Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితంలో విజయం సాధించాలంటే కఠోర శ్రమ, నిజాయితీ ఒక్కటే సరిపోదు. దీర్ఘకాలిక విజేత అవ్వాలంటే మాట్లాడే నైపుణ్యాలు కూడా అవసరం. మీరు కొత్త ఆలోచనలను ఇచ్చిపుచ్చుకోవడంలో, ఆలోచనలను పంచుకోవడంలో నైపుణ్యం కలిగి ఉన్నప్పుడు అవి మీకు ప్రత్యేకంగా నిలబడడంలో సహాయపడతాయి.
ఇతరులు చెప్పేది వినండి: మరొక వ్యక్తితో మాట్లాడేటప్పుడు, వారి అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి వారికి అవకాశం ఇవ్వండి. వాళ్ళను పెదవి విప్పనీయకుండా మీరు ఒక్కరే మాట్లాడి మీ అభిప్రాయాలను వారిపై రుద్దడం మంచి అలవాటు కాదు. ఇతరులు చెప్పేది వినడం వల్ల కొత్త విషయాలు నేర్చుకుంటారు.
సహాయం కోసం అడగండి: సంకోచం లేకుండా ఇతరుల సహాయం అడగడంలో తప్పు లేదు. వెనుకకు నిలబడకుండా సహాయం కోసం అడగడం ఇతరులు మిమ్మల్ని తప్పుగా అంచనా వేస్తారని భావించవద్దు. ఇది మీ ఇద్దరి మధ్య స్నేహాన్ని ఏర్పరుస్తుంది. ఇది దీర్ఘకాలిక విజయానికి పునాది వేస్తుంది.
ముఖం తిప్పుకోవద్దు: ఎదుటి వ్యక్తి ఎంతో ఆసక్తిగా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వాటిని పట్టించుకోకుండా ముఖం తిప్పుకోవడం చెడ్డ అలవాటు. మీరు ఎవరినైనా వారి మాటలకు విలువ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే, ఆ తర్వాత వారు మీతో మాట్లాడటానికి ఇష్టపడరు.
బాధ్యత వహించండి: మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా వాగ్దానాలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాత్మకంగా చెప్పాలి. ఎందుకంటే మీ వాగ్దానాన్ని నెరవేర్చడం మీ బాధ్యత. దాని నుండి వెనక్కి తగ్గకండి.
నిబంధనలను పాటించండి: మీరు నా జీవితం, నా ఇష్టం అని భావించే విధంగా ప్రవర్తించవద్దు. ప్రతి ఒక్కరికీ సాధారణ కట్టుబాటు ఏది అయినా, మీరు దానిని అనుసరించాలి. మీరు మీ సంఘంలోని వ్యక్తులను అనుసరించినప్పుడు, మీరు వారికి మరింత దగ్గరవుతారు. విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి.
ఇతరులను బాధించవద్దు: ఇతరులను బాధపెట్టే పనులు ఎప్పుడూ చేయవద్దు. ప్రయాణం కష్టంగా ఉన్నప్పుడు స్నేహితులు లేదా సహోద్యోగుల కోసం కొంచెం త్యాగం. అయితే అది అందరికీ ఒకేలా ఉండాలని కాదు.