Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గరుకుగా, గడ్డిలా మారిన జుట్టును రిపేర్ చేయడానికి కండిషనర్ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఇందుకోసం బయట దొరికేవి కాకుండా మన వంటింట్లో ఉండే కొబ్బరి పాలను ఉపయోగిస్తే తక్షణ ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. కొన్ని కొబ్బరి పాలలో కొద్దిగా ఆర్గాన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం షాంపూ చేసుకుంటే జుట్టు మృదువుగా, సిల్కీగా మారడం గమనించచ్చు.