Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గర్భధారణ సమయంలో మహిళల్లో హార్మోన్ల మార్పులు సాధారణంగా జరుగుతాయి. అలాగే జుట్టు, చర్మం మార్పులకు లోనవుతాయి. ముఖ్యంగా చర్మంలో మొటిమలు, బ్లాక్ హెడ్స్, రంగు మారడం వంటి సమస్యలను సృష్టిస్తుంది. గర్భధారణ సమయంలో శరీరం భారీ మార్పులకు గురవుతున్నందున వైద్యులు చర్మాన్ని ఆరోగ్యంగా, హైడ్రేటెడ్‌గా ఉంచాలని సిఫార్సు చేస్తారు. మీరు గర్భవతి అయితే వైద్యులు సూచింతచే కొన్ని చర్మ సంరక్షణ చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
సరైన ఆహారం, హైడ్రేషన్: శరీరంలోని అన్ని విషపదార్ధాలను ఎప్పటికప్పుడు బయటకు పంపడం అవసరం. కాబట్టి రోజూ తగినంత నీరు కచ్చితంగా తాగాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల మీ చర్మం అలసటగా లేదా నిస్తేజంగా కనిపించకుండా నిరోధించవచ్చు.
మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ క్లియర్ చేయడం: గర్భధారణ సమయంలో మొటిమలు, మచ్చలు కనబడటం సహజం. ఈ సమస్యలన్నీ లేకుండా మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే మీ ముఖాన్ని ఆయిల్ ఫ్రీ క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి. పొడి చర్మం ఉన్నవారు నాన్-కామెడోజెనిక్ ఫేస్ వాష్లను ఎంచుకోవాలి.
8-10 గంటల నిద్ర: గర్భిణీ స్త్రీలు 8 నుండి 10 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కడుపులో అభివృద్ధి చెందుతున్న శిశువుకు మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఆరోగ్యకరమైనది. గర్భధారణ సమయంలో విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మంచి నిద్ర హేమోరాయిడ్లను నివారించడంలో సహాయపడుతుంది.
కఠినమైన సబ్బులను నివారించండి: చర్మంపై కఠినమైన సబ్బులను ఉపయోగించడం వల్ల చర్మంపై ఉన్న నూనెను తొలగించవచ్చు. కాబట్టి తేలికపాటి సబ్బులు లేదా మాయిశ్చరైజింగ్ బాడీ వాష్లను ఉపయోగించండి.
సూర్యకాంతి నుండి రక్షణ: సూర్యుని యువీ కిరణాలు మొటిమలకు అతి ముఖ్యమైన కారణం. కాబట్టి మీ చర్మాన్ని ఎండ నుండి రక్షించుకోవడానికి గ్లైకోలిక్ యాసిడ్, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, ఎరిత్రోమైసిన్ లేదా డాక్టర్ సూచించిన ఫేషియల్ క్రీమ్‌లను ఉపయోగించండి.
ఎక్స్ఫోలియేట్ చేయవద్దు: గర్భధారణ సమయంలో చర్మం మరింత సున్నితంగా మారుతుంది. కాబట్టి ఎక్స్ఫోలియేషన్ వంటి సౌందర్య చికిత్సలు చేయవద్దు.
వ్యాయామంపై దృష్టి పెట్టండి: ఆరోగ్యకరమైన చర్మానికి వ్యాయామం సహాయపడుతుంది. అయితే గర్భధారణ సమయంలో డాక్టర్ సలహాతో వ్యాయామం చేయవచ్చు. ముఖ్యంగా ప్రెగెన్సీ యోగాలు డెలివరీని సులభతరం చేయడానికి, చర్మాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. వ్యాయామం చేసేటప్పుడు చెమటలు పట్టడం వల్ల టాక్సిన్స్‌ని బయటకు పంపి ముఖానికి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా చర్మం మెరుస్తుంది.