Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్న పిల్లలతో ప్రయాణం సులభం కాదు. బ్యాగ్‌ని హ్యాండిల్ చేయాలో లేదా పిల్లల్ని హ్యాండిల్ చేయాలో అర్థం కాదు. మీరు పిల్లలతో ఒంటరిగా ప్రయాణి స్తున్నప్పుడు కష్టం మరింత పెద్దదిగా కనిపిస్తుంది. సాధారణంగా మహిళలు తమ బిడ్డతో ప్రయాణిం చేటప్పుటు చాలా ఇబ్బం దులను ఎదుర్కొంటారు. ఒంటరిగా యాత్రను ఆస్వాదించలేరు. ఒక తల్లిగా మీరు మీ పిల్లలతో ప్రయాణించే ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు, తదనుగుణంగా మీ సన్నాహాలు గురించి తెలుసుకుందాం.
పరిశోధన అవసరం: మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు అనే దాని గురించి మీ దగ్గర పూర్తి సమాచారం ఉంటే మంచిది. ఉదాహరణకు అక్కడి వాతావరణం, ఆహారం, పానీయాలు, విద్యుత్, నీటి వ్యవస్థ, భద్రత, సంస్కృతి మొదలైనవి. దీని కోసం మీరు ఇంటర్నెట్, స్నేహితుల సహాయం తీసుకోవచ్చు. పిల్లల స్నేహపూర్వక వాతావరణం గురించి తెలుసుకోండి. దానికి అనుగుణంగా మీ ప్యాకింగ్ చేయండి.
బ్యాగ్‌లను తేలికగా ఉంచండి: ప్రయాణ సమయంలో మీ వద్ద తక్కువ సామాను ఉంటే ప్రయాణించడం సులభం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు స్మార్ట్ ప్యాకింగ్ చేయండి. అన్ని ముఖ్యమైన వస్తువులను కలిపి ఉంచడానికి ప్రయత్నించండి. ఓవర్ ప్యాకింగ్‌ను నివారించండి. ప్రయాణ సమయంలో పిల్లల కోసం ఒకటి లేదా రెండు అదనపు దుస్తులను తీసుకెళ్లండి. పిల్లల ఆహార పదార్థాలు, బొమ్మలు మొదలైనవాటిని చేతిలో ఉంచండి.
స్నేహపూర్వక ప్రదేశం: హోటల్‌ను బుక్ చేస్తున్నప్పుడు దాని రివ్యూలను చదవండి. వీలైతే వాటి ఫోటోలను చూడండి. హోటల్ లేదా గది పిల్లల స్నేహపూర్వకంగా ఉందో లేదో తనిఖీ చేయండి.
బూట్లు సౌకర్యవంతంగా ఉంటాయి: ప్రయాణ సమయంలో మీరు హీల్స్ లేదా స్టైలిష్ షూలకు బదులుగా స్పోర్ట్స్ షూలను ధరిస్తే అది మీకు సౌకర్యంగా ఉంటుంది.