Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్లాక్‌చెయిన్ సొల్యూషన్లు, ప్రోడక్ట్‌ల నుండి క్రిప్టో ఎక్స్ఛేంజీల వరకు వెబ్3 స్పేస్‌లో గుర్తింపు తెచ్చుకున్న మహిళలు ఎందరో ఉన్నారు. పురుషాధిక్య రంగంలో ఉంటూనే సవాళ్లతో సంబంధం లేకుండా వర్క్‌ప్లేస్‌లు, కమ్యూనిటీలలో మెరుగైన సంస్కృతిని సులభతరం చేసుకుంటూ 60శాతం మంది మహిళా నిపుణులు తమ ప్రత్యేకను చాటిచెబుతున్నారు. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ మహిళలు డెవలపర్లుగా, వ్యవస్థాపకులుగా భారతదేశంలో వెబ్3 స్పేస్‌లో తమదైన ముద్ర వేస్తున్నారు. ఇలాంటి రంగరంలో దూసుకుపోతున్న ఐదుగురు మహిళల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
గ్లోబల్ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ ఖబజశీఱఅ వెబ్ 3లో ప్రయాణం, పని భవిష్యత్తుపై గ్లోబల్ స్టడీ, ఇంటర్నెట్ రంగంలో వృత్తిపరమైన అవసరాల కోసం అన్వేషిస్తుంది. ఈ సర్వేలో పాల్గొన్న మహిళా వెబ్3 నిపుణులు మగవారి కంటే వృత్తిపరంగా మరింత చురుగ్గా ఉంటారని నివేదిక కచ్చితంగా చెబుతుంది. 49శాతం మంది మహిళా వెబ్3 నిపుణులు దాని సంబంధిత పరిశ్రమలలో పార్ట్ టైమ్ లేదా ఫ్రీలాన్సర్లుగా పనిచేస్తున్నారు. 33శాతం మంది పూర్తి సమయం పనిచేస్తున్నారు. వెబ్3 సంబంధిత ప్రాజెక్ట్‌లు లేదా వ్యాపారాలను ప్రారంభించడంలో 27శాతం మహిళలు ఉన్నప్పటికి మగవారికంటే వీరి వాటా ఇప్పటికీ తక్కువగానే ఉంది. వీరిలో 41శాతం మంది స్వీయ నివేదిత వెబ్3 వ్యవస్థాపకులు. 33శాతం మహిళలు పరిశ్రమలో ఇంజనీర్లు లేదా డెవలపర్లుగా పనిచేశారు. కేవలం 22శాతం మంది మహిళలు వెబ్3 ఔత్సాహికులుగా ఉన్నారు. నివేదిక ప్రకారం వెబ్3 రంగంలోని పురుషాధిపత్యం మహిళలకు సవాళ్లను ఏర్పరుస్తుంది. వీరిలో 33శాతం మంది మహిళలు bతీశీ సంస్కృతిని అడ్డంకిగా పేర్కొన్నారు. మహిళలు వెబ్3లో నిమగమవ్వడానికి సరైన విద్యా వనరులు లేకపోవడం కూడా ఒక ప్రధాన అవరోధంగా ఉంది.
తరుషా మిట్టల్
2013లో తరుషా మిట్టల్, ఆమె చిన్ననాటి స్నేహితుడు మోహిత్ మదన్ భారతదేశంలో వెబ్3 ప్రారంభమైన తొలిదశలోనే Ethereum ఎక్స్ఛేంజ్, వ్ష్ట్రఞ.షశీను ప్రారంభించారు. 2018లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రిప్టో లావాదేవీలకు మద్దతు ఇవ్వకుండా బ్యాంకులను నిషేధించినప్పుడు వారిక కంపెనీకి రెండు ఎంపికలు ఉన్నాయి. తమ కార్యకలాపాలను విదేశాలకు తరలించడం లేదా మూసివేయడం. అయితే వారి దగ్గర డబ్బులేదు. మొదటి చాలా ఖర్చుతో కూడుకున్నది. దానికి బదులుగా బ్లాక్‌చెయిన్‌లో లావాదేవీలను రికార్డ్ చేసే ఫిన్‌టెక్ యాప్‌ను రూపొందించి పైవట్ చేయాలని నిర్ణయించుకున్నారు. డిజిటల్ బంగారం, వెండి వంటి బహుళ డిజిటల్ ఆస్తులలో పెట్టుబడి పెట్టి ఒక స్టార్టప్ ఢిల్లీ ఆధారిత ఓరోపాకెట్ను ప్రారంభించారు. ఇది వినియోగదారులకు ఈ పెట్టుబడులపై ఆర్థిక సేవలను అందిస్తుంది. ఆస్తులను ద్రవ్యంగా మార్చడంలో సహాయపడుతుంది. 45కి మందికిపైగా సభ్యుల స్టార్టప్ బంగారం, వెండి నిల్వలను వారు డిజిటల్‌గా కొనుగోలు చేసినప్పుడు వారికి కేటాయించబడుతుంది. యాజమాన్యం, భవిష్యత్తు లావాదేవీలు అన్నీ Ethereum, Tezos, Polygon blockchainsలో నమోదు చేయబడతాయి. ఇది మరో రెండు ఉత్పత్తుల నుండి కూడా ఆదాయాన్ని పొందుతుంది. ఓపెన్డెఫీ, వాస్తవ ప్రపంచం, సింథటిక్ ఆస్తుల (టోకనైజ్డ్ డెరివేటివ్‌లు) యూనిఫార్మ్‌ల మిశ్రమమైన వికేంద్రీకృత ఫైనాన్స్ (DeFi) ఉత్పత్తి - బ్లాక్‌చెయిన్ ప్రాజెక్ట్‌లు కలిసి రివార్డ్ పూల్‌ని సృష్టించే పరిష్కారం ఇది.
శిల్పా కర్కేరా
మైరా టెక్నాలజీస్ AI, బ్లాక్‌చెయిన్ సొల్యూషన్స్, ఉత్పత్తుల కంపెనీ అయిన Myraa Technologies వ్యవస్థాపకురాలు, సీఇఓ శిల్పా కర్కేరా. ఆమెకు మైరాలో కీలకమైన ఆఫర్లు ఉన్నాయి. ఇవి మూడు వేర్వేరు సమస్యాత్మక ప్రాంతాలను పరిష్కరిస్తాయి. వీటిలో ఒకటి Myraa Lens ఇండిస్టియల్ ఆటోమేషన్ కోసం AI ఆధారిత విజువల్ ఇన్స్పెక్టర్. అలాగే కంప్యూటర్ విజన్‌ని ఉపయోగించి ఫ్యాక్టరీలలో దృశ్య పర్యవేక్షణకు అవసరమయ్యే మాన్యువల్ పని, నాణ్యత తనిఖీలను ఆటోమేట్ చేస్తుంది. Myraa Blocks వికేంద్రీకృత ఫైనాన్స్, పారదర్శకత కోసం భాగస్వామ్య లెడ్జర్లు, సరసమైన వాణిజ్యాన్ని ప్రారంభించే స్మార్ట్ కాంట్రాక్టులు ఎందుకు అవసరమో అవగాహన కల్పించడానికి కంపెనీ ఆర్థిక సంస్థలు, ఫ్యాక్టరీలు, సంఘాలతో కలిసి పనిచేసే బ్లాక్‌చెయిన్ అవగాహన కార్యక్రమం చేస్తుంది. Myraa Superstar సంస్థలోని సూపర్స్టార్లను క్లోన్ చేయడానికి నిష్పాక్షికమైన AI ఆధారిత సాధనం ద్వారా చేర్చడం, వైవిధ్యాన్ని అందించడం ఈ ఉత్పత్తి ఉద్దేశ్యం. ఇది మీ స్టార్ ఉద్యోగుల లక్షణాలను క్లోన్ చేస్తుంది. ప్రతిభను కనుగొనడంలో సహాయపడుతుంది. రెజ్యూమ్‌లను ఫిల్టర్ చేసే సమయంలో సంభవించే మానవ పక్షపాతాలను తొలగించడంలో, సారూప్యతను కొలిచే మెట్రిక్‌గా ఎనేబుల్ చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది.
నివేదా హరిశంకర్
మధుమిత హరిశంకర్
ప్రోడక్ట్-ఇంటెన్సివ్ బ్యాక్‌గ్రౌండ్‌తో, అక్కచెల్లెళ్ళలు అయిన నివేదా, మధుమిత హరిశంకర్ మొబైల్ డేటా వినియోగం కోసం రియల్ టైమ్, పే-యాస్-యు-గో మోడల్‌ను రూపొందించడానికి న్యూమ్ క్రిప్టోను గత సంవత్సరం స్థాపించారు. దీన్ని ప్రారంభించడానికి ముందు నివేదా అమెజాన్‌లో UX డిజైనర్‌గా పనిశారు. అక్కడ ఆమె అలెక్సా-కోర్టానా ఇంటిగ్రేషన్ కోసం ఉత్పత్తి యజమానులలో ఒకరు. కిండ్ల్ కోసం కొత్త ఫీచర్లను కూడా ఆమె రూపొందించారు. 2021లో కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ నుండి డాక్టరల్ స్టడీస్ పూర్తి చేసే ముందు మధుమిత అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. న్యూమ్ క్రిప్టో అనేది జీరో-కాస్ట్ క్రిప్టో చెల్లింపు గేట్‌వే. ఇది దాని కొత్త ఎల్2 స్కేలింగ్ ప్రోటోకాల్ ద్వారా ఆధారితమైన క్రిప్టోకరెన్సీ చెల్లింపులను, UX, ERC-20 టోకెన్లను ప్రాసెస్ చేస్తుంది. క్రిప్టోకరెన్సీ లావాదేవీలను మరింత పొదుపుగా చేయడమే న్యూమ్ క్రిప్టో ప్రధాన లక్ష్యం. క్రిప్టోను జనాల్లోకి తీసుకురావడానికి ప్లాట్‌ఫారమ్ ఒక అప్లికేషన్‌ను రూపొందిస్తోంది. అలాగే ప్రోటోకాల్ ప్రాసెసింగ్ ఖర్చులను తగ్గించడం చుట్టూ కేంద్రీకృతమై ఉంది.
సురుచి గుప్తా
2018లో సురుచి గుప్తా బ్లాక్‌చెయిన్, స్మార్ట్ కాంట్రాక్టులపై తడబడింది. సురక్షితమైన, విశ్వసనీయమైన ఇంటర్నెట్ కనెక్షన్‌ను అందించే బ్లాక్‌చెయిన్ ఆధారిత ప్రాజెక్ట్ అయిన Wificoin (ఇప్పుడు GIANT కనెక్ట్)ను నిర్మించింది. ShareG, Wificoin రెండూ 2021లో GIANT ప్రోటోకాల్ ఏర్పడటానికి దారితీశాయి. ఇది జనవరి 2022లో ప్రారంభించబడింది. GIANT(గ్లోబల్ ఇంటర్నెట్ యాక్సెస్ నెట్వర్క్ టోకెన్) ప్రోటోకాల్ అనేది ఇంటర్నెట్, ఆర్థిక సేవలకు ప్రాప్యతను వికేంద్రీకరించడానికి, ప్రజాస్వామ్యం చేయడానికి ఒక వెబ్3 ప్రోటోకాల్. టోకనైజ్డ్ బ్యాండ్‌విడ్త్ ప్లాట్‌ఫారమ్ వికేంద్రీకృత కనెక్టివిటీ ఎకానమీని సృష్టించడానికి 120 దేశాలలో టెలికమ్యూనికేషన్ కంపెనీలు, కనెక్టివిటీ ప్రొవైడర్లతో భాగస్వామ్యం కలిగి ఉంటుంది. ఇది మొబైల్ ఫోన్ ఉన్న ఎవరైనా పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా ఇది మొబైల్ ఫోన్ ఉన్న ఎవరైనా ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయడానికి, ఆన్‌లైన్‌కి వెళ్లడం ద్వారా యజమానిగా మారడానికి అనుమతిస్తుంది.