Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాతావరణంలోని తేమ కారణంగా ఐరన్, స్టీలు పాత్రలు తుప్పు పట్టడం సహజమే. అయితే దీన్ని వదిలించడానికి స్టీల్ స్క్రబ్బర్ వంటివి వాడితే పాత్ర త్వరగా పాతబడిపోతుంది.. మెరుపూ తగ్గిపోతుంది. అందుకే దానికి బదులు ఆలూను ఉపయోగిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. దీనికోసం ఆలూను మందపాటి స్లైసుల్లా కట్ చేసుకోవాలి. ఒక స్లైస్‌ను గిన్నెలుతోమే సోప్ లిక్విడ్‌లో ముంచి లేదంటే బేకింగ్ సోడాలో అద్ది.. తుప్పు ఉన్న చోట నెమ్మదిగా రుద్దాలి. ఫలితంగా తుప్పు వదిలిపోతుంది. ఆ తర్వాత సోప్ లిక్విడ్‌తో శుభ్రం చేసి పొడిగా ఆరబెడితే సరిపోతుంది.