Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిడ్డు చర్మతత్వం గల వారికి ఎన్నిసార్లు ముఖం కడుక్కున్నా మళ్లీ కాసేపటి తర్వాత జిడ్డుగా తయారవుతుంది. ఇలాంటి సమస్యతో బాధపడేవారు.. నాలుగు చెంచాల శెనగపిండిలో ఒక చెంచా రోజ్‌వాటర్, రెండు చెంచాల తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిపోయే వరకు అలాగే ఉంచుకుని తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చు.