Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా పెళ్ళై, పిల్లలు పుట్టిన తర్వాత శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. శరీరాకృతి చక్కగా ఉండటం కోసం రకాల ప్రయోగాలు చేస్తుంటారు. కొంతమంది తినే ఆహారాన్ని తగ్గించుకుంటే బరువు తగ్గి శరీరం సన్నగా అవుతుందనే అపోహలో ఉంటారు. కానీ అందరికీ తెలియాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే శరీరంలో ఉన్న కొవ్వులు తగ్గడానికి ఆహారం తగ్గించడం పరిష్కారం కానే కాదు. ఆహారాన్ని తగ్గించుకోవడం వల్ల శరీరానికి అందాల్సిన పోషకాలు అందవు. ఫలితంగా లావు ఉన్నా పోషకార లోపం వల్ల శరీరంలో కొన్ని భాగాలు సమస్యకు లోనవుతాయి. ఇల్లు, పిల్లలు, ఉద్యోగం చూసుకుంటూ కూడా ఫిట్‌గా ఉండటానికి అదిరిపోయే ఫిట్నెస్ టిప్స్ కొన్ని ఉన్నాయి. ఈ టిప్స్ ఫాలో అయితే చక్కనైన శరీరాకృతి సొంతం అవుతుంది.
అవగాహన అవసరం: రోజూ వ్యాయామాలు చేసేవారు చాలామంది తాము ఏమి చేస్తున్నాం అనే విషయాన్ని పెద్దగా గమనించుకోరు. వ్యాయామం చేస్తున్నాం అన్నది మెయిన్ పాయింట్‌గా చూస్తారు తప్ప ఏ వ్యాయామం చేస్తున్నాం అనేది అవగాహన కూడా ఉండదు. మన శరీరతత్వాన్ని బట్టి వ్యాయామాలు ఎంచుకోవాలి. టీవీలలోనూ, యూట్యూబ్‌లోనూ మగవాళ్ళు చేస్తున్న వ్యాయామాలు చూసి వాటిని ఫాలో అవకూడదు. ఇదే మొదటి ఫిట్నెస్ మంత్రం.
కొత్తదనం: వ్యాయామంలో కూడా బోలెడు రకాలు ఉంటాయి. ఎప్పుడూ ఒకటే కాకుండా ఒకో రోజు ఒకో విధమైన వ్యాయామాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే వ్యాయామం చేసేటప్పుడు విసుగు ఉండదు.
గాయాలతో జాగ్రత్త: వ్యాయామం చేసేటప్పుడు శరీరంలో వివిధ భాగాలలో గాయాలు అవుతుంటాయి. గాయాలు అంటే బయటకు కనిపించేవి కావు. శరీరంలోపల కండర వ్యవస్థ దెబ్బతింటూ ఉంటుంది. ఇవి చాలా నొప్పిని కలిగిస్తాయి. ఈ నొప్పులు అలాగే ఉన్నపుడు మళ్ళీ వ్యాయామం చేయడం మంచిది కాదు. అవి తగ్గడానికి తగిన సమయం తీసుకోవాలి.
సైడ్ స్టిచ్: వ్యాయామం చేయడం మొదలుపెట్టినప్పుడు పక్కటెముకల కింద నొప్పి రావడం సహజం. ఇది బ్రీతింగ్ ఎక్స్‌సర్‌సైజ్ వల్ల మెల్లగా తగ్గుతుంది. కాబట్టి ఈ సైడ్ స్టిచ్‌ను తగ్గించుకోవడం చాలా ముఖ్యం.
ఔటింగ్ వెళ్లడం: ఔటింగ్ వెళ్లడం అనేదాన్ని సాధారణంగా బయటకు వెళ్లడం అంటారు. సరదాగా అలా ఒక్కరే బయటకు వెళ్లడం వల్ల మానసికంగా రిలాక్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందరి మద్యనా అన్ని పనులు చేస్తూ అలసిపోయేవారికి ఇదొక గొప్ప బ్రేక్ అవుతుంది.
సౌకర్యవంతం ముఖ్యం: ఆహారం కావచ్చు, వ్యాయామం కావచ్చు శరీరానికి సౌకర్యవంతంగా ఉండాలి. మరీ రిస్క్ తీసుకునే వ్యాయామాల జోలికి మహిళలు వెళ్లకూడదు. వ్యాయామాల ఒత్తిడి నుండి శరీరాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఆహారం విషయంలో రాజీ ఉండకూడదు. మంచి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
ట్రెడిషనల్‌తో టార్గెట్: చిన్నప్పుడు తాడు ఆట, రన్నింగ్, డాన్సింగ్ వంటివి బాగా చేస్తుంటారు. వీటిని పిల్లలున్న మహిళలు కూడా నిరభ్యరంతంగా ఫాలో అవచ్చు. రోజూ చేస్తుంటే మంచి పలితాన్ని ఇస్తాయి ఇవి. అలాగే బద్దకం, విసుగు అనేవి వ్యాయామం విషయంలో రానీయకూడదు. ఒకవేళ వస్తే వ్యాయామం స్థానంలో పైన చెప్పుకున్న ట్రెడిషనల్ దారులున్నాయి. అలాగే ఔటింగ్ వెల్లచ్చు. సరదాగా వాకింగ్ చేసినట్టు ఉంటుంది. ఇన్ని మార్గాలు ఫాలో అయితే మీ విషయంలో ఫిట్నెస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ప