Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరివేపాకు సాధారణంగా ఆహారం రుచి, వాసన పెంచడానికి ఉపయోగిస్తారు. అయితే కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇద జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కరివేపాకు ఆకులు శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, సీని సరఫరా చేస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. బరువు పెరిగే ప్రమాదం కూడా తగ్గుతుంది. అదనంగా ఇంకా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
బ్లడ్ షుగర్ కంట్రోల్: కరివేపాకులో ఉన్న ఔషధ లక్షణాలు రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతాయి. కరివేపాకుల్లో ఉండే ఫైబర్ ఇన్సులిన్‌ను ప్రభావితం చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.
శరీర బరువు నియంత్రణ: కరివేపాకు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం సమస్యను కూడా తొలగిస్తుంది. అలాగే అధికంగా బరువు పెరగకుండా నియంత్రిస్తుంది.
మెదడుకు ప్రయోజనం: హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం కరివేపాకులో మెదడుతో సహా నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే పదార్థాలు ఉంటాయి. కరివేపాకుతో పాటు, దాని నూనె కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది యాంటీబయోటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది అనేక ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది.
చర్మ ఆరోగ్యం: ఇది చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకులను నీటితో ఉడకబెట్టి స్నానం చేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ల సమస్య పరిష్కారమవుతుంది.