Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తులసి ఆకులను జలుబు, దగ్గును నయం చేయడానికి ఉపయోగిస్తారు. వీటిలో ప్రొటీన్, ఫైబర్, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే తులసి గింజలు ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్‌గా పనిచేస్తాయి. ఈ గింజల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ విత్తనాలు మనకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.
ఇది అనేక అంటువ్యాధుల నుంచే కాదు దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా రక్షిస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో తులసి అద్భుతమైన ఉపశమనాన్ని కలిగించింది. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు తులసి గింజలను కషాయం చేసి తాగవచ్చు.
మలబద్ధకం, అసిడిటీ గ్యాస్ సమస్య ఉంటే తులసి గింజలను నీటిలో వేసి నానబెట్టాలి. అవి ఉబ్బే వరకు వేచి ఉండాలి. ఆ తర్వాత నీటితో కలిపి వాటి తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య పూర్తి నయం అవుతుంది.
బెల్లిఫ్యాట్, అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నవారికి ఇది ఓ వరం. ఎందుకంటే వాటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ గింజలను తినడం వల్ల ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. దాని కారణంగా క్రమంగా బరువు తగ్గడం ప్రారంభమవుతుంది.
మీరు డిప్రెషన్ లేదా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టయితే తులసి గింజలను కచ్చితంగా తినండి. ఇలా చేయడం వల్ల ఆందోళన దూరమవుతుంది.