Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం ఎంతో మంది మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారు. గంట కిందట జరిగిన దాన్ని కూడా గుర్తు పెట్టుకోలేకపోతున్నారు. బైక్, కార్ల కీలు మరచిపోవడం, స్టవ్‌పై పాలు పెట్టి మరచిపోవడం.. దాదాపు అందరి ఇళ్లల్లో జరుగుతుంటాయి. భర్త ఏదైనా చెప్పినా.. భార్య ఏ పనైనా అప్పగించినా.. అయ్యో.. మరచిపోయామనడం సర్వసాధారణమైంది. అయితే మతి మరుపు గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకోవడం ద్వారా జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా మంది జ్ఞాపకశక్తి కోసం పలు రకాల మందులు వాడతారు. కానీ అవి ఆరోగ్యానికి మంచిది కాదు. కొన్ని ఆహార పదార్థాలతో కూడా జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు.
బాదం: బాదంపప్పులో విటమిన్ బి6, విటమిన్ ఇ తో పాటు అనే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి. బాదంలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది. బాదం తింటే స్థూలకాయం కూడా రాదు.
అవిసె, గుమ్మడి గింజలు: వీటిలో విటమిన్ కె, ఎ, సి, బి6, ఐరన్, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అవిసె, గుమ్మడి గింజలు తరచూ తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
వాల్ నట్: ఇది మెదడుకు సూపర్ ఫుడ్‌లా పనిచేస్తుంది. వాల్‌నట్స్‌లో ఆల్ఫా లినోలెనిక్ అనే ఒమేగా-3 ఆమ్లాలు ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తాయి.
జీడిపప్పు: జీడిపప్పు తినడం వల్ల జ్ఞాపకశక్తి బాగా మెరుగుపడుతుంది. ఇందులో ప్రొటీన్, విటమిన్ సి వంటి పోషకాలు లభిస్తాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. జీడిపప్పు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది.