Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రసవమైన వెంటనే తల్లికి తన చిన్నారి పాలనే అతి ముఖ్యం. అయితే పాపాయి సంరక్షణతోపాటు తన ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకుంటేనే ఇరువురూ సంతోషంగా ఉండొచ్చు అంటున్నారు నిపుణులు. పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుంటేనే తల్లిపాల ఉత్పత్తి బాగుంటుందని సూచిస్తున్నారు.
తల్లైన తర్వాత డైటింగ్, కేలరీలు పెరుగుతాయనే ఆలోచన పక్కన పెట్టాలంటున్నారు నిపుణులు. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటూ, పోషకాహారాన్ని తీసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు. గింజధాన్యాలు, ప్రొటీన్లుండే మాంసాహారం, తాజా కూరగాయలు, ముదురువర్ణం పండ్లు వంటివి ప్రతిరోజు ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడాలి.
చిన్నారి సంరక్షణలో పడి తమ గురించి ఆలోచించే సమయం ఉండకపోవడం, రాత్రుళ్లు నిద్ర తక్కువకావడం వంటివన్నీ తల్లి ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయి. చిన్నారికి సరిపోయినన్ని పాలు ఉత్పత్తికాకపోవచ్చు. అలాగే పాలిచ్చే సమయంలో ఎక్కువగా దాహం వేస్తుంటుంది. ఇటువంటప్పుడు పండ్లరసాలు, మంచినీళ్లు, పాలు వంటివి తరచూ తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది.