Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జలుబు సర్వ సాధారణమైన లక్షణం. అయితేనేం పట్టిందంటే పీడిస్తుంది. తెగ సతాయిస్తుంది. శరీరమంతా అలసిపోయినట్టు అవుతుంది. నిద్ర పట్టడం కష్టమౌతుంది.
పసుపు, పటిక బెల్లంను సమంగా తీసుకుని నిప్పుల మీద వేసి ఆ పొగను పీల్చినట్లైతే పడిశం సమస్య నివారణ అవుతుంది. మిరియాలను నూరి, బెల్లంతో కలిపి ముద్దగా చేసి తింటే జలుబు తగ్గుతుంది. ఒకవేళ అది మరీ ఘాటుగా ఉంటుంది, తినలేము అనుకుంటే వేడి పాలలో మిరియాల పొడి వేసుకుని తాగినా ఫలితం ఉంటుంది.
గులాబీ రేకలను నువ్వుల నూనెలో మరిగించి, దించి వడపోసి నిల్వ చేసుకోవాలి. ఈ గులాబీ తైలాన్ని రెండు పూటలా రెండు చుక్కలు ముక్కులో వేస్తే జలుబు తగ్గుతుంది. తుమ్ములు కూడా అరికడతాయి. కొందరికి డస్ట్ ఎలర్జీల్లాంటివి ఉంటాయి.
కొందరికి ఎండలో తిరిగితే వెంటనే ఎలర్జీ వస్తుంది. మరి కొందరికి కొన్ని వాసనలు సరిపడవు. ఇంకొందరికి కొన్ని పదార్ధాలు తింటే ఎలర్జీ వస్తుంది. వీళ్ళందరికీ దాదాపుగా కోల్డ్ మొదటి లక్షణంగా ఉంటుంది. కనుక ఏది సరిపడటంలేదో, దానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.