Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిర్యానీ గానీ, నాన్ వెజ్ వంటకాలుగానీ లవంగాలు వేయకుండా వండరు. ఎందుకంటే.. అది వేస్తే వచ్చే రుచి, వాసనే చాలా స్పెషల్. అయితే ఈ లవంగాలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
లవంగాలు కండరాల నొప్పిని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా లవంగం నూనె అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. వివిధ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.
లవంగం మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మూత్ర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
చిగుళ్ల ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే పీరియాంటల్ పాథోజెన్స్ వంటి బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడుతుంది. పంటి నొప్పి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
లవంగాల్లో యూజినాల్ ఉంటుంది. ఇది దంతాలను కుళ్లిపోకుండా కాపాడుతుంది. సైనస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
లవంగాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నందున జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి.
కడుపు ఉబ్బరం, అజీర్తి, విరేచనాలు, మలబద్ధకం, గ్యాస్, ఆకలి లేకపోవడం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. లవంగాలు శరీరంలో ఎంజైమ్లను ప్రేరేపిస్తాయి. ఇది జీర్ణవ్యవస్థ, పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
లవంగాలను తీసుకోవడం వల్ల శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.
లవంగాల వాడకం వల్ల నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.
- లవంగం నూనెలో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఇది మొటిమల సమస్యను నయం చేస్తుంది.
- కఫం సమస్యను తగ్గించడానికి లవంగం మంచి పదార్థం.
- దీన్ని మితంగా తీసుకోవడం వల్ల వాంతులు, వికారం, రక్త సమస్యలు, శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్షయం వంటి సమస్యలు తగ్గుతాయి.