Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వీధి బాలలు... వీరికి ఓ అందమైన బాల్యం లేదు.. రోడ్లపై తిరుగుతూ, దొరికింది తింటూ సమాజంలో ఓ గుర్తింపు లేకుండా జీవిస్తున్నారు. అలాంటి వారిలోనూ మాణిక్యాలను వెలికి తీస్తున్నాయి కొన్ని స్వచ్ఛంధ సంస్థలు. ప్రస్తుతం ఎఫ్ఐఎఫ్ఏ ప్రపంచ కప్‌తో పాటు మరో ప్రపంచ కప్ సంచలనం సృష్టిస్తోంది. అదే నాల్గవ స్ట్రీట్ చైల్డ్ సాకర్ ప్రపంచ కప్. ఇది ప్రస్తుతం దోహాలో జరుగుతోంది. ఈ ఈవెంట్‌ను యుకేకు సంబంధించిన లాభాపేక్ష లేని సంస్థ స్ట్రీట్ చైల్డ్ యునైటెడ్ నిర్వహిస్తోంది. అందులో చెన్నైకి చెందిన అమ్మాయిలు మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విమానం దగ్గర చూస్తామని కలలో కూడా ఉహించని ఆ అమ్మాయిలు ఏకంగా ఆకాశంలో దూసుకుపోతున్నారు.
2015లో చెన్నైలోని సందడిగా ఉండే కోయంబేడు ప్రాంతంలో తన తల్లి, ఐదుగురు అక్కచెల్లెళ్ళతో కలిసి గడిపిన వీధి బాలిక ఎస్.సంధియా. ఆమె తన ఐదుగురు అక్కచెళ్ళతో స్థానిక మార్కెట్లో తిరుగుతూ కూరగాయలు ఏరుకుని వాటిని అమ్మి డబ్బు సంపాదించుకుంటుంది. రాత్రి పూట కూడా వారు ఇంటికి వెళ్ళకుండా ఆ మార్కెట్లోనే పడుకున్నారు. నిర్మానుష్యంగా వుండే వీధులు, ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ, అప్పుడప్పుడు వచ్చే శబ్దాలను వింటూ కలత నిద్ర పోతున్నారు. నక్షత్రాల కింద నిద్రలేని రాత్రులను ఏడేండ్లు గడిపిన తర్వాత స్ట్రీట్ చైల్డ్ ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా దోహాకు విమానం ఎక్కుతానని సంధియా కలలో కూడా అనుకోలేదు.
24 దేశాల వీధి బాలలు
కతార్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో నిర్వహించబడుతున్న స్ట్రీట్ చైల్డ్ వరల్డ్ కప్ (SCWC) వారి నాల్గవ ఎడిషన్ దోహాలో అక్టోబర్ 7 నుండి 15 వరకు జరుగుతోంది. ఇందులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై నుండి తొమ్మిది మంది బాలికలు ఉన్నారు. వీరంతా ఆశ్రయం ఉన్న కరుణాలయలో ఉన్నారు. ఇదే ఈ వీధి పిల్లలకు ఇల్లు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వీధి బాలలు ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని FIFA, యుకే ఆధారిత లాభాపేక్షలేని సంస్థ స్ట్రీట్ చైల్డ్ యునైటెడ్ ఈ ఈవెంట్‌ను నిర్వహించింది. FIFA ప్రపంచ కప్‌కు ఒక నెల ముందు నిర్వహించబడుతుంది. SCWC బ్రెజిల్, బంగ్లాదేశ్, బొలీవియా, కొలంబియా, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, పాలస్తీనా, పెరూ, ఫిలిప్పీన్స్, USA, జింబాబ్వే, బోస్నియా, హెర్జెగోవినా, బురుండిలతో కూడిన దాదాపు 24 దేశాల నుండి వీధి పిల్లలను ఏకం చేస్తుంది. ఇంకా ఇందులో ఈజిప్ట్, ఇంగ్లండ్, హంగేరీ, మారిషస్, నేపాల్, పాకిస్తాన్, ఖతార్‌తో పాటు ఇతర దేశాలు కూడా ఉన్నాయి.
ఉత్సాహంగా ఉన్నాను
''విమానం లోపల కూర్చున్నప్పుడు నా చుట్టూ ఉన్న వాటిని చూసి నేను ఆశ్చర్యపోయాను. విమానం కదలడం ప్రారంభించినప్పుడు ఉత్సాహంగా ఉన్నాను. కానీ మేఘాల కారణంగా విమానంలో కొన్ని గడ్డలు ఏర్పడినప్పుడల్లా భయాందోళనకు గురయ్యాను'' అని సంధియా తన మొదటి విమాన ప్రయాణంలో చెప్పింది. ఎన్జీఓలోని అధికారులు ఆమె పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయడం ప్రారంభించినప్పుడు తనూ జట్టులో భాగంగా ఉన్నానని, అయితే కెప్టెన్‌గా ఎంపిక కావడం ఎంతో ఆశ్చర్యం కలిగించిందని ఆమె చెప్పింది. ''అది విన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను'' ఆమె ఆశ్చర్యంగా చెప్పింది.
ఒకే విధమైన కథలు ఉన్నాయి
ప్రస్తుతం సంధియా 12వ తరగతి చదువుతోంది. కరుణాలయ లబ్ధిదారులకు అందించే శిక్షణ, కోచింగ్‌లో ఈ క్రీడ పెద్ద భాగం కావడంతో ఆమె చాలా సంవత్సరాలుగా గేమ్ ఆడుతోంది. అందరికంటే భిన్నంగా ఉండటమే కాకుండా, ఆమె మంచి డాన్సర్, స్కౌట్స్ లీడర్ కూడా. ''బంతిని కొట్టడానికి నా ఎడమ కాలును ఉపయోగించాలనుకుంటున్నాను. నా సహచరులను ఉత్సాహపరచడం, ప్రోత్సహించడం నాకు చాలా ఇష్టం'' అని సంధియా చెప్పింది. ఈ సహచరులందరికీ జీవితంలో ఒకే విధమైన కథలు ఉన్నాయి. వారిలో ప్రతి ఒక్కరికీ జట్టులో భాగం కావడం గర్వించదగిన విషయం. ఉదాహరణకు 17 ఏండ్ల ప్రియను తీసుకోండి. ఆమె పుట్టినప్పటి నుండి తన తల్లిదండ్రులను చూడలేదు. చిన్నతనం నుండి ఆమె తన చిన్న తమ్ముడితో కలిసి అనేక అనాథాశ్రమాలలో నివసిస్తుంది. చివరకు ఓ శ్రేయోభిలాషి జోక్యం చేసుకోవడంతో కరుణాలయకు తీసుకువచ్చారు. దోహాలో తన అనుభవం గురించి మాట్లాడుతూ ఆమె బ్రెజిల్, బురుండి, ఫిలిప్పీన్స్ వంటి ఇతర దేశాల నుండి ఇప్పటికే కొత్త స్నేహితులను సంపాదించుకున్నానని చెప్పింది.
జట్టు సభ్యులు వీరే
''నేను ఉదయం 5 గంటలకు మేల్కొంటారు. 7.15 గంటలకు అల్పాహారం తీసుకుంటాను. తర్వాత మేము వేదిక వద్దకు వెళతాము. వివిధ సెషన్లకు హాజరవుతాము. ఇతర పిల్లలతో డ్యాన్స్, మిక్స్లింగ్ను కూడా ఆనందిస్తాము'' అని ప్రియా చెప్పింది. సంధియా, ప్రియతో పాటు తొమ్మిది మంది సభ్యులున్న ఈ జట్టులో వి.పవిత్ర (14), దివ్య దర్శిని (15), గోల్‌కీపర్ సాధ ఎస్ (17), శాంతియా.ఎం (17), సిలంబరసి (15), శరణ్య (15), జె. మతుమేత (17) ఉన్నారు.
గుర్తింపు లేని వారి కోసం పాస్‌పోర్ట్‌లు
కరుణాలయ సోషల్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకుడు, కార్యదర్శి ఎన్. పాల్ సుందర్ సింగ్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల నుండి వచ్చిన పిల్లలందరూ గత ఆరు నెలలుగా ప్రత్యేక కోచ్‌లతో శిక్షణ పొందుతున్నారు. అయితే కరుణాలయకు వారి పాస్‌పోర్ట్‌లు లభించడమే అతిపెద్ద సవాలు. కొంతమంది అమ్మాయిలకు జనన ధృవీకరణ పత్రాలు లేవు. వారి తల్లిదండ్రుల వద్ద దరఖాస్తు చేయడానికి అవసరమైన ఐడీలు లేనందున పాస్‌పోర్ట్ పొందడం చాలా ఆందోళన కలిగించింది. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు మేము మొదట తల్లిదండ్రులకు, ఆపై పిల్లలకు ఐడీలను సంపాదించాలి. ఈ ప్రక్రియం మొత్తం పూర్తి చేసి పాస్‌పోర్ట్ పొందడానికి ఒక సంవత్సరం పట్టింది'' అని ఆయన చెప్పారు.
ఇతర పిల్లల్లో స్ఫూర్తి నింపుతారు
జట్టు నాయకుడిగా ఉన్న పాల్‌తో సహా ముగ్గురు పెద్దలు బృందంతో పాటు ఉన్నారు. అమ్మాయిల మేనేజర్, కేర్‌టేకర్ అయిన గ్రేస్ బెరిల్ క్రిస్టీ వారికి తోడుగా ఉంటారు. ''అమ్మాయిలు దోహా నుండి తిరిగి వచ్చిన తర్వాత వారు తమ విద్యను, వారి క్రీడా అభ్యాసాన్ని కొనసాగిస్తారు. స్థానిక ఫుట్‌బాల్ టోర్నమెంట్లలో కూడా పాల్గొంటారు. వారు తమ కథలు, అనుభవాలను ఇతర వీధి పిల్లలతో పంచుకుంటారు. వారికి స్ఫూర్తినిచ్చి కలలను సాధించడంలో వారికి సహాయపడతారు'' అని పాల్ చెప్పారు.
ఫుట్‌బాల్‌పై వారి ప్రేమ
దోహాలో టీం ఇండియా బాలికల జట్టుతో పాటు SCWC 22 కోసం జలంధర్‌కు చెందిన NGO YFC రుర్కా కలాన్ ట్రయల్స్‌లో పాల్గొన్న 300 మందికి పైగా ఎంపిక చేసిన 10 మంది అబ్బాయిలతో కూడిన టీమ్ ఇండియా బాయ్స్ కూడా దోహాలో జరిగే ఈవెంట్లో పాల్గొంటున్నారు. చాలా మంది ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యాల నుండి వచ్చిన అబ్బాయిలకు ఒక ఉమ్మడి విషయం ఉంది. ఫుట్‌బాల్‌పై వారి ప్రేమ, క్రీడల శక్తిపై నమ్మకం. YFC రుర్కా కలాన్ అనేది జలంధర్‌కు చెందిన ఎన్జీఓ ఫుట్‌బాల్‌ను సామాజిక మార్పు కోసం సాధనంగా ఉపయోగించి స్థానిక యువతను శక్తివంతం చేయడానికి పని చేస్తుంది. కరుణాలయ, YFC రూర్కా కలాన్ అనే రెండు ఎన్జీఓలు పేద, వీధి బాలలతో పనిచేస్తున్నాయి.
మహిళల విజయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
MySports, స్పోర్ట్స్-టెక్ స్టార్టప్, భారతదేశం కోసం గ్రాస్‌రూట్ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌ను నిర్మిస్తోంది. ఈవెంట్ అధికారిక స్ట్రీమింగ్ భాగస్వామి. మాజీ భారత ఫస్ట్-క్లాస్ క్రికెటర్, MySports, డిస్ట్రిబ్యూషన్ డ అలయన్స్ ప్రెసిడెంట్, శిశిర్ హట్టంగడి మాట్లాడుతూ ''మహిళలు గ్లోబల్ స్థాయిలో క్రీడలను ఉన్నతీకరించారు. క్రికెట్, హాకీ, అథ్లెటిక్స్‌లో మహిళల విజయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆడపిల్లలు క్రీడా ప్రవాసులపై తీవ్ర ప్రభావం చూపుతున్నారు. ఇది భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం'' అన్నారు. ఇటీవలె అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నాము. చెన్నైకి చెందిన ఈ స్పూర్తిదాయకమైన బాలికల ధైర్య కథల కంటే మెరుగైన నిదర్శనం మరొకటి లేదు.