Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిధి భాసిన్... 20 సంవత్సరాలకు పైగా అభివృద్ధి రంగంలో ఉన్నారు. నాస్కాన్ ఫౌండేషన్ సీఈఓగా ఎన్నో సామాజిక కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ సమాజానికి అసలు మహిళా నాయకత్వం అవసరమా అంటే మహిళలకు ప్రత్యేకంగా నాయకత్వ లక్షణాలు నేర్పాల్సిన అవసరం లేదని, సహజంగానే వారు నాయకులంటున్న ఆమె గురించి మరిన్ని విశేషాలు...
''నేను ఒక మహిళ కాబట్టి ఈ మాట చెప్పడం లేదు. నేను ఇతర స్త్రీలలో కూడా ఈ లక్షణాలను చూస్తున్నాను. మనం సహజ నాయకులమని నేను భావిస్తున్నాను. బహుశా మనలో జన్యుపరంగా నాయకత్వ లక్షణాలు ఉండవచ్చు లేదా ఆడపిల్లలను పెంచే విధానం కావచ్చు. మహిళలు బాధ్యత తీసుకోవడంలో ముందుంటారు'' అంటున్నారు 46 ఏండ్ల నిధి బాసిన్.
బలమైన నాయకులుగా ఎదిగారు
ఆర్మీ కుటుంబంలో పుట్టిన ఆమె తన తండ్రిని చూస్తూ పెరిగింది. ఆమె తండ్రి ఆర్మీ అనుభవజ్ఞుడు. 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం ఆమెపై తొలి ప్రభావం చూపింది. 2021లో వీషఖఱఅరవy, ూవaఅ×అ.ఉతీస్త్ర అమెరికాలోని మహిళలపై నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం మహమ్మారి సమయంలో బర్న్అవుట్, ఒత్తిడి వంటివి మహిళలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. అయినప్పటికీ వారు బలమైన నాయకులుగా ఎదిగారు. అదనపు పనిని సైతం చేపట్టారు. ''ఉద్యోగుల శ్రేయసు, వైవిధ్యం, ఈక్విటీ, చేరిక వంటి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి మహిళా నాయకులు ముందుకు వస్తున్నారు'' అని ఆ నివేదిక పేర్కొంది. అయితే దానికి తగిన విధంగా మహిళలకు గుర్తింపు వచ్చిందా లేదా అనేది వేరే విషయం.
మరింతగా చేసే అవకాశం
కోవిడ్-19 మహమ్మారి సాంకేతిక శక్తిని ప్రపంచం గ్రహించేలా చేసిందని నిధి అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక సంస్థలోని సామాజిక విభాగానికి నాయకత్వం వహించే అవకాశం మే 2021లో వచ్చినప్పుడు ఇది తనకు మరింతగా చేసే అవకాశం అని ఆమె భావించారు. ''కోవిడ్-19 సాంకేతికత పాత్రను మనం చూసేలా చేసింది. మేము చేయాల్సినంత చేయడం లేదని కూడా ఇది మాకు అర్థమయ్యేలా చేసింది. మనం దేశంలోని అట్టడుగు, అంతర్గత ప్రాంతాలకు చేరుకోవాలనుకుంటే సాంకేతికత ప్రస్తుతం బలమైన సాధనం'' అంటున్నారు.
దృఢ విశ్వాసంతో...
ఢిల్లీ యూనివర్శిటీ నుండి సోషల్ వర్క్‌లో మాస్టర్స్ పట్టా పొందిన నిధి 20 ఏండ్లకు పైగా లాభాపేక్ష లేని రంగంలో పని చేస్తున్నారు. ఆమె 15 సంవత్సరాలకు పైగా కన్సర్న్ ఇండియా ఫౌండేషన్‌తో అనుభవాన్ని పొందారు. ప్రోగ్రామ్ మేనేజర్ నుండి డిప్యూటీ సీఈఓ వరకు పనిచేశారు. మహిళా సాధికారత, పురోగతిపై దృఢ విశ్వాసం ఉన్న ఆమె ఫౌండేషన్ మూడు ముఖ్యమైన విషయాలపై జోక్యం చేసుకుంటుందన్నారు. అవి డిజిటల్ అక్షరాస్యత, నైపుణ్యంతో కూడిన ఉపాధి, మహిళా వ్యవస్థాపకత.
మహిళలకు చేరువయ్యేలా
''అది అక్షరాస్యత లేదా డిజిటల్ అక్షరాస్యత గురించి అయినా మీరు ఒక మహిళకు అధికారం ఇస్తే మొత్తం కుటుంబం సాధికారత పొందుతుందని నేను నిజంగా నమ్ముతున్నాను. గరిష్టంగా మహిళలకు చేరువయ్యేలా దృష్టి సారిస్తే మనం అనుకున్నదానికంటే చాలా వేగంగా మా ూణ+లను (స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు) సాధించగలుగుతాము. అనేక మంది కొత్త మహిళా పారిశ్రామికవేత్తలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఎలా యాక్సెస్ చేయాలో, వారి ఉత్పత్తులను మోడల్ చేయడం, ఆర్డర్లను ఎలా పొందాలో నేర్చుకుంటున్నారు'' అని ఆమె చెప్పారు.
మరింత పోటీతత్వంతో ఉన్నారు
కరోనా సమయంలో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది మహిళలు మార్కెట్ అనుసంధానం, ఆర్థిక అక్షరాస్యతలో రాణించారు. వారు తమ ఉత్పత్తులను సాంకేతిక ప్లాట్‌ఫారమ్‌లలో ప్రదర్శించగలుగుతున్నారు. మరింత పోటీతత్వంతో ఉన్నారు. ఫౌండేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పని చేస్తోంది. డిజిటల్ అక్షరాస్యతను వ్యాప్తి చేయడం, మారుమూల ప్రాంతాల్లో ఇ-గవర్నెన్స్ ప్రోగ్రామ్‌లను పరిచయం చేయడంపై ఇప్పుడే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ''ఆపేక్షాత్మక జిల్లా కార్యక్రమం స్థానిక మహిళలను అంబాసిడర్లుగా మార్చడంపై దృష్టి సారించింది. మేము వారిని డిజిటల్ అక్షరాస్యులను చేస్తున్నాము. ఆపై వారు ప్రభుత్వ పథకాలు అందరికీ అందుబాటులో ఉండేలా సంఘాల్లో పని చేస్తారు'' అంటున్నారు నిధి.
ఇతర మహిళలకు మార్గనిర్దేశం
విద్య, పిల్లల లైంగిక వేధింపుల నుండి మొదలుకొని తీహార్ జైలులో ఖైదీలను సంస్కరించే ప్రాజెక్ట్ వరకు నిధి నాయకత్వం వహించిన అనేక కార్యక్రమాలు తన 20 ఏండ్ల కెరీర్ ఆమెను అనేక సామాజిక సమస్యలను బహిర్గతం చేసింది. కార్పొరేట్ సెక్టార్‌తో పోలిస్తే లాభాపేక్ష లేని రంగంలో చాలా ఎక్కువ మంది మహిళలు ఉనికిని పొందుతారని ఆమె అంటున్నారు. ఓ మహిళా నాయకురాలిగా ఇతర మహిళలకు మార్గనిర్దేశం చేయడం విశేషం. ''నేను ఇతర మహిళా సహోద్యోగులకు అంటే వారు అప్పుడే కొత్తగా వచ్చిన వారు కావొచ్చు, ఎంతో కాలంగా సంస్థలో పని చేస్తున్నవారు కావొచ్చు. వారికి సహకరించే అవకాశం వస్తే కచ్చితంగా సహకరిస్తాను'' అంటున్నారు. అలాగే ఆమె సంస్థలోని పురుష ఆధిపత్యం, లింగ పక్షపాతం గురించి కూడా గట్టిగా ప్రస్తావిస్తున్నారు.
కొంచెం రాజీ.. కొంచెం త్యాగం
''ఒక మహిళగా మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి మీరు చాలా విశ్వాసాన్ని ప్రదర్శించాలి. ఒక పురుషుడు స్వేచ్ఛగా సంభాషణలో పాల్గొనగలుగుతాడు. అయితే స్త్రీకి ఆమె చుట్టూ ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఆమె ఉద్యోగం, కుటుంబ జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ బలంగా నడుస్తుంది. ఇది కొంచెం రాజీ, కొంత త్యాగంతో వస్తుంది. నా గురించి చెప్పాలంటే నా కుమార్తె జీవితంలో ముఖ్యమైన రోజుల్లో నేను తనతో ఉండగలిగానా అంటే లేదనే చెప్పాలి. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం అన్నీ మేనేజ్ చేసుకోగలము. ఏది ఏమైనప్పటికీ జీవితం ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండదు'' అంటూ ఆమె తన మాటలు ముగించారు.