిజైనర్‌ని నియమించుకున్నాం. ఉత్పత్తులను ప్రోటోటైప్ చేయడం ప్రారంభించాము'' అని ఆమె జతచేస్తుంది.
కొంత సమయం తీసుకున్నారు
ప్రారంభంలో వ్యవస్థాపకులు డైరెక్ట్ రిటైల్‌పై దృష్టి పెట్టాలని భావించారు. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీని ప్రారంభించారు. అయితే రెండవ కోవిడ్-19 సమయంలో వ్యాపారం దెబ్బతింది. వాటర్ హైసింత్ వంటి ప్రత్యేకమైన ముడి పదార్థాల ఆలోచనను అర్థం చేసుకోవడానికి ప్రజలు కొంత సమయం తీసుకుంటారని పాల్మీ అభిప్రాయపడ్డారు. లింక్డ్‌ఇన్‌ని ఉపయోగించి క్లయింట్లను, ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలను చేరుకోవడానికి బిజినెస్-టు-బిజినెస్ మోడల్‌ను ప్రయత్నించాలని స్నేహితులు నిర్ణయించుకున్నారు. అతి తక్కువ కాలంలోనే వారు గిఫ్ట్ హాంపర్ల కోసం బల్క్ ఆర్డర్లను పొందడం ప్రారంభించారు.
చేతితో తయారు చేయబడ్డాయి
తమ ఉత్పత్తులను విదేశాల్లో విక్రయించడంలో సహాయపడటానికి పానిపట్‌లోని ఎగుమతి సంస్థతో చర్చలు కూడా జరుగుతున్నాయి. ''మా ఆలోచన వారు పట్టుకుంటానని మేము కచ్చితంగా అనుకుంటున్నాము. మా ఉత్పత్తులు 100 శాతం స్థిరంగా ఉంటాయి. ఇవి యంత్రాల ఉపయోగం లేకుండా చేతితో తయారు చేయబడ్డాయి'' ఆమె చెప్పింది.
మొదట్లో గందరగోళ పడ్డాము
ఈ వస్తువుల ధర రూ. 1,500 నుండి ఉంటుంది. వోవెన్ టేల్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజీలలో అందుబాటులో ఉన్నాయి. త్వరలో దాని సొంత వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ''NRCELలోని మా మెంటార్లు వ్యాపారాన్ని ఈ స్థితికి మార్చడంలో సహాయపడ్డారు. మొదట్లో మేము మా ఆలోచనలలో చాలా గందరగోళంగా ఉన్నాము. సెషన్లో చేరిన తర్వాత వారు మా ఆలోచనలను క్రమబద్ధీకరించడంలో, ఒక ప్రణాళికను రూపొందించడంలో, ఉత్పత్తుల కోసం మార్కెట్‌ను కనుగొనడంలో మాకు సహాయం చేసారు. మా తోటివారి నుండి కూడా మాకు చాలా మద్దతు లభించింది'' ఆమె చెప్పింది.
దేశాన్ని ప్రపంచపటంలో ఉంచాలి
తనుశ్రీ డిజైన్, ఆవిష్కరణలను చూసుకుంటుంది. బోహేమియన్ స్టైల్స్‌పై దృష్టి పెడుతుంది. పరిశోధన, ఆవిష్కరణలలో కూడా ఉంది. పాల్మీ చేతివృత్తుల వారితో నేరుగా పని చేస్తుంది. ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి బాధ్యత వహిస్తుంది. ''ప్రస్తుతం థాయిలాండ్, వియత్నాం ఆధిపత్యంలో ఉన్న వాటర్ హైసింత్ ఉత్పత్తుల కోసం భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఉంచడం మా ప్రణాళిక. హస్తకళాకారులకు మరింత శిక్షణ అందించడానికి మేము ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి ప్రయత్నిస్తున్నాము'' అని ఆమె తన మాటలను పూర్తి చేసింది.