Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుతుంది. క్యాన్సర్, మధుమేహం వంటి అనేక వ్యాధులను కూడా డ్రాగన్ ఫ్రూట్ దూరం చేస్తుంది. లక్షల రూపాయల ఖర్చు చేయించే వ్యాధులను కూడా డ్రాగన్ ఫ్రూట్ తింటే దగ్గరకు రాకుండా చేసుకోవచ్చు. ఈ పండు ఏ వ్యాధుల నుంచి రక్షిస్తుందో తెలుసుకుందాం.
మధుమేహానికి: డ్రాగన్ ఫ్రూట్లో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఈ పండు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. దీనితో పాటు మధుమేహం లేని వారు డ్రాగన్ ఫ్రూట్స్ తింటే భవిష్యత్తులో మధుమేహం దరిచేరదు. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని కూడా నియంత్రిస్తుంది.
గుండెకు ప్రయోజనకరం: డ్రాగన్ ఫ్రూట్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒమేగా -3, ఒమేగా -9 కొవ్వు ఆమ్లాలు ఇందులో కనిపిస్తాయి. ఇది గుండెకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పండులో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
క్యాన్సర్ నుంచి ఉపశమనం: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యాంటిట్యూమర్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు డ్రాగన్ ఫ్రూట్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇది రొమ్ము క్యాన్సర్ నుంచి మహిళలను రక్షిస్తుంది. ఇంకా ఆర్థరైటిస్ వల్ల వచ్చే కీళ్ల నొప్పులలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుందని పలు అధ్యయనాల్లో తెలింది. అలాగే నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనితో పాటు డ్రాగన్ ఫ్రూట్ రోగనిరోధక శక్తిని పెంచే విధంగా కూడా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.