Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాకాలంలో వాతావరణంలో తేమ అధికంగా ఉంటుంది. దీనివల్ల అనేక జుట్టు సమస్యలు తలెత్తుతాయి. వర్షాకాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా వేధిస్తుంది. అధిక తేమ కారణంగా తల చర్మం జిడ్డుగా, జిగటగా మారుతుంది. అప్పుడు కుదుళ్లు బాగా బలహీనంగా తయారై ఊడిపోతాయి. ఈ జుట్టు రాలే సమస్యకు కొన్ని ఇంటి చిట్కాలతో చెక్ పెట్టొచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హాట్ ఆయిల్ మసాజ్: జుట్టు బలంగా ఉండాలంటే తరచుగా జుట్టుకి ఆయిల్ రాయాలని నిపుణులు చెబుతుంటారు. ఆయిల్ మసాజ్ చేస్తే ఇంకా ఎక్కువ ఫలితాలు కనిపిస్తాయి. ఆయిల్‌ను కాస్త వేడి చేసి మాడుకు మసాజ్ చేస్తే రక్తప్రసరణ మరింత మెరుగుపడుతుంది. అప్పుడు కుదుళ్లు మరింత దృఢం అవుతాయి. దీంతో జుట్టు రాలే సమస్య దూరమవుతుంది. హాట్ ఆయిల్ మసాజ్ చేయాలనుకునేవారు మొదటగా ఒక గిన్నెలో కొంచెం నూనె తీసుకోవాలి. దీన్ని వేడి చేయాలి. ఆపై గోరువెచ్చని నూనెతో మీ తలను మునివేళ్లతో చక్కగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. అలానే నూనె జుట్టు మూలాల్లోకి ప్రవేశించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
మెంతులు, సోపు గింజల హెయిర్ ప్యాక్: మెంతులు, సోపు గింజలు రెండూ కొత్త జుట్టు పెరగడానికి ఎంతో సహాయ పడతాయి. వీటితో హెయిర్ మాస్క్‌ను తయారు చేయడానికి ముందుగా వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు రాసుకోవాలి. అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.
హెర్బల్ హెయిర్ ప్యాక్: కలబంద, కరివేపాకు, ఉసిరి, మెంతులు, మందారంతో హెర్బల్ హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం పైన చెప్పిన పదార్థాలన్నీ మిక్సీలో బాగా గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత దీన్ని తలకు అప్లై చేసి 40 నిమిషాల పాటు ఉంచి ఆపై కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమం జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పీహెచ్‌ను బ్యాలెన్స్ కూడా చేస్తుంది. ప