Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళల ఆరోగ్యానికి హార్మోన్లు ముఖ్యమైనవి. ఈ హార్మోన్లే మహిళల్లో మానసిక పరిస్థితిని, శారీరక సమర్ధ్యాన్ని నిర్దేశిస్తాయి. శారీరకంగా నీరసంగా ఉన్నట్టు అనిపించడం, బద్ధకంగా, ఏ పని మీదా ఆసక్తి లేకుండా ఉండటం వంటివి ఎదుర్కొంటూ ఉంటారు. ఈరకమైన సమస్యలకు కేవలం హార్మోన్లు అసమతుల్యంగా ఉండటమే ముఖ్యకారణం. ఈ హార్మోన్లను తిరిగి ఆక్టివ్ చేయగలిగితే చురుగ్గా ఉండగలుగుతారు. హార్మోన్లను చురుగ్గా చేసే కొన్ని అద్భుతమైన న్యూట్రిషన్ ఫుడ్స్ ఉన్నాయి. వాటిని తీసుకుంటే బద్ధకంగా, నీరసంగా, అసక్తి లేకుండా ఉండే వారు అమాంతం బూస్టింగ్ అయిపోయి చకచకా అన్ని పనులలో ముందుంటారు. సెరోటోనిన్, ఎండార్ఫిన్స్, డోపమైన్, ఆక్సిటోసిన్ అనే నాలుగు హార్మోన్లు ఉన్నాయి. ఇవి మహిళల్లో ఉన్న మానసిక అసమతుల్యతలను సరిచేసి సంతోషకరమైన మూడ్స్ని ఇస్తాయి. ఈ హార్మోన్స్ ఉన్న ఆహారపదార్థాలను తీసుకుంటే సొల్యూషన్ దొరికినట్టే!! మరి ఆ ఆహారపదార్థాలు ఏమిటో తెలుసుకుందాం...
ఉదయాన్నే ముఖం కడుక్కున్న తర్వాత అటు ఇటు హడావిడి పడకుండా మరీ చల్లగా ఉన్నవి కాకుండా సహజమైన నీటిని ఒకచోట కూర్చుని కొద్దికొద్దిగా తాగాలి. ఉదయాన్నే నీటిని తాగడం వల్ల జరిగేది ఏమిటంటే, శరీరంలో ఉన్న టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల రోజంతా శరీరం హైడ్రేడ్గా ఉంటుంది.
ఫోలేట్ లేదా విటమిన్ బి12 అధికంగా ఉండే ఆకుకూరలు, చిక్కుళ్ళు, తోటకూర, గుడ్లు మొదలైన ఆహారాలు మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. డిప్రెషన్, యాంగ్జయిటీ ఉన్నవారిలో ఫోలేట్ లోపం ఉంటుందని ఒక పరిశోధనలో తేలింది. ప్రతిరోజు ఆహారంలో మిగిలిన కూరలతో పాటు ఒక కట్ట తోటకూరను తాలింపు పెట్టుకుని తినడం వల్ల శరీరానికి కావలసిన ఫోలేట్ లభిస్తుంది.
డ్రై ఫ్రూట్స్, సీడ్స్ అనేవి ఎంతో ముఖ్యమైన పోషకాలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా గింజలు ట్రిఫ్టోఫాన్ను కలిగి ఉంటాయి. ఇది సెరొటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బాదం, వాల్నట్, చియా గింజలు, అవిసె గింజలు వంటి కొన్ని గింజలు తీసుకోవడం వల్ల మహిళల్లో హార్మోన్స్ ఆక్టివ్ అయ్యి సంతోషకరమైన మూడ్స్ పెంచుతాయి.
కొన్ని ఖనిజాలు, విటమిన్లు కలిగిన పోషకమైన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ స్థాయిలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. నిమ్మ, నారింజ, బెర్రీలు, ఉసిరి మొదలైన విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు శరీరంలో సమతుల్యంగా పోషకాలను భర్తీ చేయడానికి సహాయపడతాయి. ఇవి మానసిక స్థాయిలను మెరుగుపరుస్తాయి.
డార్క్ చాక్లెట్ వల్ల మూడ్స్ మెరుగవుతాయని చాలామందికి తెలుసు. డార్క్ చాక్లెట్ తయారీకి ఉపయోగించే కోకో ఎండార్ఫిన్లను విడుదల చేయడంలో సహాయపడుతుంది.
పెరుగు వంటి ప్రోబయోటిక్స్, ఇడ్లీ/దోస వంటి పులియబెట్టిన ఆహారాలు, మజ్జిగ వంటి వాటిని భోజనంలో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇవి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.