Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుడ్డు పాడైందో, లేదో తెలుసుకోవడానికి దాన్ని నీటిలో వేస్తే సరిపోతుంది. అది మునిగిన విధానాన్ని బట్టి గుడ్డు తాజాగా ఉందో, లేదో ఇట్టే పసిగట్టేయచ్చు. గాజు గిన్నెలో నీరు పోసి అందులో గుడ్డునుంచాలి. అది నీటిలో అడ్డంగా మునిగినట్త్లెతే తాజాగా ఉందని గుర్తించాలి. నీటిలో పూర్తిగా, కాస్త వంచినట్టుగా మునిగితే కోడి ఆ గుడ్డుని పెట్టి వారం రోజులైందని అర్థం. నీటిలో పూర్తిగా మునిగినప్పటికీ నిటారుగా ఉన్నట్త్లెతే.. అప్పటి గుడ్డు వయసు మూడు నుంచి నాలుగు వారాలున్నట్టు లెక్క. అలా కాకుండా నీటిలో తేలుతున్నట్త్లెతే అది బాగా పాత గుడ్డుగా పరిగణించాలి.