Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చర్మరంధ్రాలలో దుమ్ము, మురికి, జిడ్డు వంటివి పేరుకునిపోవడం వల్ల సాదారణంగా ముఖం మీద తెల్ల మచ్చలు, నల్లమచ్చలు వస్తూనే ఉంటాయి. అయితే ఆ మచ్చలు రాకుండా ఉండటానికి వచ్చినవి మాయమయ్యేలా చేసే కొన్ని చిట్కాలు కూడా ఉంటాయి.
ప్రతి 15 రోజులకు ఒకసారి ముఖానికి క్లెన్సింగ్ ఇంకా స్క్రబ్ చేయడం వల్ల మృతకణాలు తొందరగా తొలగిపోతాయి. మృతకణాల వల్లనే మచ్చలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. తాజా వెజిటబుల్ జ్యుస్తో చర్మాన్ని క్లెన్స్ చేసుకోవాలి. క్లెన్సింగ్ కోసం తక్కువ చెక్కరలు ఉన్న ఆరంజ్, దానిమ్మ, ఆపిల్ వంటి పండ్ల రసాలు కూడా ఉపయోగించవచ్చు.
నూనెలో వేయించిన పదార్థాలు, చీజ్, చాక్లెట్స్, బేకరీ ఫుడ్స్ మొదలైనవి కనీసం ఆరునెలల పాటు అవాయిడ్ చెయ్యాలి. ఇలా చేయడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది.
జింక్, విటమిన్-ఎ, విటమిన్-సి మొదలైన విటమిన్స్ తప్పనిసరిగా రోజువారీ ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి.
కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో చిరుధాన్యాలు, మొలకలు, డ్రై ఫ్రూట్స్, తాజా ఆకుకూరలు, కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి.
బీట్రూట్లో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని క్లెన్స్ చేయడంలో అద్భుతంగా పని చేస్తుంది. కాబట్టి దాన్ని డైట్లో భాగం చేసుకోవాలి. బీట్రూట్ జ్యుస్గా తీసుకున్నా మంచి ప్రయోజనం ఉంటుంది.
ఈ చిట్కాలు అన్ని పాటిస్తే ముఖం మీద ఏ రకమైన మచ్చలు రావు. అన్నిటికంటే ముఖ్యంగా ఒత్తిడిలేని జీవితాన్ని సంపాదించాలి. ఒత్తిడి మనిషికి మానసిక సమస్యలని మాత్రమే కాదు శారీరక సమస్యలను కూడా సృష్టిస్తుంది. మచ్చలేని జీవితమే కాదు, మచ్చలేని చర్మం కూడా సాధ్యమే మరి.