Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లో చాలా మంది లంచ్ లేదా డిన్నర్ తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఆఫీసులో లంచ్ తర్వాత బద్ధకాన్ని దూరం చేయడం చాలామందికి సవాలుగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే మధ్యాహ్న భోజనం తర్వాత బద్ధకాన్ని పోగొట్టుకోవచ్చు. చాలా మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం మధ్యాహ్నం కొంచెం నిద్రపోవడం ఆరోగ్యానికి శక్తి బూస్టర్‌గా పనిచేస్తుంది. కానీ ఆఫీసులో పడుకోవడం కుదరదు. అటువంటి పరిస్థితిలో చాలా మందికి మధ్యాహ్న భోజనం తర్వాత నిద్ర రావడం ప్రారంభమవుతుంది. బద్ధకం కారణంగా పూర్తిగా పనిలో నిమగమై ఉండరు. కాబట్టి ఆఫీస్‌లో నిద్రను వదిలించుకోవడానికి లంచ్ తర్వాత కూడా మీరు యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండగలిగేలా కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం...
ఇష్టమైన పాట వినండి: ఏ సందర్భంలోనైనా పాటలు వినడం శరీరానికి ఉత్తమ చికిత్సగా పనిచేస్తుంది. కాబట్టి భోజనం తర్వాత సోమరితనం తొలగించడానికి మీకు ఇష్టమైన పాటను వినవచ్చు. అయితే స్లో మోషన్ పాటలు వింటే నిద్ర వస్తుందని గుర్తుంచుకోండి. అందుకే ఎప్పుడూ ఆఫీసులో లంచ్ తర్వాత ఫాస్ట్ అండ్ పార్టీ సాంగ్స్ వినడం మంచిది. కానీ సంగీతం వినడానికి హెడ్ ఫోన్ మాత్రం కచ్చితంగా ఉపయోగించండి.
కాఫీ సహాయం: టీ, కాఫీలలో ఉండే కెఫిన్ శరీరంలోని బద్ధకాన్ని పోగొట్టి ఎనర్జీ లెవెల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. అయితే టీ తాగడం వల్ల కడుపులో గ్యాస్ సమస్యలు వస్తాయి. కాబట్టి లంచ్ తర్వాత ఒక సిప్ కాఫీ తీసుకుంటే నీరసానికి వీడ్కోలు చెప్పవచ్చు.
హైడ్రేటెడ్‌గా ఉండండి: ఆఫీసులో భోజనం చేసిన తర్వాత బద్ధకంగా అనిపిస్తే ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం మానుకోండి. లేదంటే దీని వల్ల మరింత నీరసంగా మారే అవకాశం ఉంది. ఆ సమయంలో కొంచెం చురుకుగా ఉండేందుకు ప్రయత్నించండి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి నీరు తాగుతూ ఉండండి.
తగినంత నిద్ర: రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయాన్నే లేవడం వల్ల చాలా సార్లు మీ నిద్ర అసంపూర్ణంగా ఉంటుంది. దీని కారణంగా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నీరసంగా అనిపించడం ప్రారంభమవుతుంది. అందువల్ల రొటీన్లో నిద్రతో అస్సలు రాజీ పడకండి. రాత్రిపూట కనీసం 7-8 గంటల నిద్రపోండి.