Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దీపా చిన్నతనం నుండి ఏ క్రీడ ఆడే అవకాశం దొరికితే ఆ క్రీడ ఆడుతూ పెరిగింది. ముఖ్యంగా ఆమెకు బైక్ నడపడమంటే ప్యాషన్. అయితే 1999లో ఆమె వెన్నుపాముకు వచ్చిన కణితిని తొలగించడానికి చేసిన శస్త్రచికిత్స ఆమె జీవితాన్నే మార్చేసింది. అప్పటి నుండి తన వీల్ చైర్ జీవితాన్ని ప్రారంభించింది. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపిన ఆమెకు ఇది అత్యంత కష్టమైన పరిస్థితి.
రెస్టారెంట్ ప్రారంభించింది
ఆమె బైక్‌లను నడపడం మానేసింది. తన భర్త బిక్రమ్ ఆర్మీలో పని చేస్తున్నపుడు పిల్లల బాధ్యత పూర్తిగా ఆమె చూసుకోవల్సి వచ్చింది. అంతే కాదు తన బాధ మర్చిపోవడానికి బిజీగా ఉండేందుకు 'డీస్ ప్లేట్' అనే రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ఆమెకు తెలియకుండానే విపరీతమైన ఆర్డర్లు వచ్చేవి. దాంతో ఆమె జీవన విధానం మారిపోయింది.
'నెవర్ గివ్ అప్' మంత్రం
కానీ రెస్టారెంట్ అనేది ఏ విధంగానూ ఆమెకు సరిపోలేదు. దీప తన చురుకైన జీవితాన్ని కోల్పోయింది. ఇంకేదో చేయాలనే తపన ఆమెను నిలవనీయలేదు. ఢిల్లీలో శక్తి శిక్షణ తీసుకుంది. తర్వాత ట్రైల్బ్లేజర్ స్విమ్మింగ్‌లో పాల్గొని బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పదో స్థానంలో నిలిచింది. కానీ వేడినీటి స్విమ్మింగ్ పూల్స్ లేకపోవడం క్రీడలలో అత్యంత అద్భుతమైన ప్రదర్శన చూపిన మహిళగా గుర్తింపు పొందినప్పటికీ దానికి దూరం కావల్సి వచ్చింది. ఆ తర్వాత యమునా నదిని దాటి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్రవేశించింది. ఒక ఆర్మీ బోట్ ఆమె వెంట ఉండగా, మల్హర్ బోట్‌మెన్‌లు ప్రతిచోటా నిలబెట్టడంతో ఆమె నదిని ఈదుకుంటూ తన రికార్డును పొందింది. తర్వాత ఆమె తన స్విమ్మింగ్ కెరీర్‌కు వీడ్కోలు పలికింది.
అందరికీ కృతజ్ఞతలు
దీపకు శస్త్రచికిత్స చేసి ఇప్పటికి 21 ఏండ్లు పూర్తయ్యాయి. ఆనాటి తన కష్టమైన జీవితాన్ని, పడిన బాధను పంచుకోవడానికి ట్విట్టర్లోకి వెళ్లింది. ''నా 'విల్ చైర్'లో 21 ఏండ్ల అద్భుతమైన సంవత్స రాలను జరుపు కుంటున్నాను. ఈ రోజు నేను పక్షవాతానికి గురైన శరీరం (రఱష) కింద ఛాతీలో పునర్జన్మ పొందాను. కష్టసమయంలో సహాయం చేసిన, మద్దతు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము'' అని ఆమె ట్విట్ చేసింది.
పతకాలు పుష్కలం
జావెలిన్ త్రోలతో దీపా మళ్లీ క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. 2010లో ఢిల్లీలో జరుగుతున్న పారా-కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనాలని ఆమె నిర్ణయించుకచుంది. అయితే అక్కడ ఆమె విజయం సాధించలేకపోయింది. రెండు నెలల తర్వాత గ్వాంగ్జౌలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో కాంస్య పతకాన్ని పొందేందుకు తన అనుభవాన్ని ఉపయోగించుకుంది. ఆ తర్వాత ఆమె అనేక రికార్డులను సృష్టించింది. భారత రాష్ట్రపతిచే అర్జున అవార్డును కూడా అందుకుంది.
రియోలో ఆడాలని
కానీ దీపకు అది కూడా సరిపోలేదు. ఆమె రియో 2016 పారాలింపిక్స్‌లో ఆడాలని కలలు కన్నది. దాని కోసం రాత్రీ పగలనక శిక్షణ పొందింది. అయితే జావెలిన్ స్థానంలో షాట్‌పుట్‌ను ప్రవేశపెట్టినట్టు ప్రకటించడంతో ఆమె మూడేండ్ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరైపోయింది. ఇది ఆమె హృదయాన్ని బద్దలుకొట్టింది. కానీ ఆమె కలను సాకారం చేసుకోకుండా ఈ మార్పు ఆమెను ఆపలేదు.
డైపర్ మార్చకుండా శిక్షణ
దీపా మొదటి నుండి షాట్ పుట్ నేర్చుకుంది. ఇది ప్రారంభంలో చాలా కష్టమైంది. దీనికోసం ఆమె తన ప్రేగు కదలికను నియంత్రించవలసి వచ్చింది. గంటల తరబడి డైపర్ మార్చకుండా సాధన చేయవలసి వచ్చింది. ఆ సమయంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ డాక్టర్, ట్రైనర్, నర్సు, ఫిజియో ఇలా అందరూర ఆమెకు సహకరించారు. దీపా తన ట్రయల్స్‌ను క్లియర్ చేసి 46 ఏండ్ల వయసులో షాట్‌పుట్ ఖీ53 విభాగంలో తొలి భారతీయ మహిళా రజత పతక విజేతగా చరిత్ర సృష్టించింది.
గొప్ప అనుభూతి
''ప్రపంచంలోని గొప్ప క్రీడా దశలో విజయం సాధించడం, పతకం గెలిచిన మొట్టమొదటి భారతీయ మహిళ అని గుర్తింపు తెచ్చుకోవడం కంటే గొప్ప అనుభూతి మరొకటి లేదు. ఇప్పటికి నా కల నెరవేరింది'' అంటూ ఆమె బోరియా మజుందార్, నలిన్ మెహతా డ్రీమ్స్ ఆఫ్ ఎ బిలియన్: ఇండియా అండ్ ది ఒలింపిక్ గేమ్స్‌లో గుర్తుచేసుకుంది. దీపా తన పదవీకాలంలో ఎన్నో అవార్డులు, పతకాలు గెలుచుకుంది. కచ్చితంగా చెప్పాలంటే 23 అంతర్జాతీయ పతకాలు, 58 జాతీయ పతకాలు, 2012లో పద్మశ్రీ, 2019లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్నతో సత్కరించబడింది.