Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుమ్ము, మట్టి,పెరుగుతున్న కాలుష్యం మన ఆరోగ్యం, చర్మాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేస్తాయి. అయితే కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ సమస్యలన్నీ పొడి చర్మానికి దారితీస్తాయి. అయితే వీటన్నింటి నుంచి ఉపశమనం పొందేందుకు మీరు రసాయన ఉత్పత్తులను వాడుతుంటారు. ఈ ఉత్పత్తులు తక్షణ ఫలితాలను అందించవచ్చు కానీ కాలక్రమేణా చర్మాన్ని అనేక విధాలుగా దెబ్బతీస్తాయి. కాబట్టి కొన్ని ఇంటి చిట్కాలతో చర్మాన్ని కాపాడుకోవచ్చు. వాటిలో ఒకటి బాదం పాలు. బాదం పాలకు అనేక చర్మ, ఆరోగ్య సమస్యలను నయం చేసే శక్తి ఉంది. బాదం మిల్క్‌ను ముఖానికి రాసుకుంటే మొటిమల నుంచి వచ్చే అనేక ఇతర సమస్యలు నయమవుతాయి. ఇంకా వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం...
మీ చర్మం చాలా పొడిగా ఉంటే బాదం పాలు మీకు చాలా మేలు చేస్తుంది. దీనికోసం మీరు చల్లని పాలలో బాదం ముక్కలను వేసి పాలను మిక్సీలో రుబ్బుకోవాలి. తర్వాత ఈ పాలను ముఖానికి పట్టించి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల డ్రై స్కిన్ తొలగిపోయి ఇన్ఫెక్షన్ దరిచేరదు.
బాదం పాలు చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు పని చేస్తాయి. ఇందులో లాక్టిక్ యాసిడ్ కంటెంట్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది. దీని కోసం మీరు రాత్రంతా ముఖానికి బాదం పాలను అప్లై చేసి ఉదయాన్నే లేచి ముఖం కడుక్కోండి. ఇలా చేయడం వల్ల మీ ముఖం సహజమైన కాంతిని సంతరించుకుంటుంది.
బ్యూటీ ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంపై ముడతలు రావడం ప్రారంభమవుతాయి. ముడతలు పోవాలంటే బాదం పాలతో ముఖానికి మసాజ్ చేయండి. ఇవి వృద్ధాప్య ప్రభావం ముఖంపై కనిపించకుండా చేస్తాయి.