Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాయకత్వ స్థాయికి రావాలంటే ఎవరైనా కష్టపడాల్సిందే. ఇక మహిళలైతే మరింతగా శ్రమించాలి. కుటుంబం ఇటు ఉద్యోగం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం. ఓ సంస్థకు సీఈఓ కావడమంటే మామూలు విషయం కాదు. అందులోనూ భారతదేశంలో మంచి గుర్తింపు ఉన్న పెద్ద పెద్ద సంస్థల్లో అంటే అసలు మహిళలను ఆ స్థాయిలో ఊహించలేము. అతి తక్కువ మంది మాత్రమే అంత ఎత్తును అందుకోగలరు. అలాంటి జాబితాలో చేరారు కింజల్ పాండే. రవాణా అండ్ లాజిస్టిక్స్ విభాగమైన డీబీ షెంకర్ ఇండియాకు మొదటి మహిళా సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ విభాగంలో తనకున్న 19 ఏండ్ల అనుబంధాన్ని మనతో పంచుకుంటున్నారు.
మీ బాల్యం, చదువు ఎలా కొనసాగిందో చెప్పండి?
మా నాన్న ఆర్మీలో ఉన్నారు. నా బాల్యమంతా ప్రతి రెండేండ్లకోసారి ఒక నగరం నుండి మరొక నగరానికి మారతుండేది. దాంతో కొత్త ప్రదేశాలను అలవాటు చేసుకోవడం, కొత్త స్నేహితులను కలుసుకోవడం, వేరొక భాష, సంస్కృతికి చాలా త్వరగా అర్థం చేసుకునే శక్తి నాలో పెరిగింది. మేము సరిహద్దుల సమీపంలోని చిన్న నగరాల చుట్టూ తిరిగాము. నాన్నను లక్నోకు బదిలీ చేసినప్పుడు మొదటిసారి ఓ పెద్ద నగరానికి వెళ్లినట్టు మాకు అనిపించింది. నేను ఢిల్లీ యూనివర్శిటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు, పూణే నుండి ఎంబీఏ చేసాను. తర్వాత షిప్పింగ్ లైన్ ూడఉ నెడ్లాయిడ్లో చేరాను.
కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎలా కొనసాగింది?
2003లో క్యాంపస్‌లో చేరాను. ఆ పాత్రలో రెండు సంవత్సరాలు ఉండి కంపెనీని అతిపెద్ద షిప్పింగ్ లైన్లలో ఒకటైన మార్స్క్ కొనుగోలు చేసిన మార్పును అనుభవించాను. సాంస్కృతిక దృక్కోణం నుండి చూసినప్పుడు సంస్థలో పని చాలా సరదాగా ఉంటుంది. అయితే అందులో మనకు ఉద్యోగం ఉంటుందా లేదా అనేది మనం ఊహించలేము. నాకైతే సాఫీగా సాగింది. నేను ఈ సంవత్సరం డీబీ షెంకర్లో చేరే వరకు తదుపరి 19 సంవత్సరాలు ఏపీ మొల్లర్ మెర్స్క్లో పని చేశాను.
మీరు ప్రారంభించినప్పుడు లాజిస్టిక్స్ రంగంలో చాలా మంది మహిళలు ఉండకపోవచ్చు. మరి మీరు దీన్నే ఎందుకు ఎంచుకున్నారు?
ఇరవై ఏండ్ల కిందట మహిళలకు ఇలాంటి వాతావరణం లేదు. ప్రస్తుతం మనం చూస్తున్న భావనలు, ప్రోత్సాహకాలు, ప్రాధాన్యతల గురించి ఎక్కువగా మాట్లాడలేకపోయాము. నేను క్యాంపస్‌కి వచ్చిన తర్వాత పేరున్న కంపెనీలో చేరడంతో నా మార్గం సులభమయింది. ఇప్పుడు చాలా మార్పు వస్తుంది. ఈ విభాగంలోకి కూడా మహిళలు వస్తున్నారు. కానీ మొదటి ఎంపికగా దీన్ని తీసుకోలేకపోతున్నారు.
మీరు మీ కెరీర్లో ఎక్కువ భాగం ఏపీ మొల్లర్ మెర్స్క్లో ఉన్నారు. అక్కడి మీ అనుభవాలు చెప్పండి?
సంస్థలో పై స్థాయికి వెళ్ళే మహిళలు చాలా తక్కువ. కానీ అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయి. నేను చేరినప్పుడు అది భారతదేశంలో అమ్మకాలు, వాణిజ్య లింక్‌లలో ఉంది. నాకు కోపెన్హాగన్కి వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడ నాకు మూడు సంవత్సరాల పాటు ూచీూ అనుభవం వచ్చింది. ఇది బాగానే ఉంది. నిర్ణయాలు, నౌకల పరిమాణం, వాటిని ఎలా నింపాలి, ఏ పోర్ట్‌లకు కాల్ చేయాలి, ధరల పాయింట్లు మరిన్నింటిని వాళ్ళు నాకే వదిలేశారు. నేను భారతదేశానికి తిరిగి వచ్చాను. దానిలో హ్యాంగ్ పొందడానికి ఫైనాన్స్‌తో సహా విభిన్న పాత్రలలో తిరిగాను. పోర్ట్-టు-పోర్ట్ సముద్ర ప్రపంచంలో ఉండటం కొంచెం కష్టంగా ఉంది. ఇక్కడ నేను లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్‌గా ఉన్నాను. నేను పని చేసిన విభాగంలో కొన్ని సమూల మార్పులు తీసుకురాగలిగాను.
మీ అతిపెద్ద విజయాలు, సవాళ్లు ఏమిటి?
నా అతిపెద్ద విజయం చిన్న వ్యాపార యూనిట్లో ఉండటం. నేను నా సొంత బలంతో పని చేస్తున్నాను అనేది బయటి ప్రపంచానికి నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది చాలా విజయవంతమయింది. మలుపులు, పరివర్తనల ద్వారా నన్ను నేను ముందుకు నెట్టుకున్నాను. మయన్మార్ చివరి సరిహద్దు దేశం. అక్కడ ఎండీ బాధ్యతల్లో ఉన్నాను. అక్కడే సవాళ్లతో పాటు భిన్నమైన మార్కెట్‌ను చూశాను. నేను ఫిబ్రవరి 2021లో అడుగుపెట్టిన వెంటనే దేశం సైనిక తిరుగుబాటుకు గురైంది. దీని అర్థం యువ జట్టుకు ఒత్తిడితో కూడిన పరిస్థితి, భద్రత, స్థిరత్వం లేకపోవడం. ఇలాంటి పరిస్థితుల్లో కస్టమర్లను భావోద్వేగాలను నిర్వహించడం, పనిని పూర్తి చేయడం కష్టం. నా వ్యక్తిగత విజయం అంటే అది జట్టును నడిపించడమే.
మహమ్మారి సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారు?
దాని నుండి ఎలా బయటపడతామో ఎవరికీ తెలియదు. వ్యక్తులను, వినియోగదారుల అవసరాలను నిర్వహించడం సవాలుగా ఉంది. రెండవ వేవ్ మరింత కఠినమైనది. నాకు ఒక విషయం చాలా స్పష్టంగా ఉంది. మహమ్మారి అయినా లేదా సైనిక తిరుగుబాటు అయినా, మొదట, ప్రజలను జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపారం రెండవది.
మీరు డీబీ షెంకర్ మొదటి మహిళా సీఈఓగా ఉన్నారు. గతానికి ప్రస్తుతానికి తేడా ఏమైనా ఉందా?
ఆసియా-పసిఫిక్ కోసం మాకు కొరియా-జపాన్ క్లస్టర్‌కు సీఈఓగా ఒక మహిళ ఉంది. ఈ ప్రాంతంలోని మా అగ్ర ఉత్పత్తి అధిపతుల్లో కొందరు మహిళల పాత్ర ఉంది. నిజం చెప్పాలంటే దీన్ని మేము గర్వంగా భావిస్తున్నాము. అదే సమయంలో బాధ్యత కూడా ఉంది. విజయం సాధించాలి నేను సంస్థలో లీడర్‌గా రోల్ మోడల్‌గా ఉండాలి. తద్వారా ఎక్కువ మంది మహిళలు ముందుకు వచ్చి నాయకులుగా ఉండటానికి కృషి చేస్తారు. అలాగే వ్యక్తులను మెరిట్‌తో తీసుకునే సంస్థలలో పని చేసే అవకాశం నాకు వచ్చింది. మహిళలకు మద్దతు ఇవ్వడానికి, సందేశాన్ని వ్యాప్తి చేయడానికి నేను ఇంకా చాలా చేయాల్సి ఉందని నేను భావిస్తున్నాను.
మీ ప్రస్తుత పాత్రలో మీ ప్రణాళికల్లో వైవిధ్యం, చేరికలు ఎక్కువగా ఉన్నాయని అనుకోవచ్చా?
ఇది మా ప్రపంచ వ్యూహంలో ప్రధాన భాగం. మనం ఇండియా క్లస్టర్‌ను పరిశీలిస్తే జట్టు పరిమాణంలో మంచి ప్రాతినిధ్యం ఉంది. మేము పైకి వెళ్ళే కొద్దీ వ్యాపార విషయాలలో తగినంత మంది మహిళలు లేరు. వయసు, లింగంతో సంబంధం లేకుండా ప్రతిభను గుర్తిస్తున్నాము. మహిళల అవసరాలు పురుషుల కంటే భిన్నంగా ఉంటాయి అనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని మేము నాయకత్వ బృందంలో కోచ్‌లను అందిస్తున్నాము. టాలెంట్ పూల్‌లోని మహిళలు బాగా ప్రాతినిధ్యం వహించాలని మేము కోరుకుంటున్నాము. వారసత్వ ప్రణాళికలు గుర్తించబడతాయి. కోచ్‌లు వాటిని ప్రయాణంలో తీసుకుంటారు. మేము ఏదైనా నాయకత్వ పాత్ర కోసం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తున్నప్పుడు జాబితాలో ఒక మహిళా అభ్యర్థి భాగం కావాలని మేము కోరుకుంటున్నాము. మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. మేము నిరంతర వారితో మాట్లాడుతూ ఉంటాము. మహిళలు విభిన్నంగా ఆలోచించాలంటే వారికి అందుతున్న సహకారంపై ఆధారపడి ఉంటుంది.
నాయకత్వ స్థానాల్లో మహిళలు తక్కువగా ఎందుకు ఉన్నారు?
స్త్రీలకు చాలా సందేహాలు వస్తాయి. వెళ్ళే దారిలో ఏవైనా సమస్యలు వుంటే అటువైపు వెళ్ళి ఎందుకు బాధపడాలని కొన్నిసార్లు ఆలోచిస్తారు. మరో వివాహం, పిల్లలు. కుటుంబం నుండి మద్దతు లేకపోవడం మహిళలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. అందుకే సంస్థలు వారికి సమయం ఇవ్వాలి. మనలాంటి కొందరు వారికి బ్రేక్‌లు ఇస్తారు. వారు సిద్ధంగా ఉన్నప్పుడల్లా తిరిగి రావాలి. అలా కొందరు తిరిగి రావడం నేను చూశాను. పెద్ద సంస్థలు మద్దతు సౌలభ్యాన్ని సృష్టించాయి. కానీ మహిళా శ్రామికశక్తికి మద్దతు లేని ప్రదేశాలలో భారీ ఖాళీ ఉంది.