Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తరచూ అతిగా తినడం, వేపుళ్లకు ప్రాముఖ్యతనివ్వడంతోపాటు నీటిని తక్కువగా తీసుకోవడంవల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. ఎక్కువసార్లు కాఫీ, టీ తాగడం, పగటిపూట నిద్రపోవడం, అతి చల్లని, ఉడికించని ఆహారాన్ని తీసుకోవడం వంటివి ఈ సమస్యను దరిచేస్తాయి.
ఆహారాన్ని బాగా నమిలి తినకపోతే జీర్ణవ్యవస్థ సామర్థ్యం తగ్గుతుంది. దీంతో వ్యర్థాలు బయటకు వెళ్లకుండా శరీరంలో పేరుకుపోతాయి. ఇవి చర్మాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అధికబరువుకు కారణమవుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ముందుగా ప్రాసెస్డ్ ఫుడ్, నూనెపదార్థాలకు దూరంగా ఉండాలి. రోజుకి ఏడెనిమిది గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగడం అలవరుచుకోవాలి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, చర్మాన్ని తేమగా మారుస్తుంది.
వంటలో.. మసాలా దినుసులను నువ్వులనూనెలో దోరగా వేయించిన తర్వాతే వంటలో వినియోగించాలి. పసుపు, ధనియాలపొడి, అల్లం వంటివి వంటల్లో విరివిగా వాడటంవల్ల జీవక్రియల వేగం పెరుగుతుంది.