Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన శరీరానికి నీరు చాలా ముఖ్యమైనది. మంచి ఆరోగ్యం కోసం రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే నీరు తాగడమే కాదు.. మనం నీటిని ఎలా తాగుతాము అనేది కూడా చాలా ముఖ్యం అంటున్నారు వారు. నేటి ఉరుకులు పరుగుల హడావిడి జీవితంలో చాలామంది నీటిని నిలబడి తాగుతారు. ఇలా తాగడం వల్ల మనం అనేక వ్యాధులను ఆహ్వానించినట్టే అంటున్నారు. నిలబడి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి రోగాలను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకుందాం.
నిలబడి నీరు తాగినప్పుడల్లా శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. ఇది కాకుండా ఆహారం, గాలి నాళాల్లో ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది. దీని చెడు ప్రభావం ఊపిరితిత్తులపైనే కాదు గుండెపై కూడా ఉంటుంది. నిలబడి నీరు తాగడం వల్ల కడుపులో నీటి పరిమాణం పెరుగుతుంది. ఇది పొత్తికడుపులో ఒత్తిడిని సృష్టిస్తుంది. అటువంటి పరిస్థితిలో ప్రజలు హెర్నియా బాధితులుగా మారతారు.
నిలబడి నీళ్లు తాగడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. అవును ఒత్తిడి పెరగడానికి ఈ అలవాటు కూడా ఒక ప్రధాన కారణం. నిపుణుల అభిప్రాయం ప్రకారం నిలబడి నీరు తాగటం నాడీ వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ పరిస్థితిలో పోషకాలు శరీరానికి అందకపోవడంతోపాటు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
నిలబడి నీళ్లు తాగడం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయని పెద్దలు చెప్పినప్పుడు చాలాసార్లు వినే ఉంటారు. ఇది నిజం.. నిలబడి నీళ్ళు తాగడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి పడుతుంది. దానివల్ల కీళ్లనొప్పుల సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా ఎముకలు కూడా బలహీనపడటం ప్రారంభమవుతాయి.
ఈ అలవాటు మీ మూత్రపిండాలపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఒక వ్యక్తి నిలబడి నీరు తాగినప్పుడల్లా నీరు ఫిల్టర్ కాకుండా దిగువ ఉదరం వైపు వేగంగా కదులుతుంది. దీంతో నీటి మలినాలు గాల్ బ్లాడర్లో నిక్షిప్తమవుతాయి. ఇద కిడ్నీకి చాలా హానికరం.