Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సదాఫ్ సయ్యద్... 2015లో కాశ్మీరీ హస్తకళలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు తన సొంత బ్రాండ్‌ను ప్రారంభించారు. అది గత సంవత్సరంలో 70 శాతం వ్యాపార వృద్ధిని సాధించింది. అంతేకాదు హస్తకళాకారులను బలోపేతం చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే హ్యాండ్స్ ఆఫ్ గోల్డ్‌ను కాశ్మీర్‌కు పర్యాయపదంగా మార్చడానికి కృషి చేస్తున్న ఆమెకు అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందో మనమూ తెలుసుకుందాం...
కాశ్మీర్లో పుట్టిన సదాఫ్ కాశ్మీరీ హస్తకళల మధ్య పెరిగారు. అయితే ఒకసారి ఆమె తనకు అవసరమైన ఓ హస్తకళ ఉత్పత్తి కోసం షాపింగ్ చేస్తున్నప్పుడు ఎంత వెదికినా ఆ వస్తువులు దొరకలేదు. ''నా భర్త కఫ్లింక్లను భద్రపరచడానికి సరైన పేపియర్ మాచేని కనుగొనాలనే తపనతో నా వ్యాపార ప్రయాణం ప్రారంభమైంది. కానీ నా అవసరాలకు సరిపోయేది నేను కనుగొనలేకపోయాను. నాకు కంపార్ట్మెంట్లు, మంచి డిజైన్, రంగుతో కూడిన ఉత్పత్తి అవసరం'' అని సదాఫ్ అన్నారు.
హ్యాండ్స్ ఆఫ్ గోల్డ్
2015లో ఈ ప్రయత్నాన్ని సదాఫ్ తన చేతుల్లోకి తీసుకునేలా చేసింది. ఆమె దీనికోసం రూ. 50,000 పెట్టుబడి పెట్టింది. కాశ్మీర్ ఆధారిత హ్యాండ్స్ ఆఫ్ గోల్డ్‌ను ప్రారంభించింది. ఇది ఇప్పుడు ప్రీమిక్స్‌లు, శాలువాలు, స్టోల్స్, స్కార్ఫ్‌లు, పేపియర్ మాచే యుటిలిటీ వస్తువులతో పాటు మరెన్నో సహా కాశ్మీరీ ఆర్టిసానల్ ఉత్పత్తులలో డీల్ చేస్తోంది. బ్రాండ్ మాతృ సంస్థ FIL ఇండిస్టీస్ లిమిటెడ్ కింద నమోదు చేయబడింది.
పరిజ్ఞానం లేదు
కాశ్మీర్ నుండి ప్రపంచం వరకు సదాఫ్ తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఆమెకు వ్యాపార పరిజ్ఞానం ఏమీ లేదు. ఆమె ఎంబీఏ పూర్తి చేసి ఢిల్లీలో రెండు ఉద్యోగాలు చేసింది. కానీ ఆర్టిసానల్ ఉత్పత్తులపై ఆమెకున్న ప్రేమ ఆమెను వ్యవస్థాపక మార్గంలో నడవడానికి దారితీసింది. ఆమె తన వ్యాపార ప్రతిపాదనను ముందుకు తెచ్చే ముందు ఎంత మంది కళాకారులు తనను ఎగతాళి చేశారో గుర్తుచేసుకుంది. కానీ ఆమె పట్టుదలతో కళాకారులతో బంధాన్ని ఏర్పరచుకుంది. హ్యాండ్స్ ఆఫ్ గోల్డ్ విజయానికి ఆమె క్రెడిట్ ఇచ్చింది.
కొంత సమయం పట్టింది
''హస్తకళాకారులను సందర్శించిన అతి కొద్ది మంది మహిళల జాబితాలో నేను కూడా చేశాను. కాశ్మీర్లో ఇది అంత సాధారణం కాదు. కళాకారుల నమ్మకాన్ని సంపాదించడానికి, కళను అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. ఈ హస్తకళాకారులు తాము పెద్ద వ్యాపారుల చేతిలో మోసపోయామని భావిస్తారు. అందుకే నేను ఎలాంటి వ్యాపారాన్ని నడపాలనుకుంటున్నానో దాని ద్వారా వారికి, వారి కళకు ఎలాంటి న్యాయం చేయబోతున్నానో వారికి అర్థం చేయించడానికి నాకు సమయం పట్టింది.
విక్రయించడం తెలియదు
చేతివృత్తులవారిని ఒప్పించిన తర్వాత సదాఫ్ వెనుదిరిగి చూసుకోలేదు. ఆమె పేపర్ మాచే ఉత్పత్తుల శ్రేణితో ప్రారంభించింది. కానీ వాటిని విక్రయించే ప్లాట్‌ఫారమ్ తెలియదు. ''నేను మొదట్లో స్నేహితులు, బంధువులకు అమ్మడం ప్రారంభించాను. ఆ తర్వాత ఒకరి ద్వారా వారికి ఇది వ్యాపించింది. ఒక సంవత్సరంలో సుమారు రూ. 6-7 లక్షల అమ్మకాలు చేసాను'' అని ఆమె చెప్పారు. 2018లో సదాఫ్ కవల కుమార్తెలకు జన్మనిచ్చారు. వ్యాపారాన్ని నిర్వహించడం, ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం అంత సులభం కాదు. అందుకే వ్యాపార కార్యకలాపాలను చూసుకోవడానికి ఆమె ఒక మేనేజర్ని నియమించుకుంది.
మరిన్ని ఉత్పత్తులను
హ్యాండ్స్ ఆఫ్ గోల్డ్ లీనియర్ మోడ్‌లో పనిచేస్తోందని, 2015 నుండి 2019 వరకు నిజంగా స్కేల్ అప్ కాలేదని ఆమె చెప్పింది. ''నేను భారతదేశంలోని ప్రతి ఇంటికి కాశ్మీరీ కళను ఎందుకు తీసుకెళ్లలేను అనే ఆలోచనతో నా ప్రయత్నం మొదలుపెట్టాను'' ఆమె చెప్పారు. సదాఫ్ వ్యాపారాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నారు. కుంకుమపువ్వు, కహ్వా, తేనె, బాదం నూనె మొదలైన వాటితో సహా కాశ్మీర్‌తో అనుబంధించబడిన మరిన్ని ఉత్పత్తులను పరిచయం చేశారు. ''ఇది ఒక అడుగు ముందుకు వేయడానికి ఉపయోగపడింది'' అంటున్నారు ఆమె. అదే సంవత్సరంలో సదాఫ్ జమ్మూ, కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ఉన్న పట్నిటాప్‌లో హ్యాండ్స్ ఆఫ్ గోల్డ్ మొదటి దుకాణాన్ని కూడా ప్రారంభించారు. పట్నిటాప్ ఒక పర్యాటక ప్రదేశం. దుకాణానికి చాలా మంది కొత్త సందర్శకులను తీసుకువచ్చేందు ఇది ఒక మంచి ప్రయత్నం.
అసమానతలను అధిగమించడం
అన్ని ఇతర వ్యాపారాల మాదిరిగానే మహమ్మారి చిన్న వ్యాపారస్తులకు అనేక సవాళ్లను మిగిల్చింది. కానీ సదాఫ్ బ్రాండ్‌కు ఆన్లైన్ ఉనికిని నిర్మించడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకున్నారు. ఆమె వెంటనే వెబ్‌సైట్‌ను సృష్టించారు. బ్రాండ్ సోషల్ మీడియా ఉనికిని బలోపేతం చేసింది. మరిన్ని ూఖఖ లను తీసుకురావడంలో కూడా పని చేసింది. ప్రస్తుతం హ్యాండ్స్ ఆఫ్ గోల్డ్ తినడానికి అవసరమైన అన్ని ఉత్పత్తులను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది. అలాగే అన్ని ఇతర ఉత్పత్తులు ూa్అఱ్శీజూ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. స్టోర్ ఒక్కరోజులో రూ. 25,000-రూ. 30,000 మధ్య విక్రయాలు జరుపుతుందని, ప్రీమిక్స్‌లు బెస్ట్ సెల్లర్‌గా ఉన్నాయని సదాఫ్ పేర్కొన్నారు.
70శాతం వృద్ధి
వ్యాపార అభివృద్ధి, లాజిస్టిక్స్, కంటెంట్ క్రియేషన్, మార్కెటింగ్‌లో సదాఫ్‌కు సహాయపడే ఐదుగురు ఉద్యోగులు కంపెనీలో ఉన్నారు. కొనుగోలు చేసే వారి సంఖ్య పెరగడం, ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి కారణంగా గత ఏడాదిలో వ్యాపారం 70శాతం వృద్ధిని సాధించిందని సదాఫ్ జతచేస్తున్నారు. కాశ్మీర్ అభివృద్ధి చెందుతున్న వ్యాపార కేంద్రంగా ఉంది. అయితే అనిశ్చితి కారణంగా రాష్ట్రంలో వ్యాపారం చేయడం చాలా సవాళ్లతో కూడుకున్నదని సదాఫ్ చెప్పారు.
అతిపెద్ద సవాళ్లు
''ఆకస్మిక వాతావరణ మార్పుల నుండి ఇంటర్నెట్ షట్డౌన్లు, పవర్ కట్ల వరకు చాలా రకాల సమస్యలు ఉన్నాయి. దీని వల్ల ఉత్పత్తులను అనుకున్న సమయంలో ఉత్పత్తి చేయడం కష్టంగా మారుతుంది. ఇది అతిపెద్ద సవాళ్లలో ఒకటి'' అని ఆమె చెప్పారు. దీనిని అధిగమించడానికి హ్యాండ్స్ ఆఫ్ గోల్డ్ గిడ్డంగిని ఎప్పుడూ అధిక నిల్వతో ఉంచుతుంది. తద్వారా కస్టమర్లు ఇబ్బంది పడకుండా ఉంటారు. వారి ఉత్పత్తులు ఢిల్లీ నుండి ఆన్లైన్ ఆర్డర్లు రవాణా చేయబడతాయి. సదాఫ్‌కు ఎదురయ్యే మరో సవాలు పోటీ. అయితే ఇది ఇతర ఆర్టిసానల్ బ్రాండ్ల నుండి కాదు. హస్తకళలుగా విక్రయించే యంత్రంతో తయారు చేసిన కళ నుండి.
ప్రతికూలంగా దెబ్బతీస్తారు
''యంత్రంతో తయారు చేసిన దానికి, చేతితో తయారు చేసిన ఉత్పత్తికి మధ్య ధరలో భారీ వ్యత్యాసం ఉంటుంది. అయితే ప్రజలకు ఇది తెలియదు. ఇలాంటి వారు మార్కెట్‌ను ప్రతికూలంగా దెబ్బతీస్తారు'' అని సదాఫ్ చెప్పారు. కాన్జ్ అండ్ ముహుల్, కాశ్మీర్ బాక్స్, అదే డొమైన్లో పనిచేస్తున్న ఇతర బ్రాండ్లతో హ్యాండ్స్ ఆఫ్ గోల్డ్ పోటీపడుతుంది. అనేక బ్రాండ్లు చేతివృత్తుల ఉత్పత్తులను అందజేస్తున్నాయని, కళాకారులకు సహాయం చేస్తున్నాయని సదాఫ్ చెప్పారు. అయితే హ్యాండ్స్ ఆఫ్ గోల్డ్ కళ అంతరించిపోకుండా హస్తకళాకారులను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
దేశంలోని ప్రతి మూలకు
సదాఫ్ ప్రస్తుతం వందలాది మంది కళాకారులతో కలిసి పని చేస్తున్నారు. అలాగే కాశ్మీరీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌ను దేశంలోని ప్రతి మూలకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. త్వరలో అంతర్జాతీయ మార్కెట్లను కూడా లక్ష్యంగా చేసుకోవాలని ఆమె యోచిస్తున్నారు. ''నేను హ్యాండ్స్ ఆఫ్ గోల్డ్‌ని కాశ్మీర్‌కి పర్యాయపదంగా మార్చాలనుకుంటున్నాను'' అంటూ సదాఫ్ ముగించారు.