Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలామంది అమ్మాయిలు ముఖ సౌందర్యం పైన పెట్టినంత శ్రద్ధ జుట్టు సంరక్షణ విషయంలో చూపరనే చెప్పాలి. ఏదో షాంపూ చేసుకున్నామా, అకేషనల్గా ఏదో ఒక హెయిర్ మాస్క్ వేసుకున్నామా.. అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. జుట్టు నెమ్మదిగా పెరగడానికి ఈ అలక్ష్యమూ ఓ కారణమే అంటున్నారు నిపుణులు. కాబట్టి దీన్ని అధిగమించాలంటే..
గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. అది కూడా రోజూ కాకుండా వారానికి రెండుసార్లు చాలు.
తలస్నానం చేసిన వెంటనే కండిషనర్ రాసుకోవడం మర్చిపోవద్దు. ఇది జుట్టును పట్టుకుచ్చులా మారుస్తుంది.
నూనె పెట్టకుండా జుట్టును రోజులకు రోజులు అలా వదిలేయకూడదు. కనీసం వారానికి రెండు మూడుసార్లు నూనెను కుదుళ్లు, జుట్టుకు పట్టించాలి.
ఏదో అకేషనల్గా కాకుండా.. మీ జుట్టు తత్వానికి సరిపోయే, ఇంట్లో తయారుచేసిన హెయిర్ మాస్కుల్ని వారానికి ఒకటి లేదా రెండుసార్లు వేసుకోవాలి.
చిట్లిన జుట్టు చివర్లను తరచూ కత్తిరించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
చుండ్రు వల్ల కూడా జుట్టు పెరిగే ప్రక్రియ నెమ్మదిస్తుంది. కాబట్టి నిపుణుల సలహా మేరకు దానికి మందులు వాడడం, ఇతర చిట్కాలు ప్రయత్నించడం వల్ల ఫలితం ఉంటుంది.